Naga Chaitanya Sobhita Dhulipala: సమంతతో విడాకులకు ముందు, తర్వాత - శోభితతో చైతూ ప్రేమలో పడింది ఎప్పుడు?

Naga Chaitanya Sobhita Dhulipala Love Story: శోభితా ధూళిపాళతో అక్కినేని నాగ చైతన్య ఎప్పుడు ప్రేమలో పడ్డాడు? సమంతతో విడాకులకు ముందు పడ్డారా? లేదంటే తర్వాత పడ్డారా? ఒక లుక్ వేయండి.

Continues below advertisement

అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya), శోభితా ధూళిపాళ (Sobhita Dhulipala) నిశ్చితార్థం కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితుల నడుమ వైభవంగా జరిగింది. త్వరలో పెళ్లి తేదీ వెల్లడించే అవకాశం ఉంది. సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu)తో నాగ చైతన్య ప్రేమ వివాహం, కారణాలు ఏవైనా ఆ తర్వాత వాళ్లిద్దరూ విడాకులు తీసుకోవడం తెలిసిన విషయాలే. అయితే, ఆ విషయాలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఇందులో చాలా థియరీలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కానీ, అసలు విషయం ఏమిటంటే?

Continues below advertisement

సమంత ప్రపోజ్ చేసిన రోజే నిశ్చితార్థమా?
చైతన్య, శోభిత ఎంగేజ్‌మెంట్ తర్వాత సోషల్ మీడియాలో ఎక్కువ చక్కట్లు కొట్టిన పోస్ట్ ఏదైనా ఉందంటే... అది 'చైతన్యకు సమంత ప్రపోజ్ చేసిన రోజే శోభితతో అతడు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు' అని! ఆ విధంగా రివేంజ్ తీర్చుకున్నాడని! అసలు విషయం వేరే అని తెలిసింది. ఆగస్టు 8న చైతన్యకు సమంత ప్రపోజ్ చేయలేదని, అందులో ఒక్క శాతం కూడా నిజం లేదని చై సామ్ గురించి బాగా తెలిసిన సన్నిహిత వర్గాలు చెప్పాయి.

ఆగస్టు 8న ఎంగేజ్‌మెంట్ చేసుకోవడానికి కారణం 8.8.8 మాత్రమే! ఆ తేదీ ఇన్ఫినిటీ లవ్ (అనంతమైన ప్రేమకు నిర్వచనం)కు సూచిక కావడంతో నిశ్చితార్థం చేసుకున్నారనేది అసలు నిజం.

Also Readతమన్నా డబుల్ బొనాంజా - బాలీవుడ్ కెరీర్‌కు కొత్త బిగినింగా? ఎండ్ కార్డా?


సమంతకు విడాకులకు ముందు నుంచి రిలేషన్ నడిచిందా?
నాగ చైతన్య, సమంత విడాకుల ప్రకటన వచ్చిన రోజు కాస్ట్యూమ్ డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ ఒక పోస్ట్ చేశారు. ''ఇక నుంచి అతను నీ వాడు'' అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ పేర్కొన్నాడు. ఇప్పుడు ఆ పోస్ట్ ట్రెండ్ అయ్యింది. దాంతో సమంతతో విడాకులకు ముందు నుంచి శోభిత ధూళిపాళతో చైతన్య రిలేషన్షిప్‌లో ఉన్నాడని పలువురు భావిస్తున్నారు. కానీ, అసలు విషయం అది కాదు.

సమంతతో విడాకులు తీసుకోవడానికి ముందు శోభితా ధూళిపాళతో రిలేషన్షిప్‌లో నాగ చైతన్య (Naga Chaitanya Love Story) ఉన్నారనేది నిజం కాదు. విడాకులు తీసుకున్న కొన్నాళ్లకు శోభితా ధూళిపాళతో ఆయనకు పరిచయం అయ్యింది. 

అక్టోబర్ 2017లో సమంతతో చైతూకు పెళ్లి అయితే... అక్టోబర్ 2021లో విడాకులు తీసుకున్న విషయం వెల్లడించారు. అప్పటికి శోభితా ధూళిపాళ తెలుగు సినిమా చేశారు. 'గూఢచారి'లో నటించారు. కానీ, చైతన్యతో పరిచయం కాలేదు. ఆవిడ కూడా మలయాళ, హిందీ సినిమాలతో బిజీగా ఉన్నారు. 'మేజర్' విడుదల తర్వాత హీరో అడివి శేష్ ద్వారా పరిచయం అయ్యారు. ఆ సినిమా మే 24, 2022లో విడుదల కాగా... సన్నిహితులకు శేష్ ఇచ్చిన సక్సెస్ పార్టీలో పరిచయం చైతన్య, శోభిత మధ్య పరిచయం అయ్యింది. ఆ తర్వాత అది ప్రేమకు దారి తీసింది. కుటుంబ సభ్యుల అంగీకారంతో ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అయ్యారు. అదీ సంగతి! సమంతతో చైతన్య విడాకులకు, శోభితకు అసలు సంబంధం లేదని సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది.

Also Read: పనీ పాటా లేని పకోడీ గాళ్ళు... మిస్టర్ హరీష్ శంకర్ సెటైర్ ఎవరి మీద?

Continues below advertisement