Ram Potineni About Sanjay Dutt: టాలీవుడ్ మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన తాజా సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’. వీరిద్దరి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’కు కొనసాగింపుగా ఈ సినిమా రాబోతోంది. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగష్టు 15న ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీగా అంచనాలు పెంచింది. మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా టాలీవుడ్ కమెడియన్ అలీ ‘డబుల్ ఇస్మార్ట్’ టీమ్ ను ఇంటర్వ్యూ చేశారు. హీరో రామ్, హీరోయిన్ కావ్యా థాపర్, నటుడు గెటప్ శ్రీను ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు వెల్లడించారు.
ఈ సినిమా కోసం సంజయ్ మరో మూవీ డేట్స్ క్యాన్సిల్ చేశారు- రామ్
‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ పాత్ర అద్భుతంగా ఉండబోతుందన్నారు రామ్. ఈ సినిమా డేట్స్ కోసం ఆయన మరో మూవీ డేట్స్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందన్నారు. “ఈ సినిమా స్క్రిప్ట్ గురించి డిస్కర్షన్ జరిగే సమయంలో విలన్ ఎవరు అయితే బాగుంటుంది అనే చర్చ వచ్చింది. అందరం సంజయ్ దత్ గారు అయితే బాగుంటారు అనుకున్నాం. ఆయన అప్పటికే 7 సినిమాలకు సైన్ చేశారు. డేట్స్ లేవు. అప్పటికే ‘కేజీఎఫ్‘ కూడా అయిపోయింది. డేట్స్ ఇంపాజిబుల్ అన్నారు. కానీ, పూరి గారు కావాలి అనుకుంటే వదలరు. పూరి గారు ఆయను దుబాయ్ కి తీసుకెళ్లి నెరేషన్ ఇచ్చారు. ఈ స్క్రిప్ట్ విని ఇంప్రెస్ అయ్యారు. వెంటనే వేసే సినిమాకు వాళ్ల కాల్ చేసి, వాళ్లకు ఇచ్చిన డేట్స్ క్యాన్సిల్ చేశారు. దాని డేట్స్ ఈ సినిమాకు ఇచ్చారు” అని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో సంజయ్ దత్, రామ్ పోతినేని మధ్య సన్నివేశాలు అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాను మించి ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
‘డబుల్ ఇస్మార్ట్’పై ఆశలు పెట్టుకున్న పూరి, రామ్
గత కొంతకాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న రామ్, పూరి ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాపై భారీగా హోప్స్ పెట్టుకున్నారు. ఈ సినిమా హిట్ తో టాలీవుడ్ లో మళ్లీ సత్తా చాటాలని భావిస్తున్నారు. పూరి చివరి చిత్రం ‘లైగర్’ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలవడంతో బాగా ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలోనే ‘డబుల్ ఇస్మార్ట్’పై ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్, సింగిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చిది. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించారు. పీసీ కనెక్ట్ పతాకంపై ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మించారు.
Read Also: హీరోగా మారబోతున్న సూపర్ హిట్ సినిమాల డైరెక్టర్ - లుక్ మార్చడం వెనుక కారణం అదేనా?