Independence Day 2024 Movie Releases: సినిమా ప్రేమికులకు, రిలీజ్ రోజే థియేటర్లకు వెళ్లి కొత్త సినిమాలు చూడాలని ఆరాటపడే జనాలకు ఈ ఆగస్టు 15న నిజమైన పండగ. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఆ ఒక్క రోజే ఆల్మోస్ట్ డజను సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. అందులో రెండు సినిమాలు మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) నటించినవి ఉన్నాయి. ఆ రెండూ హిందీ సినిమాల రిజల్ట్స్ ఆవిడ బాలీవుడ్ ఫ్యూచర్ కెరీర్ డిసైడ్ చేస్తాయని సినీ విశ్లేషకుల అంచనా.


హారర్ కామెడీలో స్పెషల్ సాంగ్ అదిరిందమ్మా!
Tamannaah role in Stree 2: రాజ్ కుమార్ రావ్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో యాక్ట్ చేసిన బాలీవుడ్ ఫిల్మ్ 'స్త్రీ 2'. హిందీలో హారర్ హిట్ ఫ్రాంచైజీలో వస్తున్న సినిమా. 'స్త్రీ' సినిమాకు సీక్వెల్. 'స్త్రీ 2' మీద అంచనాలు అయితే బావున్నాయ్. కానీ, హీరో రాజ్ కుమార్ రావు ఫామ్‌లో లేడు. శ్రద్ధా కపూర్ మెయిన్ కనుక... హిట్ ఫ్రాంఛైజీలో సినిమా కనుక... తమన్నా బోలెడు ఆశలు పెట్టుకుంది. పైగా, ఆవిడ చేసిన స్పెషల్ సాంగ్ 'ఆజ్ కి రాత్' హిట్ కావడం కూడా కలిసి వచ్చింది. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. పంద్రాగస్టుకు ఈ సినిమా వస్తోంది. 






జాన్ అబ్రహం యాక్షన్ ఫిల్మ్ 'వేదా'లోనూ తమన్నా!
Tamannaah Role In Vedaa: ఆగస్టు 15న థియేటర్లలోకి వస్తున్న మరో బాలీవుడ్ ఫిల్మ్ 'వేదా'. అందులో జాన్ అబ్రహం హీరో. తమన్నా కంటే లేటెస్ట్ సెన్సేషన్ శార్వరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. అయితే, జాన్ జోడీగా నటించింది తమన్నాయే కనుక ఆవిడ హీరోయిన్ అనుకోవాలి.






యాక్షన్ సినిమాలతో బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం బాక్సాఫీస్ మీద దండయాత్ర చేస్తున్నాడు. కానీ, సరైన సక్సెస్ రావడం లేదు. రీసెంట్ ప్రెస్ ఇంటరాక్షన్‌లో దాని గురించి క్వశ్చన్ అడిగితే 'సరైన క్వశ్చన్స్ అడగని వాళ్లను ఇడియట్స్ అనొచ్చా' అన్నాడు. దాంతో మూవీకి పబ్లిసిటీ వచ్చింది. కానీ, అతడు పొగరుగా సమాధానం ఇచ్చాడని కొందరు ఆడియన్స్ ఫీల్ అయ్యారు. ఆ ఎఫెక్ట్ మూవీ మీద పడితే కష్టమే. ట్రయిలర్ చూసి సినిమాను జడ్జ్ చేయవద్దని తమన్నా రిక్వెస్ట్ చేస్తోంది. 


ఆగస్టు 15న విడుదల అయ్యే 'స్త్రీ 2', 'వేదా' సినిమాలు సక్సెస్ అయితే హిందీలో తమన్నాకు మరిన్ని అవకాశాలు వస్తాయి. లేదంటే ఆవిడ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. 'లస్ట్ స్టోరీస్ 2', 'జీ కర్దా' వంటి వెబ్ సిరీస్‌లలో రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్స్ చేయడం వల్ల వచ్చిన క్రేజ్ వేస్ట్ అవుతుంది. బాలీవుడ్ మూవీస్ సక్సెస్ అయితే తర్వాత పాన్ ఇండియా విడుదలకు రెడీ అవుతున్న తెలుగు సినిమా 'ఓదెల 2'కి మంచి బజ్ ఏర్పడుతుంది.


Also Read: శివుడి మీద కాంట్రవర్సీ లేకుండా సినిమా - ముస్లిం దర్శకుడు అప్సర్ మీద ప్రశంసలు



కథానాయికగా 20 ఏళ్ల సక్సెస్ ఫుల్ కెరీర్ అంటే మామూలు విషయం కాదు. నెక్స్ట్ ఇయర్ (2025లో) ఆ మైల్ స్టోన్ చేరుకోనుంది తమన్నా. హిందీ సినిమా 'చాంద్ సే రోషన్ చెహ్రా'తో నటిగా కెరీర్ స్టార్ట్ చేసినా... తెలుగు సినిమా మంచు మనోజ్ 'శ్రీ'తో హీరోయిన్ అయ్యింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ అమ్మడు స్టార్ అయ్యింది కానీ హిందీలో ఆ రేంజ్ సక్సెస్ రాలేదు. ఇప్పటికీ పట్టు వదలని విక్రమార్కుడు తరహాలో ప్రయత్నాలు సాగిస్తోంది.


Also Read: 'వెంకీ' వర్సెస్ 'విశ్వం'... ఆ ట్రైన్ సీక్వెన్స్, శ్రీను వైట్ల మీద అందరి చూపు, ఏం చేస్తారో మరి?