Top 10 Headlines Today: 


పిక్చర్ క్లియర్


ఎన్నికలు దగ్గర పడే వేళ.. తెలంగాణ రాజకీయ ముఖచిత్రం.. క్లియర్ అవతోంది. ఎవరు ఎవరికి దగ్గరగా జరుగుతున్నారో .. తెలుస్తూ ఉంది. బాహర్ మే కుస్తీ.. అందర్ మే దోస్తీ లా ఉండే తెలంగాణ పాలిటిక్సులో ఎవరు ఎవరి వైపు ఉన్నారో చెప్పడం కష్టం..ఎలక్షన్ కు నాలుగైదు  నెలలు కూడా లేవు కాబట్టి ఇక బయట పడకతప్పదు.  ఆ ఛాయలే భారత రాష్ట్ర సమితిలో బయట పడుతున్నాయని .. రాజకీయ పరిశీలకులు.. చెబుతున్నారు. ఇక ప్రతిపక్షం కాంగ్రెస్ ఎలాగో భాజపా-భారస ఒకటేనని భాజప్తా చెబుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


ఆ రోజు ఏం జరిగింది?


29 జూన్ 2010 ..ఢిల్లీ లో వై యస్ రాజశేఖర్ రెడ్డి  కుమారుడు జగన్ మోహన్ రెడ్డి , తన తల్లి విజయలక్ష్మి  , చెల్లెలు షర్మిల తో పాటు సోనియా గాంధీ ని కలిశారు.  తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన అభిమానులు, కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తా నంటూ జగన్ మొదలు పెట్టిన ఓదార్పు యాత్ర అప్పటికే తెలంగాణ ప్రాంతంలో ఒక జిల్లా..ఆంధ్ర ప్రాంతం లో మరో జిల్లా లోనూ జరిగింది. అయితే పార్టీ హై కమాండ్ నుండి ఈ యాత్ర కు గ్రీన్ సిగ్నల్ రాకపోవడం తో తాత్కాలికంగా ఓదార్పు యాత్ర ను పోస్ట్ ఫోన్ చేశారు. హైకమాండ్ ను కలవాలని పెద్దలు సూచించడంతో కుటుంబంతో సహా జగన్ ఢిల్లీ వెళ్లారు.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


తెలంగాణలో ఉరుములు మెరుపులతో వర్షాలు


ప్రస్తుతం తెలంగాణలో దిగువ స్థాయిలో పశ్చిమ గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో   తేలికపాటి నుండి మోస్తారు  వర్షాలు  ఈ రోజు చాలా చోట్ల  మరియు రేపు, ఎల్లుండి అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు మరియు మెరుపులతో  కూడిన  వర్షములు  ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలలో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


ఫుల్‌ ఫోకస్ 


తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇంచార్జ్ ల నియామకం మెదలుకుని, నేతల మధ్య విభేదాలు, భవిష్యత్ కు గ్యారంటీ వంటి కార్యక్రమాల పై చంద్రబాబు ప్రతి రోజు సమీక్షలు చేస్తున్నారు.. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


నేడు ఐసెట్ రిజల్ట్స్‌


తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన 'టీఎస్ ఐసెట్‌-2023' పరీక్ష ఫలితాలు జూన్ 29న వెలువడనున్నాయి. జూన్‌ 29 మధ్యాహ్నం 3.30గంటలకు విడుదల చేయనున్నట్టు కన్వీనర్‌ పి.వరలక్ష్మి జూన్ 28న ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


