ప్రకృతి విలయ తాండవం చేయడంతో కేరళ రాష్ట్రంలోని వయనాడ్ (Kerala Wayanad Landslide) ప్రాంతంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. వందల మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది ప్రజలు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టాయి. వాటి కోసం నేషనల్ క్రష్ రష్మిక భారీ విరాళం ప్రకటించారు.
వయనాడ్ సహాయక చర్యలకు 10 లక్షలు
కేరళలో వయనాడ్ ప్రాంతంలో కొండ చరియలు విరిగి పడడంతో జనజీవనం తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాన్ని ఎదుర్కొంటోంది. ఈ ఘటన పట్ల రష్మిక తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకునేందుకు కేరళ ముఖ్యమంత్రి సహాయనిధి (Kerala CM Relief Fund)కి 10 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు. మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. కరోనా సమయంలోనూ రష్మిక పలు మంచి పనులు చేశారు. పలువురికి వస్తు, ధన, ఆహార రూపంలో సహాయ సహకారాలు అందించారు.
''ఇటువంటి కష్ట సమయంలో కేరళ ప్రజలు అందరూ ధైర్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నారు. త్వరలో దీన్నుంచి అందరూ బయట పడాలని ఆశిస్తున్నా'' అని రష్మిక పేర్కొంది.
Also Read: ప్రియదర్శి హీరోగా మరో సినిమా - కథానాయికగా ఫేమస్ కంటెంట్ క్రియేటర్.... ఆ డీటెయిల్స్ తెలుసా?
Rashmika Mandanna Upcoming Movies: రష్మికా మందన్నా విషయానికి వస్తే... వరుస విజయాలతో గోల్డెన్ లెగ్ అన్నట్లు పేరు తెచ్చుకున్నారు. నేషనల్ క్రష్ నుంచి వరుస పాన్ ఇండియా విజయాలతో ఇప్పుడు పాన్ ఇండియా క్వీన్ అయ్యారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన 'పుష్ప 2'లో శ్రీ వల్లిగా మరోసారి, ఇంకా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ 'సికిందర్', తెలుగు - తమిళ భాషల్లో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'ది గర్ల్ ఫ్రెండ్', ధనుష్ - నాగార్జున హీరోలుగా శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న 'కుబేర', ఇంకా 'రెయిన్ బో' సినిమాల్లో నటిస్తున్నారు రష్మిక.
మాలీవుడ్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా 'లక్కీ భాస్కర్' నిర్మిస్తున్న ప్రముఖ తెలుగు నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ సైతం రూ. 5 లక్షలను కేరళ వాయనాడ్ బాధితుల సహాయార్థం విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు. చియాన్ విక్రమ్, మలయాళ స్టార్ టోవినో థామస్ సహా పలువురు తారలు విరాళాలు ఇస్తూ తమ మంచి మనసు చాటుకుంటున్నారు.
Also Read: అఫీషియల్... 'భారతీయుడు 2' ఓటీటీ ప్రీమియర్ డేట్ అనౌన్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్