Manushi Chhillar Dating: మాజీ సీఎం మనవడితో మాజీ విశ్వసుందరి మానుషి చిల్లర్ డేటింగ్!
మాజీ విశ్వ సుందరి , నటి మానుషి చిల్లర్ డేటింగ్ న్యూస్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు వీర్ పహారియాతో ప్రేమలో ఉందనే గాసిప్ వినిపిస్తోంది. ఇలాంటి టైమ్ లో ఓ వీడియో వైరల్ అవుతోంది
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబాలీవుడ్ సోషల్‌మీడియా ఇన్ఫ్లూయెన్సర్ పోస్ట్ చేసిన ఈ వీడియోలో... వీర్ భుజంపై తలపెట్టి సేదతీరుతోంది మానుషి. జాన్వి ఆమె ప్రియుడు శిఖర్ పహారియా..తమ ఫ్రెండ్స్ తో కలసి టూర్ వెళ్లారు... ఆ వీడియోస్ లో జాన్వి - పహారియా తో పాటూ ఆ పక్కనే ఫొటోస్ లో మానుషి-వీర్ కనిపించారు
వీర్ భుజంపై తల పెట్టుకుని మానుషి చిల్లర్ కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. రీసెంట్ గా అంబానీ ప్రీ వెడ్డింగ్ లో కూడా ఈ జంట కలిసే కనిపించింది. కలసి స్టెప్పులేసింది కూడా..
హరియాణాకు చెందిన మానుషి చిల్లర్ 2017లో విశ్వసుందరిగా కీరీటం దక్కించుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అక్షయ్‌కుమార్ హీరోగా ఫస్ట్ మూవీకి సైన్ చేసింది..తెలుగులో వరుణ్ తేజ్ తో కలసి ఆపరేషన్ వాలెంటైన్లో నటించింది.
బాలీవుడ్లో వరుస సినిమాల్లో నటిస్తోంది కానీ తన మార్క్ చూపించలేకపోతోంది. ప్రస్తుతం మానుషి జాన్ అబ్రహం హీరోగా నటిస్తున్న టెహ్రాన్ మూవీలో నటిస్తోంది.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్ షిండే మనవడే వీర్ పహారియా హీరోగా లక్ టెస్ట్ చేసుకుంటున్నాడు. స్కై ఫోర్స్ సినిమాతో బీటౌన్‌లో అడుగుపెడున్నాడు. జాన్వీ ప్రియుడైన శిఖర్ పహారియా కి సోదరుడు వీర్.
మానుషి చిల్లర్ (Image credit: Manushi Chhillar/Instagram)m)