ఆసుపత్రిలో మాధురి- చూడాలని ఉందంటున్న దువ్వాడ
వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రానికి ఇప్పట్లో ఎండ్ కార్డు పడేలా కనిపించడం లేదు. ఇంట్లో నుంచి దువ్వాడ బయటకు రావడం లేదు. ఇంటి బయటే ఆయన భార్య కుమార్తెలు టెంట్ వేసుకొని ధర్నాకు కూర్చొని ఉన్నారు. ఆత్మహత్యాయత్నం చేసుకున్నానని చెప్పిన స్నేహితురాలు మాధురి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి ఈ స్టోరీకి ఇక్కడే ఇంటర్వెల్ బ్యాంగ్ పడింది. ఇంకా చదవండి
తుంగభద్ర డ్యాం భద్రమేనా? గేటు ఎలా కొట్టుకుపోయింది?
ఎగువ కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. జలాశయంలోని 19వ గేటు వరద ప్రవాహానికి చైన్ లింకు తెగి కొట్టుకు పోయింది. దీంతో జలాశయంలోని నీరు లక్ష క్యూసెక్కులకుపైగా నదిలోకి వెళ్తుంది. తుంగభద్ర జలాశయం గేటు కొట్టుకుపోవడంతో అసలు తుంగభద్ర జలాశయం ఇతర గేట్ల పరిస్థితి ఎలా ఉంది. గేటు కొట్టుకపోవడానికి నిర్వహణ లోపమా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అని అధికారులు సమీక్షిస్తున్నారు. ఇంకా చదవండి
దక్షిణ కొరియాలో అడుగు పెట్టిన రేవంత్ బృందం
అమెరికాలో పర్యటించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు దక్షిణకొరియాలో పెట్టుబడుల అన్వేషణలో పడ్డారు. అమెరికా పర్యటన విజయవంతమైందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. దాదాపు 30వేల కోట్లకుపైగా పెట్టుబడులు తెలంగాణలో పెట్టేందుకు వివిధ సంస్థల ప్రతినిధులు అంగీకారం తెలిపారని అంటున్నారు. అమెరికా పారిశ్రామికవేత్తలను ఆకర్షించడంలో రేవంత్ విజయవంతమయ్యారని అంటున్నారు. ఇంకా చదవండి
తప్పిన కేటీఆర్ అంచనాలు
కవిత బెయిల్ ప్రాసెస్‌లో ఉందని వచ్చే వారంలో బెయిల్ వస్తుందని కేటీఆర్ అంచనాలు తలకిందులు అయ్యాయి. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయలేదు. సీబీఐ, ఈడీ వాదనలు విన్న తర్వాతనే నిర్ణయం ప్రకటిస్తామని వాటికి నోటీసులు జారీ చేసింది. మార్చి పదిహేనో తేదీ నుంచి జైల్లో ఉంటున్న ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు జస్టిస్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం నిరాకరించింది. ఇంకా చదవండి
తిరుమల ఘాట్ రోడ్డుపై చిరుత సంచారం
శ్రీవారి భక్తులను చిరుతల భయం వెంటాడుతోంది.. ఒక చిరుత చిక్కిందని ఊపిరి పీల్చుకునే లోపు... మరో చిరుత కనిపించిందన్న వార్త భక్తులకు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. తాజాగా తిరుమల దారిలో చిరుత సంచరిస్తుందన్న వార్త మరోసారి గుబులు పుట్టిస్తోంది. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో మొదటి ఘాట్ రోడ్డులోని 55, 56 మలుపు సమీపంలో ఒక చిరుత రోడ్డు దాటి అడవిలోకి వెళ్లినట్టు భక్తులు గుర్తించి టీటీడీ భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన అధికారులు అటవీ శాఖ అధికారులతో మాట్లాడారు. భక్తుల భద్రత దృష్ట్యా ద్విచక్ర వాహనాల రాకపోకలపై అధికారులు కొన్ని భద్రతా పరమైన చర్యలు తీసుకున్నారు. ఇంకా చదవండి