Rithu Chowdary and Vishnu Priya Bhimeneni Latest News: బుల్లితెర ఆర్టిస్టులు రీతూ చౌదరి, విష్ణు ప్రియా భీమనేని ట్రెండ్ అవుతున్నారు. రీసెంట్ ఇంటర్వ్యూలో రీతూ ఫ్రెష్ పీస్, నేను తుప్పుపట్టిన పీస్ అని విష్ణు ప్రియా భీమనేని చెప్పిన మాట వైరల్ అవుతోంది. అది పక్కన పెడితే... 'కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్' లేటెస్ట్ ప్రోమో చూస్తే, అందులోనూ వాళ్లిద్దరు హైలైట్ అవుతున్నారు. 


అతడికి ముద్దులు ఎక్కడ ఇస్తావ్ రీతూ?
Watch Kiraak Boys Khiladi Girls Show Latest Promo: ఈ శని, ఆది వారాల్లో (ఆగస్టు 3, 4వ తేదీల్లో) టెలికాస్ట్ కానున్న 'కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్' ఎపిసోడ్స్ ఫుల్ ప్రోమో ఈ రోజు రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్స్ జాతర థీమ్ బేస్డ్ చేసినట్టు అర్థం అవుతోంది. పల్లెటూరు, అసలే జాతర కనుక ట్రెడిషనల్ డ్రస్సుల్లో అమ్మాయిలు అందరూ వచ్చారు. జాతర అంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా! కాళ్లకు చెక్కలు వంటివి కట్టుకుని పొడుగ్గా కనిపిస్తూ కొందరు ఎంటర్టైన్ చేస్తారు. అటువంటి వాళ్లు ఇద్దరు వచ్చారు. ''విష్ణు ప్రియా, రీతూ మాత్రం బాయ్ ఫ్రెండ్స్ తో వచ్చారు'' అంటూ సెటైర్ వేసింది శ్రీముఖి. అంతటి ఆగలేదు. 


జాతరలో సందడి చేసే, పొడుగ్గా కనిపించే ఆ వ్యక్తుల దగ్గరకు వెళ్లి 'అయ్ బాబోయ్ ఎంత పొడుగో...' అంటూ 'ఫిదా'లో వరుణ్ తేజ్, సాయి పల్లవి సాంగ్ పాడింది రీతూ చౌదరి. అప్పుడు వెంటనే 'ముద్దులు ఎక్కడ ఇస్తావ్ నువ్వు' అని శ్రీముఖి అడిగింది. 'వద్దు ముద్దులు' అని చెప్పింది రీతూ. కానీ... ఆవిడ హైట్, పక్కన వ్యక్తి నిలబడిన హైట్ చూస్తే ఏదో డబుల్ మీనింగ్ ఉన్నట్టు ఉంది. అనసూయ ముఖం మీద చెయ్యి పెట్టుకుని వింత ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది మరి.


Also Read: వర్షతో శోభనం... రాఘవతో భాస్కర్ గొడవ... రామ్ ప్రసాద్ గాలి తీసిన రోహిణి... 'జబర్దస్త్' లేటెస్ట్ ప్రోమో చూశారా?






అబ్బబ్బా అనసూయ ఈవెంట్స్! అబ్బా!
Anasuya Latest Look In Kiraak Boys Khiladi Girls: వైట్ అండ్ వైట్ డ్రస్ వేసి ఏంజెల్ అన్నట్టు వచ్చింది అనసూయ. జాతరలో అమ్మాయిలతో ఈవెంట్స్ చేస్తున్నట్టు చెప్పింది. ఇంతకీ, అనసూయ ఈవెంట్ కంపెనీ పేరు ఏంటో తెలుసా? 'అబ్బబ్బా అనసూయ ఈవెంట్స్'. ఈవెంట్స్ సంగతి ఏమో గానీ ఆవిడ లుక్ చూసి ఫ్యాన్స్ 'అబ్బబ్బా' అంటున్నారు. 



ప్రియాంకను మాట్లాడవద్దని చెప్పిన శేఖర్ మాస్టర్!
Kiraak Boys Khiladi Girls Aug 3rd and 4th episodes promo: ప్రతి వారం 'కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్'లో అబ్బాయిలు, అమ్మాయిల మధ్య గేమ్స్ పెడతారు. ఎవరు విన్ అయితే వాళ్లకు డబ్బులు వస్తాయి. ఓడిన వాళ్ళను జైల్లో పెడతారు. ఈ వారం నిమ్మకాయలతో దండ కట్టాలని ఒక టాస్క్ పెట్టారు. అందులో 20 నిమ్మకాయలు ఉండాలని చెప్పారు. అబ్బాయిలు కట్టిన దండలో 21 ఉండటంతో వాళ్లు ఓడినట్టు అని చెప్పడంతో డిస్కషన్ జరిగింది. అందులో ప్రియాంకను మాట్లాడవద్దని శేఖర్ చెప్పడంతో ఎపిసోడ్ ముగించారు.


Also Readబిగ్ బాస్ మెహబూబ్ మీద పోలీస్ కేసు... బర్త్ డేకి బుల్లితెర బ్యాచ్‌తో విచ్చలవిడిగా రేవ్ పార్టీ చేశాడా?