Viswam Train Sequence: 'వెంకీ' వర్సెస్ 'విశ్వం'... ఆ ట్రైన్ సీక్వెన్స్, శ్రీను వైట్ల మీద అందరి చూపు, ఏం చేస్తారో మరి?

Viswam Vs Venky Train Scene: శ్రీను వైట్ల తీసిన 'వెంకీ'లో ట్రైన్ సీక్వెన్స్ కేక. 'విశ్వం'లో కూడా అటువంటి ట్రైన్ సీక్వెన్స్ ప్లాన్ చేశారు శ్రీను వైట్ల. ఇప్పుడు అందరి చూపు దాని మీద పడింది.

Continues below advertisement

Watch Gopichand's Viswam Train Sequence Video: సీనియర్ దర్శకుడు శ్రీను వైట్ల (Srinu Vaitla) తెరకెక్కిస్తున్న తాజా సినిమా 'విశ్వం'. మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటిస్తున్నారు. 'ది జర్నీ ఆఫ్ విశ్వం' పేరుతో మేకింగ్ వీడియో విడుదల చేశారు. అది చూస్తే ఇదొక యాక్షన్ ఎంటర్టైనర్ అని ఈజీగా అర్థం అవుతుంది. అయితే, ఆ యాక్షన్ కంటే ట్రైన్ సీక్వెన్స్ మీద ఎక్కువ మంది ప్రేక్షకుల చూపు పడింది. 'వెంకీ' ట్రైన్ ఎపిసోడ్ ఎక్కువ మందికి గుర్తుకు వచ్చింది. మరి, దాన్ని బీట్ చేసేలా? లేదంటే మ్యాచ్ చేసేలా? శ్రీను వైట్ల ఆ మేజిక్ రిపీట్ చేస్తారా? అనే ప్రశ్నలు వస్తున్నాయ్. 

Continues below advertisement

వెంకీ వర్సెస్ విశ్వం... శ్రీను వైట్ల ముందున్న సవాల్ ఏంటి?
కామెడీతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్స్ తీయడం శ్రీను వైట్ల స్పెషాలిటీ. 'వెంకీ' నుంచి 'దూకుడు', 'బాద్ షా', 'బ్రూస్ లీ' వరకు ఆయన సినిమా ఏది చూసినా సరే కామెడీ తప్పకుండా ఉంటుంది. జనాల్ని నవ్వించింది. అయితే, ఆయన తీసిన సినిమాల్లో 'వెంకీ'ది స్పెషల్ ప్లేస్. ముఖ్యంగా అందులో కామెడీ ట్రాక్ ప్రేక్షకుల్ని విపరీతంగా నవ్వించింది. దాంతో 'విశ్వం' ట్రైన్ సీక్వెన్స్ మీద జనాల దృష్టి పడుతోంది. 

'వెంకీ' కామెడీ ట్రైన్ సీక్వెన్స్ సూపర్ డూపర్ హిట్ కావడానికి కారణం టీటీ రోల్ చేసిన వేణు మాధవ్, మాస్ మహారాజా రవితేజ, ఏవీఎస్, బ్రహ్మానందంల కామెడీ టైమింగ్. ఇప్పుడు వేణు మాధవ్, ఏవీఎస్ దివంగత లోకాలకు వెళ్లారు. దాంతో టీటీ పాత్రకు తమిళ నటుడు వీటీవీ గణేష్ (VTV Ganesh)ను తీసుకున్నారు శ్రీను వైట్ల. 'ది జర్నీ ఆఫ్ విశ్వం' మేకింగ్ వీడియోలో ఆయన కనిపించారు. డబ్బింగ్ సినిమాలతో ఆయన తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యారు. సో... వేణు మాధవ్ రీప్లేస్ దొరికిందని అనుకోవాలి. 

'వెన్నెల' కిశోర్, 'చమ్మక్' చంద్ర, 'షకలక' శంకర్, గిరిధర్... న్యూ ఏజ్ కమెడియన్లు 'విశ్వం' ట్రైన్ సీక్వెన్సులో సందడి చేయనున్నారు. బ్రహ్మానందం బదులు ఈసారి సీనియర్ నరేష్ వైపు మొగ్గు చూపారు శ్రీను వైట్ల. ఆయన భార్యగా ప్రగతి నటించినట్టు అర్థం అవుతోంది. మేకింగ్ వీడియో చూస్తే... ఎంజాయ్ చేస్తూ ఆ కామెడీ సీన్లు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు శ్రీను వైట్ల ముందున్న సవాల్ ఒక్కటే... 'వెంకీ' మేజిక్ రిపీట్ చేసేలా సీన్లు తీయడం!

Also Read: అబ్బబ్బా అనసూయ... ముద్దులు ఎక్కడ ఇస్తావ్ రీతూ... శ్రీముఖి మాటల్లో డబుల్ మీనింగ్!


శ్రీను వైట్లకు సపరేట్ కామెడీ టైమింగ్, స్టయిల్ ఉన్నాయి. ఆయన సినిమాల్లో మాత్రమే కనిపిస్తాయి. అయితే ఇప్పుడు ఆయన ఫ్లాపుల్లో ఉన్నారు కనుక ఈ 'విశ్వం'తో మరోసారి తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవలసిన అవసరం ఏర్పడింది. యాక్షన్ సీన్లలో ఆయన స్టైలిష్ టేకింగ్ కనబడుతోంది. కామెడీ గనుక క్లిక్ అయితే మళ్లీ స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం శ్రీను వైట్లకు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ సంస్థలపై టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మిస్తున్న ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్.

Also Readవర్షతో శోభనం... రాఘవతో భాస్కర్ గొడవ... రామ్ ప్రసాద్ గాలి తీసిన రోహిణి... 'జబర్దస్త్' లేటెస్ట్ ప్రోమో చూశారా?

Continues below advertisement