Puri Jagannadh Emotional Speech: డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన లేటెస్ట్ సినిమా 'డబుల్ ఇస్మార్ట్' (Double iSmart Movie). ఆగస్టు 15న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతోంది. సూపర్ హిట్ 'ఇస్మార్ట్ శంకర్'కు సీక్వెల్ ఇది. విజయ్ దేవరకొండ హీరోగా తీసిన 'లైగర్' ఫ్లాప్ తర్వాత పూరి నుంచి వస్తున్న సినిమా. ఇది సూపర్ హిట్ కావడం ఆయనకు అవసరం. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో లాస్ట్ ఫిల్మ్ ఫ్లాప్ కావడం గురించి, తనకు వచ్చిన ఓ ఫోన్ గురించి పూరి జగన్నాథ్ చెబుతూ ఎమోషనల్ అయ్యారు.
ఫ్లాప్ తీస్తే చూడలేనని చెప్పిన రాజమౌళి తండ్రి!
Vijayendra Prasad called Puri Jagannadh: 'లైగర్' విడుదలైన వారం తర్వాత తనకు విజేంద్ర ప్రసాద్ నుంచి ఫోన్ వచ్చిందని పూరి జగన్నాథ్ చెప్పారు. ఆ సంభాషణ గురించి ఆయన చెబుతూ... ''సాధారణంగా హిట్ సినిమా తీసినప్పుడు చాలా మంది ఫోనులు చేస్తారు. అప్రిషియేట్ చేస్తారు. ఫ్లాప్ సినిమా తీసినప్పుడు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. పోయిన సినిమా (లైగర్) ఫ్లాప్ అయ్యింది. సరిగా ఆడలేదు. ఫ్లాప్ అయిన వారం తర్వాత విజయేంద్ర ప్రసాద్ ఫోన్ చేశారు. ఆయన ఎప్పుడూ నాకు ఫోన్ చేయరు. సడన్ గా ఫోన్ వస్తుందేంటి? అని లిఫ్ట్ చేశా. 'సార్... నాకు చిన్న హెల్ప్ చేస్తారా?' అని అడిగారు. ఆయన కొడుకు రాజమౌళి. పెద్ద డైరెక్టర్. నేను ఏం చేయాలని అనుకున్నా. చెప్పండని అడిగా. నెక్స్ట్ సినిమా చేసే ముందు తనకు కథ చెప్పమని అడిగారు. 'మీ లాంటి దర్శకుడు ఫ్లాప్ తీస్తే చూడలేను' అని అన్నారు. నా మీద ఆయనకు ఉన్న ప్రేమ, అభిమానంతో ఫోన్ చేశారు. కథ ఆయనకు చెప్పలేదు. మనకు తెలిసిన పని, ఒళ్ళు దగ్గర పెట్టుకుని సినిమా తీద్దామని తీశా. విజయేంద్ర ప్రసాద్ గారు... లవ్ యు'' అని అన్నారు.
Also Read: పక్కోడు... పకోడీలు... పట్టించుకుంటే పనులు జరగవ్ - రామ్ సెన్సేషనల్ కామెంట్స్
రామ్ లేకపోతే ఇస్మార్ట్ శంకర్ క్యారెక్టర్ లేదు, సినిమా లేదు!
''డబుల్ ఇస్మార్ట్' గురించి మాట్లాడాలంటే ఒకే ఒక పేరు రామ్ పోతినేని. అతని ఎనర్జీ ఈ సినిమా'' అని పూరి జగన్నాథ్ చెప్పారు. అతను పెర్ఫార్మన్స్ చేయడం వల్లే ఇస్మార్ట్ శంకర్ క్యారెక్టర్ వచ్చిందని, లేకపోతే శంకర్ లేడని చెప్పారు. ఇంకా ఈ సినిమా గురించి పూరి జగన్నాథ్ మాట్లాడుతూ... ''సంజు బాబా (సంజయ్ దత్)కి నేను పెద్ద ఫ్యాన్. ఆయన మా సినిమాలో చేయడం వల్ల 'డబుల్ ఇస్మార్ట్'కు కొత్త కలర్ వచ్చింది. కావ్య థాపర్ చక్కగా నటించడడమే కాదు... తెలుగు నేర్చుకుని డబ్బింగ్ చెప్పింది. ఈ సినిమాలో ఆలీ గారి ట్రాక్ 15 ఏళ్ల క్రితం రాశా. ఆ కామెడీ అందరూ ఎంజాయ్ చేస్తారు. ఛార్మి కౌర్ మా కంపెనీ స్ట్రెంత్. ప్రొడక్షన్ అంత ఈజీ కాదు... పని చెబితే చేసుకుని వస్తుంది. కష్టాల్లో తను నిలబడింది. ఛార్మి వెనుక విష్ రెడ్డి నిలబడతాడు. నా దగ్గర రూపాయి లేకపోయినా సరే... రోడ్డు మీద ఉన్నా సరే... నేను వెనక్కి తిరిగి చూడాల్సిన పని లేదు. విషు ఉంటాడు. ఆగస్టు 15న థియేటర్లలో కలుద్దాం'' అని అన్నారు.