Richest Indian Cricketer: క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరు ముందంజలో ఉంటుంది. దాదాపు 25 ఏళ్ల కెరీర్‌లో సచిన్ టెండూల్కర్ ఎన్నో రికార్డులు సృష్టించాడు. అదే సమయంలో మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో భారత జట్టు వన్డే, టీ20 ప్రపంచ కప్‌లతో పాటు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కూడా గెలుచుకుంది.


మహేంద్ర సింగ్ ధోనీ, సచిన్ టెండూల్కర్ ఇద్దరూ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. మహేంద్ర సింగ్ ధోని తర్వాత టీమిండియా కెప్టెన్సీని విరాట్ కోహ్లీ కైవసం చేసుకున్నాడు. అంతే కాకుండా బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ ఎన్నో భారీ రికార్డులు సృష్టించాడు.


ముగ్గురిలో ఎక్కువ సంపాదించింది ఎవరు?
మీడియా కథనాల ప్రకారం సచిన్ టెండూల్కర్ నికర ఆస్తుల విలువ దాదాపు రూ.1250 కోట్లుగా ఉంది. భారత జట్టుతో పాటు సచిన్ టెండూల్కర్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. ఇది కాకుండా సచిన్ టెండూల్కర్ ఎన్నో యాడ్స్‌లో కూడా నటించారు. మరోవైపు భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నికర విలువను దాదాపు రూ. 1040 కోట్లుగా ఉంది. ఈ విధంగా చూస్తే, కెప్టెన్ కూల్ కంటే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ ఆస్తులే ఎక్కువగా ఉన్నాయి.


విరాట్ కోహ్లీ ఎంత సంపాదించాడు?
మీడియా కథనాల ప్రకారం విరాట్ కోహ్లీ నికర ఆస్తుల విలువ దాదాపు రూ.1050 కోట్లుగా ఉంది. భారత జట్టుతో పాటు విరాట్ కోహ్లి ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్నాడు. అలాగే విరాట్ కోహ్లీ ప్రకటనల ద్వారా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నాడు. అంతేకాకుండా సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా కూడా కోట్ల వర్షం కురుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్‌కు విరాట్ కోహ్లి రూ.8.9 కోట్లు ఛార్జ్ చేస్తాడని వార్తలు వస్తున్నాయి. విరాట్ కోహ్లీ ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్‌కు రూ.2.5 కోట్లు వసూలు చేస్తాడు.


మరోవైపు వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో కూడా భారత జట్టు ఓటమి పాలైంది. ఈ కీలక మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. అనంతరం వెస్టిండీస్ కేవలం 18.5 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో వెస్టిండీస్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యం సాధించింది. మరొక్క మ్యాచ్ ఓడిపోయినా భారత్ ఈ సిరీస్‌ను కోల్పోయినట్లే.


వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్‌లో ఫాంలో ఉన్న వికెట్ కీపర్ నికోలస్ పూరన్ (67: 40 బంతుల్లో, ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. భారత బ్యాటర్లలో తిలక్ వర్మ (51: 41 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) వేగవంతమైన అర్థ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక వెస్టిండీస్ బౌలర్లలో అకియల్ హొస్సేన్, అల్జారీ జోసెఫ్, రొమారియో షెపర్డ్ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial