Niharika Konidela: పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా... పవన్ నియోజకవర్గంలోని కుక్కుటేశ్వర ఆలయంలో నిహారిక పూజలు
Niharika Konidela Latest News: పిఠాపురం ఎమ్మెల్యేగా జనసేనాని పవన్ కళ్యాణ్ భారీ విజయం తర్వాత పార్టీ శ్రేణులు, అభిమానులు 'పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా' అని బైక్స్, కార్స్ మీద స్టిక్కర్లు వేయించారు. ఎమ్మెల్యే గారి తాలూకా కాదు... ఆ ఎమ్మెల్యే గారి అమ్మాయ్ పిఠాపురం వెళ్లారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపవన్ కళ్యాణ్ సోదరుడు, నటుడు - జనసేన పార్టీ కీలక నేత నాగబాబు కుమార్తెగా... నటి, నిర్మాతగా నిహారిక కొణిదెల తెలుగు ప్రేక్షకులు అందరికీ తెలుసు. తమిళ సినిమాలు సైతం చేస్తూ ఆవిడ బిజీ బిజీగా ఉంటున్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని కుక్కుటేశ్వర ఆలయంలో శనివారం నిహారిక ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నిహారిక నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంలో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా 'కమిటీ కుర్రోళ్ళు'. ఆగస్టు 9న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏపీలోని కొన్ని ప్రాంతల్లో ప్రచారం నిర్వహించారు. సినిమా ప్రచార కార్యక్రమాల కోసం వెళ్లిన నిహారిక... కుక్కుటేశ్వర ఆలయానికి వెళ్లారు.
నిహారికకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అయితే... సామాన్య క్యూ లైనులో వెళ్లి ఆవిడ దర్శనం చేసుకున్నట్లు తెలిసింది. ప్రత్యేక పూజల అనంతరం ప్రసాదాలు స్వీకరించారు.
నిహారికతో పాటు ఏపీలో సినిమా కోసం ప్రచారం చేసిన 'కమిటీ కుర్రోళ్ళు' హీరో హీరోయిన్లు, దర్శక నిర్మాతలు! ఈ సినిమాతో పదకొండు మంది హీరోలు, నలుగురు హీరోయిన్లను నిహారిక పరిచయం చేస్తున్నారు.
ఏపీలో ప్రచారం అనంతరం 'కమిటీ కుర్రోళ్ళు' చిత్ర బృందంతో బస్సులో హైదరాబాద్ తిరిగి వస్తున్న నిహారిక