Mufasa The Lion King Release Date: డిసెంబర్ 20న థియేటర్లలోకి వస్తున్న లైవ్ యాక్షన్ ఫిల్మ్ 'ముఫాసా: ది లయన్ కింగ్'. హాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే కాదు... యావత్ ప్రపంచం అంతా ఎదురు చూస్తున్న చిత్రమిది. ఇంగ్లీష్ ఒక్కటే కాదు... మన దేశంలో హిందీ, తెలుగు, తమిళ భాషల్లోనూ డబ్బింగ్ వెర్షన్ విడుదల కానుంది. ఇవాళ 'ముఫాసా: ది లయన్ కింగ్' (Mufasa In Hindi) హిందీ ట్రైలర్ విడుదల చేశారు. అందులో స్పెషాలిటీ ఏమిటో తెలుసా?


యంగ్ ముఫాసాకు వాయిస్ ఇచ్చిన అబ్ రామ్!
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan)తో పాటు ఆయన కుమారులు ఆర్యన్ ఖాన్ (Aryan Khan), అబ్ రామ్ ఖాన్ (Abram Khan)... ఈ ముగ్గురూ 'ముఫాసా: ది లయన్ కింగ్'కు వాయిస్ ఓవర్ ఇచ్చారు. 


'ది లయన్ కింగ్' 2019లో విడుదల అయ్యింది. అప్పుడు ఆ సినిమాలో ముఫాసా పాత్రకు షారుఖ్, సింబా పాత్రకు ఆర్యన్ గాత్రదానం చేశారు. అదీ హిందీ వెర్షన్ వరకు. 2019లో విడుదలైన సినిమాకు 'ముఫాసా: ది లయన్ కింగ్' ప్రీక్వెల్. ఈ లేటెస్ట్ సినిమాలో ముఫాసా యంగ్ రోల్, కింగ్ రోల్ ఉన్నాయి. యంగ్ ముఫాసాకు అబ్ రామ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆ చిన్నారికి ఇది సిల్వర్ స్క్రీన్ డెబ్యూ అని చెప్పాలి. 


అబ్ రామ్ అంటే బాలీవుడ్ ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ చిన్నారి ఏ అకేషన్, ఈవెంట్‌కు వెళ్లినా ఫోటోగ్రాఫర్లు వెంటపడతారు. ఇప్పుడు అబ్ రామ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే... హిందీలో సినిమాకు స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుందని చెప్పాలి. సిల్వర్ స్క్రీన్ మీద యాక్టింగ్ డెబ్యూ కంటే ముందు షారుఖ్ చిన్న కొడుకు అబ్ రామ్ వాయిస్ డెబ్యూ అవుతుందని చెప్పాలి.


Also Read: 'కమిటీ కుర్రోళ్ళు' చూస్తా... సూపర్ స్టార్ మహేష్ ట్వీట్ - నిహారిక గురించి ఏం చెప్పారంటే?






షారుఖ్ ఖాన్, ఆర్యన్ ఖాన్, అబ్ రామ్ ఖాన్ కోసం హిందీ ఆడియన్స్ ఈ సినిమా చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. 'ముఫాసా: ది లయన్ కింగ్' సినిమాకు బేరీ జెన్కిన్స్ దర్శకత్వం వహించారు. అద్భుతమైన లైవ్ యాక్షన్ సినిమాగా దీనిని ఆయన తీర్చిదిద్దారు. విజువల్స్, యాక్షన్ భాషలకు అతీతంగా ప్రేక్షకులు అందరినీ అలరిస్తాయని చిత్ర బృందం పేర్కొంది. 



'ముఫాసా: ది లయన్ కింగ్' గురించి షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ... ''ముఫాసా అడవికి రాజు. తన వారసత్వాన్ని, జ్ఞానాన్ని తన కొడుకు సింబాకు అందిస్తాడు. తండ్రీ కొడుకుల ప్రయాణం నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కనుక నేను ఎక్కువ కనెక్ట్ అయ్యాను. ముఫాసా జీవితంలో బాల్యం నుండి రాజుగా ఎదిగే వరకు ఈ సినిమాలో చూపించారు. ముఫాసా పాత్రకు మరోసారి గాత్రదానం చేయడం సంతోషంగా ఉంది. నాకు డిస్నీతో ప్రత్యేక అనుబంధం ఉంది. అయితే... ఈ సినిమాలో నా కుమారులు ఆర్యన్, అబ్రామ్ ఇద్దరూ భాగం కావడం నాకు మరింత ప్రత్యేకం'' అని చెప్పారు.


Also Readపక్కోడు... పకోడీలు... పట్టించుకుంటే పనులు జరగవ్ - రామ్ సెన్సేషనల్ కామెంట్స్