YSRCP day :   29 జూన్ 2010 ..ఢిల్లీ లో వై యస్ రాజశేఖర్ రెడ్డి  కుమారుడు జగన్ మోహన్ రెడ్డి , తన తల్లి విజయలక్ష్మి  , చెల్లెలు షర్మిల తో పాటు సోనియా గాంధీ ని కలిశారు.  తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన అభిమానులు, కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తా నంటూ జగన్ మొదలు పెట్టిన ఓదార్పు యాత్ర అప్పటికే తెలంగాణ ప్రాంతంలో ఒక జిల్లా..ఆంధ్ర ప్రాంతం లో మరో జిల్లా లోనూ జరిగింది. అయితే పార్టీ హై కమాండ్ నుండి ఈ యాత్ర కు గ్రీన్ సిగ్నల్ రాకపోవడం తో తాత్కాలికంగా ఓదార్పు యాత్ర ను పోస్ట్ ఫోన్ చేశారు. హైకమాండ్ ను కలవాలని పెద్దలు సూచించడంతో కుటుంబంతో సహా జగన్ ఢిల్లీ వెళ్లారు.  


చివరి మీటింగ్‌లో ఓదార్పు యాత్ర ఆపేయాలని ఆదేశించిన సోనియా గాంధీ ! 


ఢిల్లీ లోని సోనియా గాంధీ నివాసం లో  అరగంట సేపు భేటీ జరిగింది.  ఓదార్పు యాత్ర ను ఆపి వేయాలని..  వైయస్ ఆర్ కోసం చనిపోయిన వారి కుటుంబాలను జిల్లా కేంద్రాల్లో మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడికే వారిని పిలిపించి చెక్కులు అందజేయాలని చివరికి సోనియా గాంధీ సూచించారు. దానికి జగన్ అంగీకరించలేదు.  తాను ఆల్రెడీ బాధిత కుటుంబాలకు మాట ఇచ్చానని జగన్ సోనియా కు తెలిపిన జగన్ ఓదార్పు యాత్ర ఆపనని చెప్పి వచ్చేశారు. తొమ్మిది రోజుల తర్వాత హైకమాండ్ మాటను కాదని మళ్లీ ఓదార్పు యాత్ర మొదలు పెట్టారు. కాంగ్రెస్ లోని జగన్ వ్యతిరేక వర్గం  ఇందిరా గాంధీ..రాజీవ్ గాంధీ లు చనిపోయినప్పుడు కూడా ఇంతమంది చనిపోలేదు వై యస్ ఆర్ కోసం మాత్రం ఎలా చనిపోయారు.. ఇది కేవలం జగన్ వ్యక్తిగత ఇమేజ్ కోసం చేస్తున్న ప్రచారం అంటూ ఆరోపణలు చేసేవారు.


జగన్ మీడియాలో కాంగ్రెస్ హైకమాండ్‌పై సొంత మీడియాలో విస్తృత వ్యతిరేక ప్రచారం 


తర్వాత జగన్మోహన్ రెడ్డికి చెందిన మీడియాలో కాంగ్రెస్ హైకమాండ్‌కు వ్యతిరేకంగా వార్తలు, కథనాలు ప్రసారం చేయడం ప్రారంభించారు.  దీనిపై పార్టీ హైకమాండ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే నాటి కాంగ్రెస్ ఎమ్మెల్సీ..దివంగత సీఎం YSR సోదరుడు వివేకానంద రెడ్డి సాక్షి టీవీ లో వచ్చిన కథనాల పై విచారం వ్యక్తం చేస్తూ పార్టీ హై కమాండ్ కి విధేయత ప్రకటించారు. ఈ వరుస పరిణామాల ఫలితంగా   29 నవంబరు 2010 న  జగన్మోహన్ రెడ్డి పార్టీ కి 5 పేజీల పేజీల రాస్తూ పార్టీకి ..ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అదే సమయంలో ఆయన తల్లి విజయమ్మ కూడా పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత జగన్ ,విజయమ్మ లు ఉప ఎన్నికల్లో గెలవడం..సొంత పార్టీ అనౌన్స్ చెయ్యడం ..మరో వైపు ఆయనపై కాంగ్రెస్ నేతలు.. ఇతర రాజకీయ ప్రత్యర్ధులు కేసులు వెయ్యడం  ఫలితంగా 16 నెలల పాటు జైలు కు వెళ్లి రావడం.. ఈలోపు రాష్ట్రం రెండుగా విడిపోవడం..వంటి పరిణామాలుజరిగాయి.  


జగన్ వ్యక్తిగత ఎజెండాతోనే ఓదార్పు యాత్ర చేస్తున్నారని హైకమాండ్‌కు క్లారిటీ 


సోనియా గాంధీ ఓదార్పు యాత్ర కు అనుమతి ఇవ్వక పోవడం వెనుక కారణాలు చాలానే ఉన్నాయిని చెబుతారు.  ఆ సమయంలోనే తెలంగాణ మలిదశ ఉద్యమం బలంగా మొదలైంది. తెలంగాణ లో ఉప ఎన్నికల హడావుడి జోరుగా ఉంది. ఆ సమయంలో జగన్ ఓదార్పు యాత్ర పార్టీ కి నష్టం చేస్తుంది అని కాంగ్రెస్ భావించింది  మరో వైపు ఓదార్పు యాత్ర పేరుతో జగన్ మోహన్ రెడ్డి తన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకుంటున్నారు తప్ప పార్టీ కి మద్దతుగా ఆయన యాత్ర సాగడం లేదన్న రిపోర్ట్స్ సొంత పార్టీ నేతల నుండే హై కమాండ్ కు చేరాయి. అలాగే వైయస్ రాజశేఖర్ రెడ్డి లాంటి బలమైన నేత మరణం తో ఒక్కసారిగా చెల్లా చెదురైన పార్టీ లో జగన్మోహన్ రెడ్డి యాత్రల పేరుతో మరింత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారని హై కమాండ్ భావించింది  


నాడు అన్నకోసం సోనియా తో విభేదించిన షర్మిల..నేడు కాంగ్రెస్ కు దగ్గరవుతున్నారా? 
   
రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు . అలాగే పాలిటిక్స్ లో శాశ్వత మిత్రులు..శాశ్వత శత్రువులు ఉండరు అంటారు . దానికి సాక్ష్యం గా 13 ఏళ్ల నాటి సమావేశంలో అన్న జగన్ కు మద్దతుగా సోనియా గాంధీ తో విభేదించిన వైయస్ షర్మిళ ఇప్పుడు  అన్నతో విభేదించి తెలంగాణా లో పార్టీ పెట్టి.  అదే కాంగ్రెస్ పార్టీ కు సన్నిహితం అవుతున్నారు . త్వరలో షర్మిల సోనియాతో భేటీ కావొచ్చని చెబుతున్నారు.