Top 10 Headlines Today: 


 


బరిలో సీనియర్లు


భారతీయ  జనతా పార్టీలో రెండు రకాల నేతలుంటారు.  ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా..  సీనియర్ నేతలుగా చెలామణి అవుతూ ఉంటారు. పెద్దపెద్ద పదవులు కూడా పొందుతూంటారు. కానీ ఈ సారి అలాంటి చాన్స్ ఎవరికీ ఇవ్వకూడదని బీజేపీ హైకమాండ్ నిర్ణయించుకుంది. ఈ సారి సీనియర్లు అందరూ బరిలోకి దిగేలా ప్లాన్ చేస్తోంది. ఇందు కోసం నియోజకవర్గాల చాయిస్ కూడా వారికే ఇచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


ఓటమితో మొదలు


భారత్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ నాలుగు పరుగులతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం భారత్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 145 పరుగులకే పరిమితం అయింది. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో వెస్టిండీస్ 1-0 ఆధిక్యం సాధించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


టీడీపీ అధినేత యుద్ధభేరీ


ఆంధ్రప్రదేశ్‌పై దుర్మార్గులు శీతకన్ను వేశారని, తెలుగు జాతికి తీరని అన్యాయం చేశారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) అన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యతను తెలుగు జాతి తరపున తాను తీసుకుంటున్నానని ప్రకటించారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరిలో భాగంగా అనంతపురం జిల్లా కదిరి టౌన్ లో చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ పాలనపైనే కాకుండా, పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం తీరును ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


అక్కడక్కడా వర్షాలు


హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 29 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 28.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.5 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలిలో తేమ 84 శాతంగా నమోదైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


కోకాపేట కేక


హైదరాబాద్ లో భూముల ధరలు చరిత్ర సృష్టించాయి. హెచ్‌ఎండీఏ కోకాపేట ఏరియాలో - నియోపోలిస్‌ ఫేజ్‌-2 భూముల వేలం నేడు ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ వేలంలో వివిధ కంపెనీలు భూములను భారీ రేటు చెల్లించి దక్కించుకున్నాయి. చరిత్రలో అత్యధికంగా ఎకరం రూ.100 కోట్ల ధర దాటింది. ఇంత భారీ స్థాయిలో ధర పలకడం సంచలనంగా మారింది. నియో పోలిస్‌లో తెలంగాణ ప్రభుత్వం ఎకరం భూమి ధర రూ.35 కోట్లుగా బిడ్డింగ్ ప్రారంభ ధరను తొలుత నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


ఆధార్‌ అప్‌డేట్‌


ఆధార్ కార్డ్ తీసుకుని పదేళ్లు అయిన వారందరూ ఖచ్చితంగా అప్ డేట్ చేసుకోవాలని కేంద్రం ఇటీవల సూచించింది. దీంతో చాలా మంది ఆధార్ సెంటర్లకు పరుగులు తీశారు. అందరికీ ఉచితంగానే ఆధార్ అప్ డేట్ చేశారు . కానీ ఉచిత సేవల సమయం పూర్తయింది.  జూన్‌ 14 వరకూ ఉచిత సర్వీస్ ఇచ్చారు. ఆ తర్వాత నుంచి  చార్జ్ వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఉచిత సర్వీస్ గడువునూ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.  స్తుతం సెప్టెంబర్‌ 30 వరకూ ఉడాయ్ గడవు పెంచింది.   ఈ ఉచిత సేవ ప్రత్యేకంగా మైఆధార్‌ పోర్టల్‌లో అందుబాటులో ఉంటుంది.   ఆధార్ కేంద్రాలకు వెళ్తే  మాత్రం  రూ. 50 ఛార్జీ కట్టాల్సి ఉంటుంది.  పేరు, పుట్టిన తేదీ, చిరునామా మొదలైనవి ప్‌డేట్ చేయాలనుకుంటే  ఆన్‌లైన్ అప్‌డేట్ సేవను ఉపయోగించుకోవచ్చు. అది పూర్తిగా ఉచితం. ఎలాంటి  డబ్బులు కట్టాల్సిన పని లేదు. కానీ ఆధార్ కేంద్రానికి వెళ్తే మాత్రం రూ. యాబై కట్టాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


టెన్త్‌ అర్హతతో ఉద్యోగాలు


దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టాఫీసుల్లో 30,041 గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్ షెడ్యూల్-2, జులై 2023) ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్ పోస్టు మాస్టర్(ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టును బట్టి రూ.10,000 - రూ.12,000 ప్రారంభ వేతనం అందుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 23 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


ఓటీటీలోకి వచ్చే సినిమాలు


ఓటీటీ అనేది వచ్చిన తర్వాత థియేటర్లకు వెళ్లలేని, వెళ్లడం ఇష్టపడని వారి దగ్గరికే సినిమాలు తీసుకొస్తోంది. ఎంత బ్లాక్ బస్టర్ టాక్ అందుకున్న సినిమా అయినా, అది ఎన్ని కోట్లు కొల్లగొట్టినా ఏదో ఒకరోజు కచ్చితంగా ఓటీటీలో విడుదల అవుతుందిలే అనే నమ్మకం ఏర్పడుతోంది. దానివల్ల థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతుందని కొందరు వాదిస్తున్నా.. మరికొందరు మాత్రం మంచి టాక్ వస్తే ఏ సినిమాకు అయినా థియేటర్లలో ఆదరణ లభిస్తుందని అంటున్నారు. ఎలా అయినా కూడా ప్రతీ వారం ప్రతీ ఓటీటీలో ఏదో ఒక్క చిత్రం అయినా విడుదల అవుతూనే ఉంది. ఇక ఈ వారం రెండు తెలుగు సినిమాలు రెండు వేర్వేరు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదలవుతున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం.. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


క్రిష్‌-4 న్యూస్


అప్పటి వరకూ హాలీవుడ్ సినిమాలకే పరిమితమైన సూపర్ హీరో కాన్సెప్ట్ ని, భారతీయ ప్రేక్షకులకు పరిచయం చేసిన చిత్రం 'క్రిష్'. రాకేష్‌ రోషన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హ్యాండ్సమ్ హాంక్ హృతిక్‌ రోషన్‌ హీరోగా నటించాడు. సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం 'కోయి మిల్‌ గయా’ సినిమాతో ఈ ఫ్రాంచైజీ మొదలైంది. ఈ క్రమంలో ఇప్పటి వరకూ వచ్చిన మూడు సినిమాలు విశేష ప్రేక్షకాదరణ పొందాయి. సూపర్‌ హీరో సినిమా అంటే క్రిష్‌ అనే విధంగా బలమైన ముద్ర వేసాయి. అయితే వీటికి కొనసాగింపుగా నాలుగో భాగం ఎప్పుడు వస్తుందా అని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై రాకేష్‌ రోషన్‌ తాజాగా ఓ అప్‌డేట్‌ అందించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


ఎప్పటి నుంచో ఉన్న కోరిక


అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.. బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఈ బ్యూటీ త్వరలో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న 'దేవర' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు సందర్భాల్లో తారక్ పై తనకున్న అభిమానాన్ని బయటపెట్టిన జాన్వీ.. తాజాగా యంగ్ టైగర్ సరసన నటించే ఛాన్స్ దక్కడంపై స్పందించింది. తనకు ఎప్పటి నుంచో ఎన్టీఆర్ తో కలిసి పనిచేయాలనే కోరిక ఉందని చెప్పింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి