టీడీపీ, బీజేపీ కలిస్తే ఎవరికి లాభం?


ఏపీలో ఇప్పుడు రాజకీయ పొత్తులపై చర్చ జరుగుతోంది. ఓ ఇంగ్లిష్ టీవీ చానల్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు మోదీ విధానాలను సమర్థిస్తానని ప్రకటించారు. అయితే కలిసి పని చేస్తారా అన్న దానిపై కాలం నిర్ణయిస్తుందన్నారు. అంతే ఏపీలో మళ్లీ 2014 కూటమి ఖాయమన్న ప్రచారం ఊపందుకుంది. అయితే పొత్తుల వల్ల ఎవరికీ లాభం ఉండదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పొత్తుల వల్ల ఎవరికి ఎక్కువ లాభం అనే చర్చ  ఇప్పుడు రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. ఇంకా చదవండి 


త్వరలో 10-12 లక్షల మందితో మహారాష్ట్రలో భారీ కిసాన్‌ ర్యాలీ- KCR


మహారాష్ట్రలో జరగబోయే జెడ్పీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో ప్రతీ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. ప్రతీ గడపను తట్టండి.. ప్రతీ మనిషినీ పలకరించండని కోరారు. నాగ్‌పూర్‌, ఔరంగాబాద్‌లో బీఆర్‌ఎస్‌ శాశ్వత కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మే 7 నుంచి జూన్‌ 7 వరకు మహారాష్ట్రలోని ప్రతి గ్రామంలో బీఆర్‌ఎస్‌ కమిటీ వేస్తామన్నారు. 10 నుంచి 12లక్షల మందితో మహారాష్ట్రలో భారీ కిసాన్‌ ర్యాలీ నిర్వహిస్తామని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్‌లో మహారాష్ట్ర నుంచి వచ్చిన వివిధ పార్టీల నేతలను కేసీఆర్ పార్టీలో చేర్చుకున్నారు. వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఇంకా చదవండి


బీఆర్ఎస్ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన రాజాసింగ్ - ఎందుకంటే


ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో మంత్రి గంగుల విశేష కృషితో రాష్ట్రంలో బీసీ సంఘాలు ఏకతాటిపైకి వస్తున్న విషయం విదితమే. గతంలో 27 కుల సంఘాలు ఏక సంఘంగా ఏర్పడి వేల కోట్ల విలువైన కోకాపేట్, ఉప్పల్ భగాయత్ భూముల్లో ఆత్మగౌరభవనాలను నిర్మించుకుంటున్నాయి. నేడు ప్రభుత్వ కృషితో లోది సామాజిక వర్గం లోని అన్ని సంఘాలు ఏకతాటి పైకి వచ్చాయి ఎమ్మెల్యే రాజాసింగ్, కార్పొరేటర్ పరమేశ్వరి ఇతర లోది సామాజిక వర్గ నేతలంతా ఏకసంఘంగా ముందుకు వచ్చి ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించుకోవడం సంతోషంగా ఉందన్నారు మంత్రి గంగుల. ఉప్పల్ బాగాయత్లో లోదా/లోది సామాజిక వర్గ ఆత్మగౌరవ భవనానికి 20 గుంటల తో పాటు 50 లక్షలు కేటాయించామన్నారు. ఇంకా చదవండి 


నా ఇంటిపై జగన్ స్టిక్కర్ వేస్తే తాట తీస్తా - చంద్రబాబు


రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ఒకవైపు.. సైకో మరొక వైపు ఉన్నారని, ఆ సైకోను ఓడించడానికి అందరూ కలిసి రావాలంటూ ఏపీ సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. ఇల్లు నీది... దానిపై స్టిక్కర్ జగన్ ది. పొలం మీది పాస్ పుస్తకంపై ఫోటో జగన్ ది. మీ ఇంటిపై స్టిక్కర్ వేస్తే దానిపై 6093 అని నెంబర్ రాయాలని ఏపీ ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. ఎవరైనా నా ఇంటిపై జగన్ స్టిక్కర్ వేస్తే తాట తీస్తా అని హెచ్చరించారు. పి4 అనే కొత్త పథకం నిన్నే ఇచ్చా అన్నారు. ప్రభుత్వం, ప్రవేటు వ్యక్తులు, ప్రజలు పార్టనర్ షిప్ తో కలిసి పని చేస్తే పేదరికమే ఉండదు అని అభిప్రాయపడ్డారు. ఇంకా చదవండి


భాగ్యనగర కీర్తికిరీటంలో మరో కలికితురాయిగా సచివాలయం!


ఈనెల 30న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానున్న డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీసు అధికారులు, R&B అధికారులతో కలిసి సభ ప్రాంగణం, పార్కింగ్ ఏరియా తదితర ఏర్పాట్ల పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆయా శాఖల ఉద్యోగుల సీటింగ్, వారికి కేటాయించిన పార్కింగ్, తదితర ఏర్పాట్లపై ఈ మంత్రి చర్చించారు. సెక్రటేరియట్ లైటింగ్, సుందరీకరణ పనులపై ప్రధానంగా దృష్టి సారించాలని అధికారులను మంత్రి అదేశించారు. ప్రధాన భవనం ఇరువైపులా గ్రీనరీ లాన్స్, వాటర్ ఫౌంటెయిన్స్ చూపరులను ఆకట్టుకునే ఆహ్లాదకరమైన పూలమొక్కలు నాటే పనులను వెంటనే పూర్తి చేయాలని మంత్రి వేముల అదేశించారు. అధికారులు, పోలీసుల సమన్వయంతో సచివాలయ ప్రారంభోత్సవ వేడుక అట్టహాసంగా జరిగేలా చూడాలని సూచించారు. ఇంకా చదవండి


మార్గదర్శిపై చంద్రబాబు, రామోజీలతో చర్చకు సిద్ధం: ఉండవల్లి


మార్గదర్శి వ్యవహారంపై చర్చకు వస్తున్నట్లు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ప్రకటించడం పట్ల మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సుముఖత వ్యక్తం చేశారు. తాను కూడా చర్చకు సిద్ధమని ప్రకటించారు. అయితే చర్చ రామోజీరావు సమక్షంలో జరిగితే బాగుంటుందన్నారు. రాజమండ్రిలో బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎప్పటినుంచో చర్చకు రావాలని కోరుతున్న సమయంలో టీడీపీ నుంచి అధికార ప్రతినిధి జీవీ రెడ్డి చర్చకు వస్తాననడం శుభ పరిణామమన్నారు.

హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో కంటే రామోజీరావు సమక్షంలోనే రామోజీ ఫిలిం సిటీలో చర్చ జరిగేలా చూడాలని ఉండవల్లి సూచించారు. లేని పక్షంలో హైదరాబాద్ టీడీపీ కార్యాలయంలోనైనా సరే పెడితే బాగుటుందని సూచించారు. ఇంకా చదవండి

నేడు ఈ జిల్లాల్లో గాలిదుమారం! వర్షాలు కూడా


ఈ రోజు ద్రోణి / గాలిలోని అనిచ్చితి  పశ్చిమ విదర్బ  లోని ఆవర్తనం నుండి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుండి 1.5 కి మీ ఎత్తు వరకు స్థిరంగా కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దిగువ స్థాయిలోని గాలులు దక్షిణ/ఆగ్నేయ దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయి. ఇంకా చదవండి


కేజీఎఫ్‌లో జీ..ఎఫ్‌.. ఫెయిల్‌! కేకేఆర్‌ చేతిలో 21 రన్స్‌తో ఆర్సీబీ ఓటమి!


రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు వరుస విజయాలకు తెరపడింది! చిన్నస్వామి స్టేడియంలో కోహ్లీ సేన 21 రన్స్‌ తేడాతో ఓటమి చవిచూసింది. కోల్‌కతా చేతిలో రెండోసారీ భంగపడింది. 201 రన్‌ ఛేజ్‌లో ఆర్సీబీ 179/8కి పరిమితమైంది. విరాట్‌ కోహ్లీ (54; 37 బంతుల్లో 6x4) ఒక్కడే పోరాడాడు. మహిపాల్‌ లోమ్రర్‌ (34; 18 బంతుల్లో 1x4, 3x6) అతడికి తోడుగా నిలిచాడు. అంతకు ముందు కేకేఆర్‌లో ఓపెనర్‌ జేసన్ రాయ్‌ (56; 29 బంతుల్లో 4x4, 5x6) డిస్ట్రక్టివ్‌ ఓపెనింగ్‌ ఇచ్చాడు. వరుసగా రెండో హాఫ్‌ సెంచరీ కొట్టేశాడు. కెప్టెన్‌ నితీశ్‌ రాణా (48; 21 బంతుల్లో 3x4, 4x6), వెంకటేశ్‌ అయ్యర్‌ (31; 26 బంతుల్లో 3x4) చక్కని ఇన్నింగ్సులతో మెరిశారు. ఇంకా చదవండి


'సేవ్ ద టైగర్స్' రివ్యూ : భార్యల నుంచి భర్తలను కాపాడుకోక తప్పదా


ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ హీరోలుగా... 'జోర్దార్' సుజాత, పావనీ గంగిరెడ్డి, దేవయాని శర్మ హీరోయిన్లుగా రూపొందిన వెబ్ సిరీస్ 'సేవ్ ద టైగర్స్'. అంతరించిపోతున్న పులుల్ని, మొగుళ్ళని కాపాడుకుందాం... అనేది ఉపశీర్షిక. మహి వి రాఘవ్ షో క్రియేటర్, నిర్మాతగా రూపొందిన సిరీస్ ఇది. ఆల్రెడీ విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరి, సిరీస్ ఎలా ఉంది? (Save The Tigers web series review in Telugu) అంటే... ఇంకా చదవండి 


24 గంటల్లో బిట్‌కాయిన్‌ రూ.1.10 లక్షలు జంప్‌!


క్రిప్టో మార్కెట్లు బుధవారం జోష్‌లో కనిపిస్తున్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 5.22 శాతం పెరిగి రూ.23.56 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.45.60 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్‌ తర్వాత అతిపెద్ద మార్కెట్‌ విలువ కలిగిన ఎథీరియమ్‌ (Ethereum) గత 24 గంటల్లో 4.07 శాతం పెరిగి రూ.1,54,932 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్‌ విలువ రూ.18.65 లక్షల కోట్లుగా ఉంది. ఇంకా చదవండి