మజ్లిస్‌ దోస్తీపై డైలమా 


తెలంగాణ రాజకీయాల్లో మజ్లిస్ పాత్ర చాలా కీలకం. ఆ పార్టీకి కనీసం ఏడు స్థానాలు గ్యారంటీగా వస్తాయి.  అంతే కాదు ఆ పార్టీ తాను అనుకున్న పార్టీకి ఇతర నియోజకవర్గాల్లో ఓట్లు వేయించగలదు. కానీ ఇప్పుడు అసదుద్దీన్.. తమ బలం ఏంటో చూపిస్తామని అంటున్నారు.  బీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ పార్టీల మధ్య పొత్తులు లేదా స్నేహపూర్వక పోటీలు ఉండవని తేలిపోయింది. ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లి  బడ్జెట్‌ సమావేశాల్లో ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్‌ వచ్చే ఎన్నికల్లో కనీసం 15 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని శాసనసభకు వస్తామని సవాల్‌ చేశారు.  దానికి కొనసాగింపుగా అసదుద్దీన్‌ కూడా రాష్ట్రంలో ప్రత్యా మ్నాయ పార్టీగా మజ్లిస్‌ను తీర్చిదిద్దుతామని ప్రకటించారు.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


ఎన్టీఆర్, రామ్‌చరణ్, కీరవాణికి అరుదైన గుర్తింపు


ప్రతిష్టాత్మక ఆస్కార్ (Oscar) అవార్డులు ప్రదానం చేసే 'ద అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్' (The Academy Of Motion Picture Arts And Sciences) 398 మందికి కొత్తగా ఆస్కార్ కమిటీలో సభ్యత్వం కల్పించింది. భారతీయ సినిమా ప్రేక్షకులకు, మరీ ముఖ్యంగా తెలుగు ప్రజలకు గర్వకారణమైన అంశం ఏమిటి? అంటే... అందులో 'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందం నుంచి ఆరుగురు ఉన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


చిట్టితల్లి కోసమే బొడ్డుతాడు


హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులు.. ఇటీవలే తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. డెలివరీకి ముందే ఉపాసన తనకు పుట్టబోయే బిడ్డ కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో మొదటిది పాప బొడ్డుతాడు (Umbilical Cord)ను భద్రపరచడం. అయితే, ఇదేదో పాప జ్ఞాపకార్థం కోసం దాచి పెట్టడం లేదు. చిన్నారి భవిష్యత్తు కోసం. అదేంటీ? బొడ్డుతాడుతో భవిష్యత్తు ఏమిటీ అని అనుకుంటున్నారా? అయితే మీరు తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాలి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


టాప్‌లో హైదరాబాద్‌


జూన్ 30తో ముగిసే త్రైమాసికంలో (ఏప్రిల్‌-జూన్‌ కాలం), భారతదేశంలోని టాప్-7 నగరాల్లో హౌసింగ్ సేల్స్‌ ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలో 1,15,100 యూనిట్లకు చేరుకోవచ్చని ప్రాపర్టీ కన్సల్టెన్సీ కంపెనీ అనరాక్ (Anarock) అంచనా వేసింది. గత ఏడాది ఇదే క్వార్టర్‌లో చేతులు మారిన 84,940 యూనిట్ల కంటే ఇది 36 శాతం (YoY) ఎక్కువ. హోమ్‌ లోన్‌ వడ్డీలు ఎక్కువగా ఉన్నా, అంతర్జాతీయ పరిస్థితులు సహకరించకున్నా ఇండియన్స్‌ భారతీయులు వెనక్కు తగ్గడం లేదని అనరాక్‌ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


క్రికెట్‌లో రాజకీయం 


ఈ ఏడాది అక్టోబర్ నుంచి  భారత్ వేదికగా జరుగబోయే ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌కు సంబంధించిన షెడ్యూల్‌ మంగళవారం విడుదలైంది.  అతిపెద్ద క్రికెట్ కార్నివాల్ దేశంలో జరుగుతుండటంతో  భారత్‌లోని పది నగరాలలో గల వేదికలు ఇందుకు ముస్తాబవుతున్నాయి. అయితే మ్యాచ్‌లు దక్కిన వాళ్లు సంతోషంగా ఉంటే  దక్కనివాళ్లు మాత్రం తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్స్ వరకే ఇది పరిమితం కాలేదు. వేదికలకు రాజకీయ రంగు కూడా అంటుకుంది.  బీజేపీ అనుకూల రాష్ట్రాలకే ఎక్కువ మ్యాచ్‌లు, అధిక ప్రాధాన్యత కలిగిన మ్యాచ్‌‌లను  ఇచ్చారన్న ఆరోపణలు తీవ్రమయ్యాయి.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి