యువ సామ్రాట్, టాలీవుడ్ అందగాడు అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) జీవితంలో సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) గతం! వాళ్లిద్దరి ప్రేమ, సంసారం, విడాకులు చరిత్ర. తమ దారులు వేర్వేరు అని మూడేళ్ల క్రితం చై - సామ్ ప్రకటించారు. ఫస్ట్ మ్యారేజ్, డివోర్స్ నుంచి చైతూ మూవ్ ఆన్ అయ్యారు. ఆయన మళ్లీ ప్రేమలో పడ్డారు. శోభితా ధూళిపాళ (Sobhita Dhulipala)తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. అయితే... సమంత మాత్రం ఆయన్ను వదల్లేదు. ఎలా? ఎందుకు? అనే వివరాల్లోకి వెళితే... 


నాగ చైతన్య జీవితంలోకి వచ్చిన సమంత!
Do you know Sobhita Dhulipala's sister's name?: చైతూ జీవితంలో మళ్లీ సమంత వచ్చారు. అయితే... ఈ సమంత వేరు. ప్రేక్షకులకు తెలిసిన సమంత వేరు. సామ్ అంటే తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాదు... తమిళ, హిందీతో పాటు పాన్ ఇండియా ప్రేక్షకులకు హీరోయిన్ సమంత గుర్తుకు వస్తారు. కానీ, ఇప్పుడు చైతన్య జీవితంలోకి వచ్చిన సమంత ఆవిడ కాదు. 






శోభితా ధూళిపాళతో ఎంగేజ్‌మెంట్ అయ్యాక నాగ చైతన్య జీవితంలోకి ఓ సమంత వచ్చారు. ఆవిడ ఎవరో కాదు... శోభిత చెల్లెలు. అవును... శోభిత సిస్టర్ పేరు కూడా సమంత! అంటే... చైతూకు కాబోయే మరదలి పేరు సమంత. గత ఏడాది ఏప్రిల్ నెలలో సమంత పెళ్లి చేశారు శోభిత. అదీ సంగతి!


Also Readసమంతతో విడాకులకు ముందే శోభితతో నాగ చైతన్య ప్రేమ వ్యవహారం నడిపారా? లేదంటే విడాకుల తర్వాతా... అసలు నిజం ఏమిటంటే?



మాజీ భార్య సమంత ఫోటోలు డిలీట్ చేసిన చైతన్య!
Naga Chaitanya deletes Samantha Photos: మరదలు సమంతను పక్కన పెడితే... మాజీ భార్య సమంత గుర్తులు అన్నీ తన జీవితంలో లేకుండా చూసుకుంటున్నారు నాగ చైతన్య. డివోర్స్ తర్వాత కూడా సామ్ ఫోటోలను ఆయన డిలీట్ చేయలేదు. చాలా రోజులు తన సోషల్ మీడియాలో ఆమె ఫోటోలను అలాగే ఉంచారు. అయితే... శోభితా ధూళిపాళతో ఎంగేజ్‌మెంట్ కావడానికి కొన్ని రోజుల ముందు డిలీట్ చేశారు. అలా చేయడం కూడా డిస్కషన్ పాయింట్ అయ్యింది.


నాగ చైతన్య ప్రజెంట్ చేస్తున్న సినిమాలు ఏమిటి?
Naga Chaitanya Upcoming Movies: ప్రజెంట్ అక్కినేని నాగ చైతన్య చేతిలో ఒక్క సినిమా అంటే ఒక్కటే ఉంది. తనకు 'ప్రేమమ్' వంటి సూపర్ హిట్, 'సవ్యసాచి' వంటి డిఫరెంట్ ఫిల్మ్ అందించిన చందూ మొండేటి దర్శకత్వంలో 'తండేల్' చేస్తున్నారు. చైతూకి ఫస్ట్ పాన్ ఇండియా సినిమా ఇది. తొలుత డిసెంబర్ నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ, ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' క్రిస్మస్ సీజన్ టార్గెట్ చేయడంతో 'తండేల్' విడుదల వాయిదా పడే అవకాశాలు కనపడుతున్నాయి. పెళ్లి తర్వాత చైతన్య నుంచి విడుదల అయ్యే సినిమా ఇది. శోభితా ధూళిపాళ విషయానికి వస్తే... హిందీలో 'సితార' అని ఓ సినిమా చేస్తున్నారు.


Also Read: దేవర నెక్ట్స్ సాంగ్స్... నెక్స్ట్ లెవల్ రచ్చ... అభిమానులకు, ప్రేక్షకులకు పూనకాలే!