Top 10 Headlines Today: 


అవునా! నిజమా?


లోక్‌సత్తా  జయప్రకాష్ నారాయణ వైఎస్ఆర్‌సీపీలో చేరుతారంటూ ఓ ప్రచారం ఊపందుకుంది. దీనికి కారణం విజయవాడలో జరిగిన ఆప్కాబ్ కార్యక్రమంలో జగన్, జేపీ ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుకోవడమే. జేపీకి రాజకీయ ఆసక్తి ఉంది. ఓ సారి ఎమ్మెల్యేగా గెలిచారు. మరోసారి మల్కాజిగిరిలో పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు పార్లమెంట్‌కు వెళ్లాలన్న ఆసక్తి ఉంది. ఈ క్రమంలో వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్‌తో ఆయన ముచ్చట్లు.. కొత్త ఊహాగానాలు దారి తీస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


కేసీఆర్ కొత్త వాదన ఎందుకోసం ?


తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ చేసిన ప్రసంగంలో ఎవరూ ఊహించని.. ఇంతకు ముందు ఎప్పుడూ చెప్పనిది..  తెలంగాణకు నెహ్రూ చేసిన అన్యాయం. కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం గురించే. నిజానికి దేశంలో జరిగే అనర్థాలకు నెహ్రూను  బీజేపీ నిందిస్తుంది. కానీ తెలంగాణకు కూడా నెహ్రూ అన్యాయం చేశారని కేసీఆర్ చెప్పడంతో చాలా మందికి కొత్త సందేహాలు వస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా చెప్పని విషయాలు ఇప్పుడు కేసీఆర్ ఎందుకు చెబుతున్నారు అనే సందేహం ఎక్కువ మందికి వస్తోంది. దీని వెనుక ఉన్న కేసీఆర్ వ్యూహం ఏమిటి ?పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


ఎంపీ కోటా లేదు


కేంద్రీయ విద్యాలయాల ప్రవేశాల్లో ఎంపీ కోటాను గతేడాది కేంద్రం రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల(కేవీ) ప్రవేశాల్లో ఎంపీ కోటాను మళ్లీ పునరుద్ధరిస్తున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను కేంద్రం కొట్టిపారేసింది. అలాంటి ప్రతిపాదనేదీ లేదని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి సోమవారం (ఆగస్టు 7) రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


రుతుపవాలు బలహీనం 


ఈ రోజు దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు సోమవారం (ఆగస్టు 7) ఓ ప్రకటనలో తెలిపారు. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అన్ని జిల్లాల్లోనూ ఒకటి లేదా రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఆగస్టు 13 వరకూ ఎలాంటి వాతావరణ హెచ్చరికలను జారీ చేయలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


తగ్గిన పరపతి


ఇన్నాళ్లూ జిల్లాతో పాటు ఉత్తరాంధ్రలోనూ ఆయన హవా సాగింది. ఆయన ప్రాతినిథ్యం వహించిన పార్టీ అధికారంలో లేకున్నా రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో అన్నీ తానై వ్యవహరించారు. అధినేతతో ప్రతి సమావేశంలోనూ వేదిక పంచుకుని కీలక నిర్ణయాల్లో భాగస్వామిగా నిలిచారు. అసెంబ్లీలోనూ, బయట పార్టీ గొంతును బలంగా వినిపించారు. ఈ క్రమంలో బీఏసీ సమావేశంలో స్వయంగా ముఖ్యమంత్రి జగన్ నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు. అయితే.. ఇదంతా గతం. ఇప్పుడు పార్టీలో భవిష్యత్ నాయకుడిగా ముద్రపడిన యువనేతకు, ఆ నాయకుడికి మధ్య గ్యాప్ వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. దీనికి ఆ నాయకుడి వ్యతిరేకులు మరింత ఆజ్యం పోస్తున్నట్టు సమాచారం. ఇంతకీ ఎవరా నాయకుడు? ఏంటా కథ? తెలుసుకోవాలంటే ఈ వివరాలు చదవండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


గద్దర్‌ అంత్యక్రియలపై కేంద్రానికి ఫిర్యాదు 


ప్రజాగాయకుడు, పద్యకారుడు గద్దర్‌కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించడాన్ని యాంటీ టెర్రరిజం ఫోరం (Anti Terrorism Forum - ఏటీఎఫ్) ఖండించింది. ఈ మేరకు యాంటీ టెర్రరిజం ఫోరం కన్వీనర్ డాక్టర్ రావినూతల శశిధర్ ఓ వీడియోను విడుదల చేశారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన విషయంపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లుగా శశిధర్ వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


ముగ్గురు సంపాదించింది ఎంత?


క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరు ముందంజలో ఉంటుంది. దాదాపు 25 ఏళ్ల కెరీర్‌లో సచిన్ టెండూల్కర్ ఎన్నో రికార్డులు సృష్టించాడు. అదే సమయంలో మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో భారత జట్టు వన్డే, టీ20 ప్రపంచ కప్‌లతో పాటు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కూడా గెలుచుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


ఆ హీరో అవమానించాడు


‘రక్తచరిత్ర’, ‘లెజెండ్’, ‘లయన్’ వంటి తెలుగు సినిమాల్లో నటించిన రాధికా ఆప్టే ఇప్పుడు హిందీ సినిమాల్లో బిజీగా మారిపోయింది. ముఖ్యంగా నేరుగా ఓటీటీల్లో విడుదలయ్యే చిత్రాలకు రాధికా ఆప్టే బెస్ట్ ఛాయిస్‌గా మారింది మేకర్స్‌కు. రాధికా ఇంకా తమిళ, మరాఠీ, బెంగాళీ భాషల్లో కూడా నటించింది. హాలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఇటీవల ఆమె తనకు టాలీవుడ్‌లో ఎదురైన ఓ ఘోర అనుభవం గురించి చెప్పుకొచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


నేటి స్టాక్‌ మార్కెట్ విశేషాలు


 ఇవాళ (మంగళవారం) ఉదయం 8.25 గంటల సమయానికి, గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 36 పాయింట్లు లేదా 0.19 శాతం రెడ్‌ కలర్‌లో 19,645 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


గోడ కుర్చీ వేయండి


ఒకప్పుడు అల్లరి చేసే వాళ్ళని, మార్కులు తక్కువ వచ్చే వాళ్ళని తరగతి గదిలో గోడకుర్చీ వేయమనేవారు. మనకు తెలిసినంతవరకు గోడకుర్చీ అనేది ఒక చిన్న శిక్ష. కానీ ఆరోగ్యపరంగా చూస్తే మాత్రం అది శిక్ష కాదు, ఒక వరం. మన కండరాలకు మేలు చేసే ఒక వ్యాయామం. అధిక రక్తపోటును తగ్గించే అద్భుత వర్కౌట్. ఈ విషయాన్ని ఒక అధ్యయనం ఇటీవల తేల్చింది. బీపీని నియంత్రించే వ్యాయామాల్లో గోడకుర్చీ కూడా ఒకటని చెబుతోంది ఈ కొత్త అధ్యయనం. బీపీని నియంత్రించడానికి ఎక్కువ మంది వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేస్తారు. వాటితో పాటు రోజుకు ఓ ఐదు నిమిషాలు గోడకుర్చీ వేసినా కూడా అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి