Top 10 Headlines Today:


 


నేడు రైతు భరోసా నిధులు 


వైఎస్ఆర్ రైతు భరోసా- పీఎం కిసాన్ పథకం 2023 - 24 కౌలు రైతులకు మొదటి విడత సాయాన్ని నేడు (ఆగస్టు 31) సీఎం జగన్ విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి నేరుగా లబ్ధి దారుల ఖాతాలోకి నిధులు జమ చేస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


రెండు సీట్లు వంద పంచాయితీలు


తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో  సీట్ల కసరత్తు ప్రారంభం కావడంతో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. బహిరంగంగా ఇంకా పెద్ద పెద్ద ఘటనలేమీ జరగలేదు కానీ అంతర్గతంగా మాత్రం.. ఆ పార్టీలోని అంతర్గత ప్రజాస్వామ్యం వెల్లువెత్తుతోంది. పార్టీ తరపున అభ్యర్థుల్ని ఖరారు చేసేందుకు ఏర్పాటు చేసిన మొదటి సమావేశంలో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సెగలు రేపింది. ఇందులో ప్రధానమైన సమస్య కుటుంబానికి ఒకే టిక్కెట్ ఇస్తారా రెండు టిక్కెట్లు ఇస్తారా అన్నదే. కొంత మంది కీలక నేతలు తమ కుటుంబాలకు రెండు టిక్కెట్లు కోరుతున్నారు. దరఖాస్తులు చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ లో ఇప్పటికే ఒక కుటుంబానికి ఒకే టిక్కెట్ అన్న షరతు ఉంది. దీంతో తమ స్థాయిలో తాము ఒత్తిడి తెచ్చేందుకు ఆయా నేతలంతా రెడీ అయ్యారు. అందుకే తొలి సమావేశమే వేదిక అయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


డ్రగ్స్‌ రాకెట్


హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్‌ కలకలం రేపుతున్నాయి. మాధపూర్‌ పరిధిలో ఓ అపార్ట్‌మెంట్‌లో రేవ్‌ పార్టీ జరిగింది. దీన్ని పోలీసులు భగ్నం చేశారు. ఇక్కడ ఓ నిర్మాతతోపాటు ఐదుగురు ప్రముఖులను అరెస్టు చేశారు.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


సూపర్ బ్లూ మూన్


 బుుధవారం రాత్రి ఆకాశంలో అరుదైన ఘటన జరిగింది. ఆకాశంలో సూపర్ బ్లూ మూన్ కనువిందు చేసింది. సాధారణం కంటే మరింత ప్రకాశవంతంగా పెద్దగా కనిపించే చంద్రుడిని సూపర్‌ మూన్‌ అని పిలుస్తారు. ఈ సమయంలో చంద్రుడు సాధారణం కన్నా 7 శాతం పెద్దగా, 16 శాతం ప్రకాశవంతంగా కనిపిస్తాడు. ఖగోళ శాస్త్రవేత్తలు దీన్ని పెరీజియన్‌ పౌర్ణమిగా పిలుస్తారు. ఇలా ఒకే నెలలో రెండుసార్లు నిండు పౌర్ణమి ఏర్పడటాన్ని సూపర్‌ బ్లూ మూన్‌ లేదా బ్లూ మూన్‌ పేర్కొంటారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


వెదర్ అప్‌డేట్


నిన్నటి అవర్తనం ఈరోజు ఈశాన్య & పరిసర ప్రాంతాల్లోని తూర్పు మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 5.8 కి. మీ  వరకు కొనసాగుతూ ఎత్తుకి వెళ్ళేకొలది నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు బుధవారం (ఆగస్టు 30) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రోజు దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ / వాయువ్య దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపునకి వీస్తున్నాయని అన్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ రేపు, ఎల్లుండి కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు తూర్పు, ఈశాన్య జిల్లాలలో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని జిల్లాలలో వచ్చే అవకాశం ఉంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


దసరాకు మేనిఫెస్టో 


తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను మహిళల సమక్షంలో విడుదల చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు.  మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో రాఖీ పౌర్ణమి వేడుకలు నిర్వహించారు.  టీడీపీమహిళా నేతలు వంగలపూడి అనిత, పీతల సుజాత తదితరులు చంద్రబాబుకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.  మహిళా సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు.  మేనిఫెస్టోలోనూ మహిళాభ్యున్నతికే పెద్ద ఎత్తున పథకాలు పెడతామని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


అదానిపై కన్ను


అదానీ గ్రూప్‌ కంపెనీ షేర్లను షార్ట్‌ సెల్లింగ్‌ చేసిన కేసులో సంచలన విషయాలు బయట పడుతున్నాయి. భారత్‌కు చెందిన ఓ ప్రైవేటు బ్యాంకు మరో 15 సంస్థలకు సంబంధం ఉందని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణలో బయటపడ్డట్టు సమాచారం. ఫారిన్‌ పోర్టుపోలియో ఇన్వెస్టర్లు సహా 16 కంపెనీల గురించి సెబీకి ఈడీ వివరాలు సమర్పించిందని తెలిసింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


నితిన్‌తో కాంతారా నాయిక


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వీరాభిమానులలో యువ హీరో నితిన్ (Nithin) ఒకరు. గతంలో 'తొలి ప్రేమ'లో 'ఏమైందో ఈ వేళ' పాటను రీమిక్స్ చేశారు. ఇప్పుడు పవన్ హిట్ సినిమాల్లో ఒకటైన 'తమ్ముడు' టైటిల్ (Thammudu New Movie)తో నితిన్ సినిమా చేస్తున్నారు. ఇటీవల ఆ సినిమా మొదలైంది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఆ సినిమాలో కథానాయికగా కన్నడ భామను ఖరారు చేశారట!పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


భైరవ ద్వీపం రీరిలీజ్ వాయిదా


గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్. వాళ్ళు ఎంతగానో ఎదురు చూస్తున్న ఓ సినిమా రీ రిలీజ్ మరోసారి వాయిదా పడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


నాగిని డ్యాన్స్ చేసేది ఎవరో?


వన్డే ప్రపంచకప్‌కు  ముందు కీలక ఆటగాళ్లు దూరమై గాయాలతో సతమతమవుతున్న బంగ్లాదేశ్, శ్రీలంకలు  నేడు (గురువారం) ఆసియా కప్‌లో తొలి పోరులో ఢీకొనబోతున్నాయి. ఇటీవలి కాలంలో  ఈ రెండు దేశాల ఆటగాళ్లు ఫీల్డ్‌లో చేసే  అతి, ఒకరిమీద ఒకరు పెంచుకున్న వైరంతో బంగ్లా - లంక మ్యాచ్  కూడా హై ఓల్టేజ్  డ్రామాగా సాగుతూ ఇరు దేశాలలో అభిమానులకు ఫుల్ క్రికెట్ మజాను అందిస్తున్నది. మరి  బంగ్లా పులల నాగిని డాన్స్‌కు లంక సింహాలు తోకముడుస్తాయా..? తొలి పోరులో నాగిని డాన్స్ ఎవరిది..? 


పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి