Top 10 Headlines Today: 


బలహీనపడ్డ అల్పపీడనం


‘‘నిన్నటి తీవ్రఅల్పపీడనం ఈ రోజు అల్పపీడనంగా బలహీన పడి  ప్రస్తుతం దక్షిణ ఒడిశా, పరిసరాల్లోని ఉత్తర ఆంధ్రప్రదేశ్ వద్ద కొనసాగుతుంది. ఈ అల్పపీడనంకి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కి మి ఎత్తు వరకు కొనసాగుతుంది. రుతుపవన ద్రోణి ఈ రోజు బికనేర్, కోట, రైజన్, దుర్గ్, దక్షిణ ఒడిశా, పరిసరాల్లోని ఉత్తర ఆంధ్రప్రదేశ్ లోని అల్పపీడన ప్రాంతము మీదగా తూర్పు ఆగ్నేయ దిశగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం  వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


రికార్డు వర్షపాతం


హైదరాబాద్ నగరం మీద వరుణుడు పగబట్టాడా అన్నట్లు.. నగరాన్ని వరదలు ముంచెతుత్తున్నాయి. కొంచెం కూడా గ్యాప్‌ లేకుండా వర్షం విపరీతంగా కురుస్తుంది. దీంతో నగర వాసులు తడిసి ముద్దవుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు కూడా ప్రకటించింది. జులై 24న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా హైదరాబాద్‌ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


మద్దతుకు కారణమేంటీ?


పార్లమెంట్ లో అత్యంత కీలకమైన బిల్లులు చర్చకు రాబోతున్నాయి. ఢిల్లీ ప్రభుత్వ అధికారాలు తగ్గిస్తూ.. లెఫ్టినెంట్ గవర్నర్‌నే ప్రభుత్వంగా మార్చే బిల్లుకు వైఎస్ఆర్‌సీపీ మద్దతు ఇస్తామని ప్రకటించింది. అలాగే ఇండియా కూటమి పెట్టిన అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకమని.. బీజేపీకి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేసింది. త్వరలో యూనిఫాం సివిల్ కోడ్ బిల్లు పెడితే దానికీ మద్దతిచ్చే అవకాశాలే ఉన్నాయని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ముస్లింలకు నష్టం జరగబోదని.. ఏదైనా జరిగితే తాము అండగా ఉంటామని చెబుతూ బీజేపీకి మద్దతు ప్రకటించవచ్చు. ఇక్కడ విషయం ఏమిటంటే బీజేపీ అసలు మద్దతు ఇవ్వాలని అడగకపోవడం. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


పవన్‌ను కొట్టాలని ఉంది: వాసిరెడ్డి పద్మ


జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌  పై మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి  పద్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కనిపిస్తే.. ఎదురుపడితే లాగి లెంపకాయ కొట్టాలనిపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  సభ్యత ఉంది కనుకే నోటీసులు ఇస్తున్నామని.. వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలకు మరోసారి నోటీసులు ఇస్తామన్నారు. పది రోజుల్లో సమాధానం  ఇవ్వాలని రెండు వారాల కిందట నోటీసులు జారీ చేశారు. పవన్ కల్యాణ్ స్పందించలేదు. అయితే  తదుపరి ఏం చర్యలు తీసుకోవాలన్నదానిపై మహిళా కమిషన్ ఏ నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు మరోసారి నోటీసులు జారీ చేస్తామని వాసిరెడ్డి పద్మ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


వన్డేల్లో బోణీ


వెస్టిండీస్‌తో జరుగుతున్న మొదటి వన్డేలో భారత్ ఐదు వికెట్లతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 23 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలిపోయింది. అనంతరం భారత్ 22.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్‌లో కెప్టెన్ షాయ్ హోప్ (43: 45 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బ్యాటర్లలో ఇషాన్ కిషన్ (52: 46 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) అర్థ సెంచరీతో అత్యధిక పరుగులు సాధించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


బరాత్‌ పాటలకు కాపీ రైట్‌ వర్తించదు


పెళ్లి వేడుకలు, ఇతర ఫంక్షన్లలో సినిమా పాటలను పెట్టి డ్యాన్సులు వంటివి చేయడం కాపీరైట్‌ ఉల్లంఘన కింద రాదు అంటూ స్పష్టం చేసింది. దీని గురించి ఏ విధమైన చట్టపరమైన చర్యలు తీసుకోలేరని వివరించింది. కొద్ది రోజుల క్రితం పెళ్లి వేడుకల్లో హిందీ పాటలు ప్రదర్శించాలంటే కాపీరైట్‌ సొసైటీలు పన్ను వసూలు చేయడంతో కొందరు కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


పీఎస్ఎల్వీ సీ56 ఏం తీసుకెళ్లనుంది?


భారత అంతరిక్షణ పరిశోధ సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 30వ తేదీ ఆదివారం రోజున పీఎస్ఎల్వీ సీ56 ప్రయోగాన్ని చేపట్టేందుకు ఇస్రో అన్ని సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఈ నెల 30వ తేదీ ఆదివారం రోజున ఉదయం 6.30 గంటలకు ఈ ప్రయోగం చేపట్టనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


కారు డ్రైవ్ చేసేవాళ్లకు టెన్ టిప్స్‌


మనదేశంలో ఎండా కాలం సూర్యుడి భగభగలకు బై చెప్పేసి, వర్షాకాలం వరుణుడి హాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా వర్షాలు ఆగకుండా కురుస్తూనే ఉన్నాయి. ఈ వర్షాకాలంలో రోడ్ల మీదకు నీరు చేరడం చాలా కామన్. కాబట్టి ఈ రోడ్ల మీద డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. ముఖ్యంగా నీరు నిలిచి ఉన్న ప్రాంతాల్లో కారు డ్రైవ్ చేసేటప్పుడు ఈ 10 విషయాలు తప్పకుండా పాటించాలి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


ఐస్ క్రీమ్ నిజంగానే చల్లబరుస్తుందా?


చాలా మందికి ఐస్ క్రీమ్ ఆల్ టైమ్ ఫేవరెట్. వేసవిలో ఎక్కువ మంది తినడానికి ఇష్టం చూపిస్తారు. కానీ కొంతమంది చల్లటి గాలుల టైమ్ లో కూడా తింటారు. అయితే వేసవి మాత్రమే ఐస్ క్రీమ్ తినేందుకు బెస్ట్ టైమ్ అని ఇది శరీరాన్ని చల్లబరుస్తుందని చెప్తారు. కానీ నిజానికి శరీర ఉష్ణోగ్రతకి ఐస్ క్రీమ్ కి ఎటువంటి సంబంధం లేదనే విషయం చాలా మందికి తెలియదు. చల్లని ఐస్ క్రీమ్ నోటికి తగలగానే చలిగా అనిపిస్తుంది. అయితే ఇది తాత్కాలిక శీతలీకరణ ప్రభావాన్ని మాత్రమే అందిస్తుంది. శరీర మొత్తం ఉష్ణోగ్రతని గణనీయంగా ఎటువంటి విధంగానూ ప్రభావితం చేయదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్!


జాతీయ పురస్కార గ్రహీత ధనుష్ (Dhanush) కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'కెప్టెన్ మిల్లర్' (Captain Miller Movie). ప్రియాంకా అరుళ్ మోహన్ కథానాయిక. సత్య జ్యోతి ఫిల్మ్స్ సంస్థలో టి.జి. త్యాగరాజన్‌ సమర్పణలో సెంధిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌ నిర్మిస్తున్నారు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు ధనుష్ పుట్టిన రోజు (Dhanush Birthday). ఈ సందర్భంగా టీజర్ విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి