Varun Tej First Pan India Movie: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'మట్కా'. ఆయనకు ఫస్ట్ పాన్ ఇండియా చిత్రమిది. కమర్షియల్ అంశాలతో కూడిన కంటెంట్ బేస్డ్ సినిమాలు చేసే వరుణ్ తేజ్... పాన్ ఇండియా డెబ్యూ కోసం డిఫరెంట్ సబ్జెక్టు ఎంపిక చేసుకున్నారు. సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూస్తే... ఆ మాటే ఆడియన్స్ కూడా అంటారు. 


రెండు లుక్కుల్లో వరుణ్ తేజ్... గమనించారా?
Varun Tej in two avatars in Matka First Look: 'మట్కా' ఫస్ట్ లుక్ పోస్టర్ గమనిస్తే... వరుణ్ తేజ్ మిడిల్ ఏజ్డ్ లుక్ కనిపిస్తుంది. కాస్త నిశితంగా గమనిస్తే... కింద యంగ్ లుక్ కూడా ఉంటుంది. 'మట్కా' గేమ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రమిది. ఓ యువకుడి జీవితంలో 24 ఏళ్ల నుంచి మట్కా సామ్రాజ్యానికి రాజుగా ఎదిగే వరకు చూపిస్తారని చిత్ర బృందం తెలియజేసింది. 






'మట్కా' సినిమాలో మొత్తం నాలుగు డిఫరెంట్ గెటప్స్ / లుక్స్‌లో వరుణ్ తేజ్ కనిపించనున్నారు. అందులో రెండు గెటప్స్ ఇవాళ రివీల్ చేశారు. రెండిటిలో వరుణ్ సిగార్ కాలుస్తూ స్టయిలుగా ఉన్నారు. కానీ, రెండిటి మధ్య తేడా ఏమిటో చూశారా? యంగ్ లుక్కులో సాధారణంగా ఉంటే, మిడిల్ ఏజ్డ్ లుక్ రిచ్‌నెస్ చూపిస్తోంది.


Also Read: సమంతతో విడాకులకు ముందే శోభితతో నాగ చైతన్య ప్రేమ వ్యవహారం నడిపారా? లేదంటే విడాకుల తర్వాతా... అసలు నిజం ఏమిటంటే?



'మట్కా' చిత్రానికి 'పలాస' ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్ తేజ్ కెరీర్‌లో భారీ బడ్జెట్ సినిమాగా రూపొందుతోంది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలపై నిర్మాతలు డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి భారీ నిర్మాణ వ్యయంతో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు


Also Readతమన్నా డబుల్ బొనాంజా - బాలీవుడ్ కెరీర్‌కు కొత్త బిగినింగా? ఎండ్ కార్డా?



Matka Movie Cast And Crew: వరుణ్ తేజ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న 'మట్కా' సినిమాలో నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి హీరోయిన్లు. నవీన్ చంద్ర, సలోని, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవిశంకర్ తదితరులు ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కాస్ట్యూమ్స్: కిలారి లక్ష్మి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: ఆర్కే జన - ప్రశాంత్ మండవ - సాగర్, సీఈవో: ఈవీవీ సతీష్, ప్రొడక్షన్ డిజైనర్: కిరణ్ కుమార్ మన్నే, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్ ఆర్, ఛాయాగ్రహణం: ఎ కిశోర్ కుమార్, సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్, నిర్మాణ సంస్థలు: వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ - ఎస్ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్, నిర్మాతలు: డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి, కథ - కథనం - మాటలు - దర్శకత్వం: కరుణ కుమార్.