Anakapalli District: అనకాపల్లిలో విచిత్రమైన కేసు నమోదైంది. బహిరంగంగా కోడి తలపై కొట్టినందుకు ఓ డ్యాన్స్ ట్రూప్‌పై కేసు రిజిస్టర్ అయింది. విష్ణు ఎంటర్‌టైన్‌మెంట్ అనే డ్యాన్స్ ట్రూప్ అనకాపల్లిలో ఓ కార్యక్రమంలో పాల్గొంది. ఆ కార్యక్రమంలో చేసిన డ్యాన్స్ వివాదంగా మారింది.
కార్యక్రమంలో పాల్గొన్న డ్యాన్స్ బృందం ఓ కోడిని బహిరంగంగా కొట్టినందుకు కేసు నమోదైంది. కోడి తలపై కొడుతూ డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించి కేసు పెట్టారు. చిన్నపిల్లలు, మిగతా వారంతా చూస్తుండగానే కోడిని తలపై కొడుతూ హింసించారని వచ్చిన ఫిర్యాదు మేరకు అనకాపల్లి పోలీసులుకేసు నమోదు చేశారు.
పెటా చట్టం కింద ప్రాణులను హింసించకూడదు. అయితే ఇక్కడ కోడిని కొడుతూ హింసించినందుకు పోలీసులు జులై ఆరున 429 ఆర్/డబ్ల్యూ 34 ఆఫ్ ఐపీసీ , సెక్షన్ 11(1) (a) జంతువులపై హింసను నిరోధించే 1960 చట్టం కింద కేసు నమోదు చేశారు.