Vastu Tips: శాస్త్రం అంటే శాసించేది అని అర్థం. మన భారతీయ ప్రాచీన విద్యలలో జ్యోతిష్య శాస్త్రంతో పాటూ వాస్తు శాస్త్రం కూడా ఒకటి. వాస్తు శాస్త్రం అంటే వసతి ఇతి వాస్తుః అంటే ఇళ్లు కానీ , కార్యాలయం కానీ ఏదైనా సరే నివాసాల నిర్మాణాలలో ఏది ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలిలాంటి విధి విధానాలను నిర్ణయించేది వాస్తు శాస్త్రం. మనకు నాలుగు దిశల గురించి ప్రధానంగా తెలుసు.  కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఈ నాలుగు దిశలతో పాటు ఈశాన్యం, వాయువ్యం, ఆగ్నేయం, నైరుతిలాంటి దిక్కులను కూడా పరిగణంలోకి తీసుకుంటారు. వాటి ఆధారంగా నిర్మాణానికి అనుగుణంగా పరిగణిస్తారు. ఇందులో కొన్ని రకాల దిశలు అనుకూలంగా ఉంటాయి, మరికొన్ని ప్రతికూలంగా ఉంటాయి. ఒకవేళ ఈ దిశలకు అనుగుణంగా కార్యాలయం లేదా ఇంటి నిర్మాణం చేపట్టకపోతే వాటియొక్క ప్రతికూల ప్రభావాలు మన నిత్య జీవితంపై పడతాయి. అందుకని ఆ దిశలకు అనుగుణంగా నిర్మాణాలను చేపట్టాలి. మరి ఏ దిశలలో ఏ నిర్మాణం ఉంటో బాగుంటుందో తెలుసుకోండి


ఉత్తరం దిశ:  ఉత్తర దిశ సంపదకు సూచకం. అలాగే ఆఫీసు కార్యకలాపాలకు కూడా ఈ దిశ అనుకూలంగా ఉంటుంది. ఇక ఇంట్లో అయితే ప్రవేశ ద్వారం, పడక గది, తోట, వాకిలి, బాల్కనీలు, స్విమ్మింగ్ పూల్ లాంటి నిర్మాణాలను కూడా ఈ దిశలో నిర్మించుకుంటే బాగుంటుంది.


దక్షిణ దిశ:  దక్షిణ దిశ కీర్తి ప్రతిష్టతలను పెంచుతుంది. అందుకని ఆఫీసు కార్యాలయంలో అయితే సీఈఓ చాంబర్ ను ఈ దిశలో పెడితే బాగుంటుంది. ఇంట్లో అయితే మాస్టర్ బెడ్ రూం, లేదా ఎంటర్టైన్మెంట్ గదిలాగా పెడితే బాగుంటుంది.


Also Read: దేవుడి మందిరంలో విగ్రహాలొద్దు, బాత్రూంలో ఖాళీ బకెట్ ఉంచొద్దు-వాస్తు నిపుణులు ఇంకా ఏం చెప్పారంటే!


పశ్చిమ దిశ: ఈ పశ్చిమ దిశలో ఇంట్లో అయితే స్ఫోర్ట్స్ రూం లాగా లేదా, బెడ్ రూం లాగా, డైనింగ్ హాల్ లాగా ఉపయోగించవచ్చు. అంతేకాదు ఈ దిశలో  ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులను కూడా ఏర్పాటు చేయవచ్చు. ఇక  కార్యాలయం విషయానికొస్తే పనిచేసే ఉద్యోగస్తులకు వారివారి సీట్లకు, క్యాబిన్లకు మంచి ప్రాంతంగా ఈ పశ్చిమ దిశ చెప్పబడుతుంది. దీనివల్ల పని సక్రమంగా జరిగే అవకాశాలున్నాయి.


తూర్పు దిశ: సూర్యుడు ఉదయించేది ఈ దిక్కునే కాబట్టి, వెలుతురు బాగా వస్తుంది. అందుకని ఈ దిశలో కిటికీలు, తలుపులు, బాల్కనీలు, తోటలు ఉంటే బాగుంటుంది. అలాగే లాంజ్ ఏర్పాటు చేసుకోవాలన్నా, డ్రాయింగ్ రూం లాంటివి ఏర్పాటు చేసుకోవాలన్నా ఈ దిశలో కట్టుకుంటే బాగుంటుంది.


ఈశాన్యం దిశ: నార్త్ ఈస్ట్ దిక్కు (ఈశాన్యం) ఉన్న ప్రాంతం దైవీకానికి సంబంధించిన కార్యక్రమాలు చేయడానికి అనుకూలమైనది.అందువల్ల ఈ దిక్కున పూజమందిరం కానీ, లేదా ధ్యానమందిరం కానీ, యోగారూం లాంటివి ఏర్పాటు చేయవచ్చు. అయితే ఈశాన్య దిక్కులో బరువులు అస్సలు ఉంచరాదు. దానివల్ల ఇంట్లో, లేదా ఆఫీసులో సమస్యలు ఏర్పడతాయి.


వాయువ్య దిశ:  నార్త్ వెస్ట్ (వాయువ్యం) ప్రాంతం ప్రధానంగా గాలికి ఆనవాలం. అందుకని ఈ దిశవైపు టాయిలెట్స్, గెస్ట్ రూం, ఎలివేటర్లు, ఏసీలు లాంటివి అన్నీ ఏర్పాటు చేసుకోవచ్చు.


Also Read: గోడ గడియారం ఈ దిశగా ఉంటే నాశనమే, వాస్తు ప్రకారం ఎక్కడ ఉండాలి!


నైరుతి దిశ:  సౌత్ ఈస్ట్ ( నైరుతి) ప్రాంతం బలమైన ప్రాంతంగా చెబుతారు.  ఇంట్లో అయితే వార్డ్ రోబ్ లను ఉంచుకోవచ్చు. ఇక కార్యాలయం విషయానికి వస్తే  ఈ ప్రాంతంలో డిస్కషన్ రూంలు, లేదా సీనియర్ అధికారులకు బెడ్ రూంలు ఏర్పాటు చేయవచ్చు. సౌత్ ఈస్ట కు దక్షిణం వైపున రెస్ట్ రూం లను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.


ఆగ్నేయం దిశ:  సౌత్ ఈస్ట్ (ఆగ్నేయం) ప్రాంతం ఎక్కువగా ఇంటి యజమానుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ ప్రాంతంలో ముఖ్యంగా వంటగది ఉండడం శ్రేయస్కరం. అగ్నిదేవుడు ఈ దిశకు అధిపతి. ఇక కార్యాలయాల విషయానికి వస్తే ఆఫీసు క్యాంటీన్ కానీ, ఇన్వర్టర్ లాంటి విద్యుత్ పరికరాలను ఇక్కడ ఉంచవచ్చు. అంతేకాదు  సృజనాత్మక కార్యకలాపాలకు కూడా ఈ దిశను ఉపయోగించవచ్చు.