Chandrababu Meeting with TDP Incharges: తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇంచార్జ్ ల నియామకం మెదలుకుని, నేతల మధ్య విభేదాలు, భవిష్యత్ కు గ్యారంటీ వంటి కార్యక్రమాల పై చంద్రబాబు ప్రతి రోజు సమీక్షలు చేస్తున్నారు..
తెలుగు దేశం అన్ స్టాపబుల్...
అన్ స్టాబపబుల్.. ఈ పదం ఇప్పుడు పసుపుదళంలో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. పార్టీ అధినేత నారా చంద్రబాబు వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ వ్యవహరాల పై ఫుల్ ఫోకస్ పెట్టారని తెలుగు దేశం శ్రేణుల్లో ప్రత్యేకంగా టక్ నడుస్తోంది. నియోజకవర్గాలకు ఇంచార్జ్ ల నియామకం, నేతల గ్రాఫ్ పై సమీక్షలు, నాయకుల మధ్య విభేదాల పరిష్కారం, పార్టీలో చేరికలు, భవిష్యత్ కు గ్యారెంటీపై ప్రచార కార్యక్రమం వంటి అంశాలపై  తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారని చెబుతున్నారు. ప్రధానంగా నియోజకవర్గ ఇంచార్జ్ ల నియామకంపై ఫోకస్ పెట్టిన చంద్రబాబు అభ్యర్దుల ఎంపిక పై పూర్తి స్దాయిలో ఆలోచనలు చేస్తున్నారు. నియోజకవర్గ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో అధినేత సీరియస్ గా స్టడీ చేస్తున్నారు. గతంలో పార్టీల బలాబలాలు, కులాల వారీగా ఉన్న పరిస్థితులు, ఇప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి, రాబోయే ఎన్నికలకు పరిస్థితులు ఎలా ఉంటాయన్నదానిపై చంద్రబాబు అంచనాలు వేస్తున్నారని అంటున్నారు. 
ఇంచార్జ్ లతో రివ్యూలు చేస్తున్న బాబు...
ఇప్పటికే ఎన్నికలకు సంబందించి హడావుడి మొదలైన క్రమంలో నియోజకవర్గాల వారీగా ఉన్న ఇంచార్జ్ ల పరిస్థితి ఏంటన్న దానిపై చంద్రబాబు ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ కోసం పని చేస్తున్న నాయకులను, కార్యకర్తలను కలుపుకొని, విభేదాలు పక్కన పెట్టి పార్టీ గెలుపు లక్ష్యంగా పని చేస్తున్న నేతలతో చంద్రబాబు ఒకటికి రెండు సార్లు కూడా రివ్యూ చేస్తున్నారు. పార్టీ ఇంచార్జ్ కు ఉన్న సమస్యలతో పాటుగా స్థానికంగా నెలకొన్న పరిస్దితులు, వాటిని ఎలా అధిగమించాలి, రాజకీయంగా ఎలా అనువుగా మార్చుకోవాలి అనే విషయాలను కూడ చంద్రబాబు స్వయంగా ఇంచార్జ్ లకు వివరిస్తున్నారని చెబుతున్నారు. ఓ వైపున అసెంబ్లీ ఇంచార్జ్ లతో రెండో దఫా రివ్యూలు చేస్తూనే, మరో వైపు ఆయా స్థానాల్లో ఇంచార్జ్ ల నియామకం వేగవంతం చేసే పనిలో తెలుగు దేశం అధినేత చంద్రబాబు ఉన్నారని చెబుతున్నారు.


43 అసెంబ్లీ ఇంచార్జ్ లతో రెండో దఫా సమీక్షలు..
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్న చంద్రబాబు, నేతలతో నేరుగా టచ్ లోకి వెళుతున్నారు. రెండో దఫా సమీక్షల్లో భాగంగా ఇప్పటికే 43 నియోజకవర్గాలపై చంద్రబాబు రెండో సారి సమీక్షలు చేశారని అంటున్నారు. ఇంచార్జ్ ల నియామకంపై కొన్ని  స్ధానాల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు ముగింపు పలుకుతూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి కన్నా లక్ష్మీ నారాయణను ఇంచార్జ్ గా నియమిస్తూ కొద్ది రోజుల క్రితం నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జి.డి నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ గా వి.ఎం. థామస్, పూతలపట్టు ఇంచార్జ్ గా కలికిరి మురళీ మోహన్  నియామకం చేపట్టారు. వర్గ పోరు ఉన్న స్థానాలపైనా పార్టీ అధినేత స్సెషల్ ఫోకస్ పెట్టారు. గోపాలపురం నియోజవకర్గంలో పార్టీ నేతల మధ్య విభేదాలకు కూడ చంద్రబాబు త్వరలోనే ముగింపు పలుకుతారని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. గోపాలపురం ఇంచార్జ్ వెంకటరాజు, పార్టీ నేత బాపిరాజులకు అధినేత నుండి పిలుపు వెళ్ళింది. మరోవైపు పార్టీలో చేరికల పైనా దృష్టిపెట్టిన పార్టీ అధినేత, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్ సివి నాయుడు ను పార్టీలోకి ఆహ్వనిస్తున్నారు. భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమంపై  ప్రజల్లోకి వెళ్లేందుకు చంద్రబాబు ప్రణాళికలు చేస్తున్నారు. 
వచ్చే నెల మొదటి లేదా రెండో వారం నుంచి భవిష్యత్ కు గ్యారెంటీ పై జిల్లాల్లో చంద్రబాబు పర్యటనలకు ప్రణాళికలు చేస్తున్నారు. అంతే కాదు  యువగళం పాదయాత్ర ఒక వైపు, భవిష్యత్ కు గ్యారెంటీపై చంద్రబాబు ప్రచార యాత్రలు మరో వైపు ఉండేలా ప్రణాళికలు ఉండబోతున్నాయని పార్టీ లో జోరుగా చర్చనడుస్తోంది. ఇప్పటికే ఐదు జోన్లలో భవిష్యత్ కు గ్యారెంటీ పేరుతో నేతల చైతన్య రథ యాత్రలు చేస్తున్నారు.