Real Estate: ప్రస్తుతం రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ నడుస్తోంది. ఇళ్లు, స్థలాల కొనుగోళ్లలో ఇండియన్స్‌ హ్యాండ్‌ రైజింగ్‌లో ఉంది. రిజిస్ట్రేషన్ల లెక్కలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. 


జూన్ 30తో ముగిసే త్రైమాసికంలో (ఏప్రిల్‌-జూన్‌ కాలం), భారతదేశంలోని టాప్-7 నగరాల్లో హౌసింగ్ సేల్స్‌ ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలో 1,15,100 యూనిట్లకు చేరుకోవచ్చని ప్రాపర్టీ కన్సల్టెన్సీ కంపెనీ అనరాక్ (Anarock) అంచనా వేసింది. గత ఏడాది ఇదే క్వార్టర్‌లో చేతులు మారిన 84,940 యూనిట్ల కంటే ఇది 36 శాతం (YoY) ఎక్కువ. హోమ్‌ లోన్‌ వడ్డీలు ఎక్కువగా ఉన్నా, అంతర్జాతీయ పరిస్థితులు సహకరించకున్నా ఇండియన్స్‌ భారతీయులు వెనక్కు తగ్గడం లేదని అనరాక్‌ వెల్లడించింది. 


దేశంలోని టాప్‌-7 నగరాలు.. ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్ (MMR), నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR), పుణె, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతాలో అమ్మకాల వేగం ఆధారంగా త్రైమాసిక లెక్కలను అనరాక్‌ అంచనా వేసింది.


ముంబయి, పుణె లీడర్స్‌
అనరాక్‌ డేటా ప్రకారం... అంతకుముందు త్రైమాసికంతో (2023 జనవరి-మార్చి కాలం) పోలిస్తే, జూన్‌ త్రైమాసికంలో (QoQ) వృద్ధిని చూసేది ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్ (MMR), పుణె మాత్రమే. అయినా, కేవలం రెండు నగరాల్లోని విక్రయాలు మొత్తం దేశవ్యాప్త అమ్మకాలను పెంచాయి.


MMRలో మొత్తం 38,090 యూనిట్లు అమ్ముడవుతాయి, గత ఏడాది ఇదే కాలంలోని 34,690 యూనిట్ల కంటే ఇది 10 శాతం (YoY) ఎక్కువ. పుణెలో 20,680 యూనిట్లు చేతులు మారతాయి. గత ఏడాది ఇదే కాలంలోని 19,920 యూనిట్లతో పోలిస్తే 4 శాతం పెరిగే అవకాశం ఉంది.


దేశంలోని టాప్‌-7 సిటీస్‌లో జరిగిన మొత్తం హౌసింగ్‌ సేల్స్‌లో MMR, పుణె వాటా కలిసి 51 శాతం ఉంటుంది. అంటే, సగం కంటే డిమాండ్‌ కేవలం ఈ రెండు ప్రాంతాల్లోనే కనిపిస్తుంది.


ఇతర నగరాల్లో... నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR), బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతాలో క్వార్టర్ ఆన్ క్వార్టర్ (QoQ) అమ్మకాలు తగ్గుతాయని అంచనా.


ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో, దేశంలోని టాప్‌-7 సిటీస్‌లో 1,13,780 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇప్పటివరకు ఉన్న రికార్డ్‌ హై ఇదే. జూన్‌ త్రైమాసికంలో ఈ రికార్డ్‌ బద్ధలవుతుందని అనరాక్ చెబుతోంది.


QoQ బేసిస్‌లో సేల్స్‌ తగ్గినా, YoY బేసిస్‌లో జంప్‌ కనిపిస్తుందని, పుణె (65 శాతం) టాప్‌ ప్లేస్‌లో ఉంటుందని డేటా చూపిస్తోంది. ఆ తర్వాత MMRలో 48 శాతం, చెన్నైలో 44 శాతం వృద్ధి కనిపిస్తుంది. 7 శాతం విక్రయాలతో సింగిల్ డిజిట్ వృద్ధిని సాధించిన ఏకైక నగరం NCR.


గత ఏడాది జూన్‌ క్వార్టర్‌తో పోలిస్తే, ద్రవ్యోల్బణం కారణంగా ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో టాప్-7 నగరాల్లోని ప్రాపర్టీ రేట్లు సగటున 6 నుంచి 10 శాతం వరకు పెరుగుతాయి. "ప్రధానంగా, రామెటీరియల్‌ ధరల్లో పెరుగుదల, హయ్యర్‌ డిమాండ్ వల్ల రేట్లు పెరుగుతాయి" అని అనరాక్ డేటా వెల్లడించింది.


ఇళ్ల ధరల పెరుగుదలలో హైదరాబాద్‌ టాప్‌
మిగిలిన టాప్‌ సిటీస్‌తో పోలిస్తే హైదరాబాద్‌లోనే ఇళ్ల ధరలు ‍‌(housing prices in hyderabad) అత్యధికంగా 10 శాతం పెరిగాయి. భాగ్యనగరంలో చదరపు అడుగు సగటున రూ. 4,980 ధర పలుకుతోంది.


ఈ ఏడు నగరాల్లో హౌసింగ్‌ సప్లైలో కూడా 25 శాతం పెరుగుదల కనిపించింది. 2022 జూన్‌ త్రైమాసికంలోని 82,150తో పోలిస్తే, 2023 జూన్‌ త్రైమాసికంలో న్యూ లాంచ్‌లు దాదాపు 1,02,610 యూనిట్లుగా ఉండవచ్చని అంచనా.


ఇళ్ల సప్లైలోనూ MMR, పుణెదే నాయకత్వం. ఈ త్రైమాసికంలో కొత్త లాంచ్‌లలో 63 శాతం వాటా ఈ రెండు సిటీస్‌దే.


మరో ఆసక్తికర కథనం: ఒక్క ఏడాదిలో 350 కోట్ల లీటర్ల కిక్కు, ఎక్కువ ఎంజాయ్‌ చేసిన రాష్ట్రాలివి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial