Horoscope Today July 28, 2023


మేష రాశి


ఈ రాశివారు ఈ రోజు ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. లావాదేవీల విషయంలో పొరపాట్లు ఉండవచ్చు. వ్యాపారంలో నూతన ఒప్పందాలు కుదుర్చోవద్దు. ఇంటి పరిసరాల శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.  వాతావరణంలో మార్పుల వల్ల అనారోగ్య సమస్యలొస్తాయి.


వృషభ రాశి


ఈ రాశివారి ఆరోగ్యం మునుపటి కన్నా మెరుగుపడుతుంది.ఈ రాశి ఉద్యోగుల పనితీరుకి ప్రశంసలు అందుతాయి. మీ పనిలో నాణ్యత పెరుగుతుంది. ప్రమాదకర విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. కొత్త సంబంధాలు ఏర్పడతాయి.


మిథున రాశి 


ఈ రోజు ఏదో పనిపై బయటకు వెళతారు. లావాదేవీలు బాగా సాగుతాయి. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం మర్చిపోవద్దు. ఆకస్మిక ధనలాభం కలగవచ్చు. స్థిరాస్తులు పెరుగుతాయి. కొత్త పనిని ప్రారంభించడానికి రోజు మంచిది. విద్యార్థులు చదువులో చాలా శ్రద్ధ వహించాలి 


Also Read: దేశంలో ముఖ్యమైన ఈ 10 ఆలయాల్లో ప్రసాదం చాలా ప్రత్యేకం!


కర్కాటక రాశి


ఈ రాశివారు వ్యాపారంలో వస్తున్న సమస్యలను దూరం చేసే పనిలో నిమగ్నమై ఉంటారు. పని ఒత్తిడి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. కుటుంబానికి సమయం కేటాయించండి. కొత్త ఉద్యోగం ప్రారంభించడానికి ఈ రోజు చాలా మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది 


సింహ రాశి


ఈ రాశి వారు కుటుంబ సభ్యుల తప్పుడు అలవాట్ల గురించి కొంచెం ఆందోళన చెందుతారు. కళలు, సాహిత్యం పట్ల  ఆసక్తి చూపిస్తారు. ఉద్యోగంలో కొత్త అవకాశాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపిస్తారు. ఆస్తికి సంబంధించి నిలిచిపోయిన  పనులు పూర్తవుతాయి. 


కన్యా రాశి


ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలో సీనియర్ల సహాయం తీసుకోవలసి ఉంటుంది. శత్రువులు యాక్టివ్ గా ఉంటారు మీరు అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో కలసి విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఉద్యోగంలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. మీరు ఖరీదైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలి.


Also Read: వాస్తుశాస్త్రం ప్రకారం ఏ దిశలో ఏది ఉంటే బాగుంటుందో తెలుసా!


తులా రాశి 


జీవిత భాగస్వామి ప్రవర్తన ఈ రోజు మిమ్మల్ని బాధపెడుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు ఆగిపోతాయి. వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెడతారు. ఈ రాశి ఉద్యోగులు పనిపట్ల అంకితభావంతో ఉంటారు. అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. వైవాహిక సంబంధాలలో ఒత్తిడి పెరుగుతుంది.


వృశ్చిక రాశి


కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఉన్నతాధికారులు మీ పనితీరుపట్ల సంతృప్తిగా ఉంటారు.  మీ ఆత్మగౌరవం పెరుగుతుంది. విద్యార్థులు పరీక్షలో మంచి ఫలితాలు పొందుతారు. నూతన భాగస్వామ్యంతో వ్యాపారం ప్రారంభించేందుకు మంచి సమయం. 


ధనుస్సు రాశి


ఈ రోజు మీ ఖర్చులు పెరగవచ్చు. మీరు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టలేరు. మనసులో ఆందోళన ఉంటుంది. ప్రేమ సంబంధాలలో పరస్పర విశ్వాసం తగ్గుతుంది. మానసికంగా, శారీరకంగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. రక్తపోటు ఉన్న రోగులకు సమస్యలు ఉండవచ్చు 


మకర రాశి


ఈ రాశివారు పనిచేసే రంగంలో విజయం సాధిస్తారు. వ్యాపారులకు ఈ రోజు ప్రత్యేకంగా అనుకూలమైన రోజు. మీరు సామాజిక కార్యక్రమాలపై అధిక ఆసక్తిని కనబరుస్తారు. ఇంటి వాతావరణం స్నేహపూర్వకంగా ఉంటుంది. 


కుంభ రాశి


ఈ రాశివారి తమ సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి. మనసులో ఉన్న ప్రేమను వ్యక్తపరిచేందుకు ఇదే మంచి సమయం. ఈ రాశి నిరుద్యోగులు ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. అనుకున్న పనిని పూర్తిచేసేందుకు పూర్తి విశ్వాసంతో ముందుకు సాగుతారు. కార్యాలయంలో మీ స్థానం బలంగా ఉంటుంది. ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు.


మీన రాశి


ఈ రాశివారు తలపెట్టిన ముఖ్యమైన పనులకు అడ్డంకులు ఏర్పడతాయి. కొత్త ప్రాజెక్టులు చేపట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది.  తెలియని వ్యక్తులను ఎక్కువగా నమ్మవద్దు. మీరు మీ జీవిత భాగస్వామికి నిర్ణయానికి ప్రాధాన్యత ఇవ్వండి. అధిక పని కారణంగా అలసిపోతారు.