Ravi Teja About 'Ride' Remake: మాస్ మహారాజా రవితేజ హీరోగా, దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్‘. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమా ఆగష్టు 15న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా హిందీ మూవీ ‘రైడ్‘కు రీమేక్ గా తెరకెక్కింది. త్వరలో ఈ మూవీ విడుదలకానున్న సందర్భంగా చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా యాంకర్ సుమకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో, హీరోయిన్లు రవితేజ, భాగ్యశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘మిస్టర్ బచ్చన్‘ సినిమా అసలు ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చిందో రవితేజ వెల్లడించారు.
హరీష్ శంకర్ ఎంటర్ కాగానే ఓకే చెప్పాను- రవితేజ
గతంలో ‘రైడ్’ సినిమా రీమేక్ కు సంబంధించిన ఆఫర్ వచ్చినా చేయలేదని చెప్పారు రవితేజ. హరీష్ శంకర్ ఎంటర్ కావడంతో ఓకే చెప్పానన్నారు. “’మిస్టర్ బచ్చన్’ సినిమాను ఒప్పుకోవడానికి కారణం ఉంది. హరీష్ శంకర్ డైరెక్టర్ అని, స్టోరీ నచ్చి అని కాదు, ‘రైడ్‘ అనే రీమేక్ ఫిల్మ్ చేయాలని గతంలోనే ఒక ఆఫర్ వచ్చింది. అప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు. నచ్చింది కానీ, చేయాలి అనిపించలేదు. ఎప్పుడైతే హరీష్ శంకర్ ఎంటర్ అయ్యాడో అప్పుడు చేయాలి అనిపించింది. ఎందుకంటే తను అసలు కథను పూర్తిగా మార్చేయగలడు. ఆ విషయాన్ని తను ఫ్రూవ్ చేసుకున్నాడు. సినిమా విడుదలయ్యాక చూస్తే, అసలు ‘రైడ్‘కు దీనికి సంబంధమే ఉండదు. ఈ సినిమాను మళ్లీ రీమేక్ చేస్తారు” అని చెప్పుకొచ్చారు.
ఓ రేంజిలో ఆకట్టుకోనున్న రవితేజ, జగపతి బాబు మధ్య సీన్లు
ఇక ‘మిస్టర్ బచ్చన్’ సినిమాలో సీనియర్ నటుడు జగపతి బాబు నెగెటివ్ రోల్ పోషిస్తున్నారు. రవితేజ, జగపతి బాబు మధ్య సీన్లు ప్రేక్షకులను ఓ రేంజిలో ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది. పవర్ ఫుల్ ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్ గా రవితేజ దుమ్మురేపనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇద్దరి మధ్య సన్నివేశాలు ప్రేక్షకులలో గూస్ బంప్స్ తెప్పించనున్నాయట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ పనులు పూర్తి అయ్యాయి. యు/ఎ సర్టిఫికేట్ ను జారీ చేశారు. సినిమా డ్యురేషన్ 2.38 నిమిషాలుగా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. కామెడీ, రొమాన్స్, యాక్షన్ తో రవితేజ ఆకట్టుకోబోతున్నారట.
అటు ‘మిస్టర్ బచ్చన్’ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. అయనంకా బోస్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజకు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది.
Read Also: ‘డబుల్ ఇస్మార్ట్’ కోసం ఆ మూవీని వదులుకున్న సంజయ్ దత్, అసలు విషయం చెప్పిన రామ్ పోతినేని
Read Also: హీరోగా మారబోతున్న సూపర్ హిట్ సినిమాల డైరెక్టర్ - లుక్ మార్చడం వెనుక కారణం అదేనా?