నాగపూర్‌లోని మొయిల్ లిమిటెడ్(మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్) వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్ ట్రైనీ, మేనేజర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 21 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిప్లొమా (మైనింగ్ అండ్‌ మైన్ సర్వేయింగ్/ సివిల్ ఇంజినీరింగ్‌), సర్వేయర్స్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ, బీఈ, బీటెక్‌ (మైనింగ్/ మెకానికల్‌) ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది.


వివరాలు..


మొత్తం ఖాళీలు: 21


➥ గ్రాడ్యుయేట్ ట్రైనీ(మైన్స్‌): 15


➥ గ్రాడ్యుయేట్ ట్రైనీ (మెకానికల్): 04


➥ మేనేజర్(సర్వే): 02 


అర్హతలు: డిప్లొమా (మైనింగ్ అండ్‌ మైన్ సర్వేయింగ్/ సివిల్ ఇంజినీరింగ్‌), సర్వేయర్స్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ, బీఈ, బీటెక్‌ (మైనింగ్/ మెకానికల్‌) ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 15.08.2023 నాటికి గ్రాడ్యుయేట్ ట్రైనీలకు 30 సంవత్సరాలు, మేనేజర్ పోస్టుకు 35 సంవత్సరాలు మించకూడదు.


దరఖాస్తు ఫీజు: రూ.590. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


జీత భత్యాలు: నెలకు రూ.50,000 – 1,60,000.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.07.2023.


➥ ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: 15.08.2023. 


Notification


Online Application


Website



ALSO READ:


తెలంగాణలో 1520 మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ పోస్టులు, అర్హతలివే!
తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి జులై 26న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1520 పోస్టులను భర్తీ చేయనున్నారు. కమిషనర్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌లో ఈ పోస్టులున్నాయి. ఈ పోస్టుల భర్తీకి ఆగస్టు 25 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది.  సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబరు 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, పని అనుభవం తదితరాల ఆధారంగా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 156 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే!
తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆయుష్‌ విభాగంలో మెడికల్ ఆఫీసర్ పోస్టుల నియామకానికి రాష్ట్ర వైద్యారోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు(ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) జులై 13న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 156 మంది ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో54 ఆయుర్వేద, 33 హోమియో, 69 యునానీ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి ఆగస్టు 7 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 22లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


ఎయిమ్స్‌ రాయ్‌బరేలీలో 111 టెక్నీషియన్/ పారా మెడికల్ స్టాఫ్ పోస్టులు, అర్హతలివే!
రాయ్‌బరేలీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్‌) కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ టెక్నీషియన్స్/ పారా మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 111 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 10+2, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా జులై 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..