Top 10 Headlines Today:
ఓట్ల పంచాయితీ
ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాను ఇష్టారీతిన మార్చేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. స్వయంగా సీఈవో కూడా ఇది నిజమేనని కరెక్ట్ చేస్తామని అంగీకరించాల్సి వచ్చింది. తర్వాత సీఈవోను.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పిలిచి క్లాస్ తీసుకున్నారన్న ప్రచారమూ జరుగుతోంది. అసలు ఏపీలో ఓటర్ల జాబితాను అంత సులువుగా మార్చేయవచ్చా ? వాలంటీర్ల ఓట్లను కలపడం.. తీసేయడానికి అధికారం కలిగి ఉన్నారా? ఏపీ ఓటర్ల జాబితాలో అసలేం జరుగుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ముందంజలో కేసీఆర్
తెలంగాణ రాజకీయాలు ఏ క్షణమైనా ఎన్నికలు అన్నట్లుగా మారిపోతున్నాయి. నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనుండటంతో అన్ని పార్టీలు సన్నద్ధత పూర్తి చేసుకుని ప్రజల్లోకి వెళ్లాలనుకుంటున్నాయి. ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ముందంజలో ఉన్నారు. మూడో సారి గెలిచి ఎట్టి పరిస్థితుల్లోనూ హ్యాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో ఉన్న కేసీఆర్ ఎన్నికలకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆగస్టు కల్లా… అభ్యర్థుల్ని ప్రకటించి ఇక ప్రచార బరిలోకి దిగాలని అనుకుంటున్నారు. ఇందు కోసం అవసరమైన కసరత్తును ఫామ్ హౌస్ వేదికగా పూర్తి చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం… రాష్ట్రంలో పాతుకుపోయిన అధికారుల బదిలీలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ప్రతీ రోజూ బదిలీల ఉత్తర్వులు వస్తున్నాయి. డీఎస్పీలు.. సీఐలు… అలాగే ఎన్నికల విధుల్లో భాగమయ్యే ఇతరుల పోస్టింగ్‌లను కేసీఆర్ స్వయంగా పరిశీలించి ఓకే చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
వర్షాకాలం సెలవులు
రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో రెండు రోజులు విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ఇవాళ, రేపు ( బుధ, గురు వారాలు) రెండు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అందుకు సంబంధించి తక్షణమే ఉత్వర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
గెస్ట్‌రోల్ కాదు బ్రో
'బ్రో' (Bro The Avatar Movie) కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) 21 రోజులు మాత్రమే షూటింగ్ చేశారు. ఇది ఎవరో చెప్పింది కాదు, ప్రీ రిలీజ్ వేడుక (Bro Movie Pre Release Event)లో ఆయన నోటి వెంట వచ్చిన మాటే. ఇంతకు ముందు కూడా 'బ్రో' సినిమా షూటింగ్ డేస్, రెమ్యూనరేషన్ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అందువల్ల, సినిమాలో ఆయన కొంత సేపు మాత్రమే కనపడతారని, అతిథి పాత్రల కంటే కాస్తంత ఎక్కువ నిడివి ఉంటుందని భావించారంతా! ఆ రకమైన ఊహాగానాలకు పవన్ కళ్యాణ్ చెక్ పెట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
మీరు మారండి- పాన్ ఇండియా సినిమాలు తీయండి
''మన పరిశ్రమ (సినిమాల్లో) లో, మనవాళ్ళు మాత్రమే చేయాలనే ఆలోచనా ధోరణి నుంచి మీరు బయటకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అని తమిళ చిత్ర పరిశ్రమకు, అందులోని పెద్దలకు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విజ్ఞప్తి చేశారు. 'బ్రో' సినిమా ప్రీ రిలీజ్ వేడుక (Bro Movie Pre Release Event)లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఈ విధంగా మాట్లాడటం వెనుక ఓ కారణం ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
బ్రో వేడుకలకు పొలిటికల్ టచ్
సినిమాను సినిమాగా చూద్దామని, రాజకీయాలను అక్కడ వదిలేద్దామని 'బ్రో' ప్రీ రిలీజ్ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులకు చెప్పారు. అయితే... ఇప్పుడు ఆయన్ను, జనసేన పార్టీ (Janasena Party)ని వేరు వేరుగా చూడలేని పరిస్థితులు కనపడుతున్నాయి. 'బ్రో' ప్రీ రిలీజ్ వేడుక (Bro Pre Release Event)కు వచ్చిన అతిథుల నోటి వెంట రాజకీయాల ప్రస్తావన వచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
2023-24 సీజన్‌లో స్వదేశంలో ఆడే మ్యాచ్‌ల షెడ్యూల్
ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు.. 2023-24 సీజన్‌కు గాను స్వదేశంలో ఆడబోయే మ్యాచ్‌ల పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ - నవంబర్‌లో వన్డే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఈ మెగా టోర్నీకి ముందు ఆ తర్వాత వచ్చే సిరీస్‌ల షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి వచ్చే ఏడాది వరకూ భారత జట్టు స్వదేశంలో ఐదు టెస్టులు, 3 వన్డేలు, 8 టీ20లు ఆడనుంది. ఈ మేరకు బీసీసీఐ.. షెడ్యూల్‌తో పాటు వేదికలు, టైమింగ్స్‌ను కూడా విడుదల చేసింది. కాగా ఈ సీజన్‌లో హైదరాబాద్ కూడా రెండు కీలక మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనుంది. ఆస్ట్రేలియాతో టీ20 మ్యాచ్, ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు ఇక్కడే జరుగనుంది. వైజాగ్‌లో కూడా ఒక టీ20, ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు జరుగనుండటం తెలుగు క్రికెట్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేదే. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
కేంద్రంపై అవిశ్వాస తీర్మానం
జూలై 20న ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాగా, మణిపూర్‌లో చెలరేగిన జాతి హింసపై పార్లమెంట్ అట్టుడుకుతోంది. కొందరు సభ్యులతో ఉన్న గుంపు ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ అంశంపై పార్లమెంట్ లో చర్చ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంతో మొదటి రోజు నుంచి లోక్ సభ, రాజ్యసభలో సమావేశం ప్రారంభం అయిన కొంత సమయానికే మరుసటి రోజుకు వాయిదా పడుతూ వస్తున్నాయి. ప్రధాని మోదీ ప్రకటన చేయకపోవడంతో ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు బుధవారం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
వదలని వాన
ఈ తీవ్ర అల్పపీడనం సుమారుగా రాగల 24 గంటలలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఈ వాయుగుండం నెమ్మదిగా వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర ఆంధ్రప్రదేశ్- దక్షిణ ఒడిశా తీరాలను చేరుకునే అవకాశం ఉంది. రుతుపవన ద్రోణి ఈ రోజు జైసల్మేర్, కోట, గుణ, రాయ్‌పూర్, భవానీపట్నం, పశ్చిమ మధ్య, ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తర ఆంధ్రప్రదేశ్-దక్షిణ ఒడిశా తీరాల మీదుగా ఉన్న అల్పపీడన ప్రాంత కేంద్రం గుండా వెళుతుంది. అక్కడి నుండి తూర్పు-ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది.’’ అని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు సోమవారం (జూలై 25) ఓ ప్రకటనలో వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
కండ్లకలక కేసుల ఆందోళన
మన దేశంలో కండ్లకలక కేసులు అధికంగా పెరుగుతున్నాయి. పూణేలో ఒక్కరోజులోనే 2,300 కండ్లకలక కేసులు నమోదయ్యాయి. ఇక ఢిల్లీలో గత ఏడాదితో పోలిస్తే మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఎడతెగని వర్షాలు, తేమతో కూడిన వాతావరణం, కలుషిత నీరు... ఇవన్నీ కూడా బ్యాక్టీరియల్ వ్యాప్తి చెందేందుకు అనువైన పరిస్థితులను కల్పించాయి. వీటి వల్లే కంటి ఇన్ఫెక్షన్లు పెరిగిపోతున్నాయి. కంటి కలకను... ఐ ఫ్లూ లేదా పింక్ ఐ అని పిలుస్తారు. ఈ సమస్య వస్తే కళ్ళు ఎరుపుగా మారిపోతాయి. దురద కూడా పెడతాయి. తెల్లని పదార్థాన్ని స్రవిస్తాయి. కంటి నుంచి నీరు కారుతూ ఉంటుంది. కంటి రెప్పలు ఉబ్బిపోయే అవకాశం ఉంది. ఇది ఒక కంటికి వచ్చి రెండో కంటికి కూడా సోకవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి