ప్రస్తుతం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దేవుని మీద సినిమాలు పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. మైథలాజికల్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. 'అఖండ', 'హను - మాన్' సినిమాలు దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. మైథాలజీ టచ్ కాన్సెప్ట్‌తో వచ్చిన లేటెస్ట్ సినిమా 'శివం భజే' (Shivam Bhaje Movie). ఆ సినిమాకు మంచి ప్రశంసలు వస్తున్నాయి. అందుకు కారణం ఈ సినిమా తీసినది ముస్లిం కావడమే.
ముస్లిం తీసిన శివుని సినిమా.... నో కాంట్రవర్సీ!
ఇప్పటి వరకు తెలుగు చిత్రసీమలో హిందూ దేవుళ్ళ నేపథ్యంలో తీసిన సినిమాలు గమనిస్తే... ఆయా సినిమాలకు దర్శక రచయితలుగా హిందువులే కనిపించారు. ఈ 'శివం భజే' స్పెషాలిటీ ఏమిటంటే... దీని దర్శకుడు అప్సర్ ముస్లిం. అవును... ఆ మాట నిజమే!
'శివం భజే'లో హీరోకి శివుడు అంటే కోపం. తన చిన్నతనంలో ఓ ఇద్దరు దొంగలు శివాలయం నుంచి డబ్బు, నగలు దోచుకోవడం చూసిన తన తండ్రి పట్టుకోవడానికి వెళ్లగా... రోడ్డు ప్రమాదంలో మరణిస్తాడు. ఆ తర్వాత నుంచి శివునికి దణ్ణం పెట్టడం మానేస్తాడు. దేవుడు పేరుతో దానం కోరే వాళ్ళు అంటే కూడా అతడిని పడదు. ఇక, శివుడు - కాల భైరవుడు నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. ఏ సన్నివేశంలో అయినా సరే ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా తీశారు అప్సర్. అందుకు అతడి మీద కొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.
'గంధర్వ'లో యాంటీ ఏజింగ్ వంటి వినూత్న కాన్సెప్ట్‌తో సినిమా తీసి ప్రేక్షకులను మెప్పించాడు అప్సర్. ఇప్పుడు 'శివం భజే'తో మరోసారి ఆగస్టు 1న ఆయన తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. డీసెంట్ హిట్ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా శివుని నేపథ్యంలో వచ్చిన సన్నివేశాలు, పాటలకు గూస్ బంప్స్ వచ్చాయని ఆడియన్స్ చెప్పడం ఆయనకు పెద్ద కాంప్లిమెంట్ అని చెప్పవచ్చు.
Also Read: పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా... పవన్ నియోజకవర్గంలోని కుక్కుటేశ్వర ఆలయంలో నిహారిక పూజలు
అప్సర్ దర్శకత్వ శైలి, మేకింగ్ గురించి ఇండస్ట్రీ జనాలు, ఆడియన్స్ అంతా ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. డివోషనల్ సన్నివేశాలు వచ్చినప్పుడు ఎంగేజ్ చేయడంలో ఆయన పాస్ అయ్యారని ప్రశంసలు కురిపిస్తున్నారు. అతని రైటింగ్, మేకింగ్, టేకింగ్ బావున్నాయి. అతనికి మరిన్ని అవకాశాలు ఈ సినిమా తెస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.
'హిడింబ' డిఫరెంట్ అటెంప్ట్ అని ఆడియన్స్, క్రిటిక్స్ నుంచి అశ్విన్ బాబు స్టోరీ సెలక్షన్ పట్ల ప్రశంసలు వచ్చాయి. అందుకని, 'శివం భజే'కు మంచి ఓపెనింగ్స్ ల లభించాయి. ఒక యూనిక్ డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా అప్సర్ తెరకెక్కించిన తీరు... గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత మహేశ్వర్ రెడ్డి మూలి ఉన్నత నిర్మాణ విలువలు తోడు కావడంతో సినిమా థియేటర్లకు ప్రేక్షకులు వచ్చాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ విడుదల చేసింది.
Also Read: కేరళ వయనాడ్ బాధితుల సహాయార్థం రష్మికా మందన్నా భారీ విరాళం - నేషనల్ క్రష్ ఎంత ఇచ్చారంటే?