Morning Top News:
ఏపీకి రూ.446 కోట్లను విడుదల చేసిన కేంద్రం
ఏపీకి 15వ ఆర్థిక సంఘం గ్రాంటును కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. రూ.446 కోట్లు కేంద్రం విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గాను రెండో వాయిదా కింద రూ.421 కోట్లతో పాటు, తొలి వాయిదా కింద పెండింగ్ లో ఉన్న రూ.25 కోట్లను సైతం కేంద్రం అందించింది. 13,097 గ్రామ పంచాయతీలకు, 650 బ్లాక్ పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన ఈ గ్రాంట్ నిధులు కేటాయించనున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మణిపూర్ పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
మణిపూర్‌లో ఖనిజ సంపద కోసమే అంతర్యుద్ధం జరుగుతోందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భారత సైన్యం తలచుకుంటే క్షణాల్లో కంట్రోల్ అవుతుందని అభిప్రాయపడ్డారు. రవీంద్రభారతిలో పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారు. 2014 తరువాత దాదాపు 2వేల నుంచి 4వేల చదరపు కిలోమీటర్ల భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమించిందని రేవంత్ ఆరోపించారు. దీనిపై చర్చ చేసేందుకు కేంద్ర పాలకులకు ధైర్యం లేదని కామెంట్ చేశారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ఇకపై అన్ని రాష్ట్ర రాజధానుల్లో వెంకటేశ్వరుని ఆలయాలు
మంగళవారం సమావేశమైన టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. అన్ని రాష్ట్రాల రాజధానుల్లో స్వామి ఆలయాల ఏర్పాటు, భక్తుల ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు చర్యలు చేపట్టింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో సమావేశమైన టీటీడీ మండలి మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
చెప్పులు లేకుండా నడిచి, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన విద్యార్థులు
జోగులాంబ గద్వాల జిల్లాలోని గురుకుల పాఠశాల విద్యార్ధులు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లేందుకు వినూత్న ప్రయత్నం చేశారు. ఒకటి, రెండు కాదు ఏకంగా 18 కిలోమీటర్లు చెప్పులు కూడా లేకుండా పాదయాత్ర చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కలెక్టర్ సంతోష్‌ను కలిసిన విద్యార్థులు బీచుపల్లిలోని ప్రభుత్వ బాలుర గురుకుల ప్రిన్సిపల్ శ్రీనివాస్, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
కొత్త నినాదంతో దూసుకుపోయే ప్రయత్నంలో వైసీపీ
పులివెందులలో పర్యటించిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి 2027లోనే ఎన్నికలు వస్తాయని పునరుద్ఘాటించారు. దీన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారు.షాక్‌లో ఉన్న కేడర్‌ను, పక్క పార్టీల వైపు చూస్తున్న లీడర్‌ను తమతో ఉంచుకునేందుకు ఎన్నికల పాట అందుకుంది. జమిలీ ఎన్నికలు 2027లోనే వస్తాయని అప్పటి కూటమిపై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంటుందని నూరి పోస్తోంది. దీన్నే జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ఏపీ ఫైబర్ నెట్‌లో 410 మందిపై వేటు
ఏపీ ఫైబర్ నెట్ నుంచి జీతాలు తీసుకుని వైసీపీ నేతల ఇళ్లల్లో పనులు చేసిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించారు. దాదాపుగా 410 మంది ఉద్యోగుల్ని తొలగించినట్లుగా ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి ప్రకటించారు. వీరంతా విద్యార్హతలు లేకపోయినా ఫైబర్ నెట్ లో చేయగలిగిన పనులు లేకపోయినప్పటికీ నియమించారని జీవీరెడ్డి తెలిపారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు మిజోరం గవర్నర్‌గా విధులు నిర్వహించిన కంభంపాటి హరిబాబును ఒడిశా గవర్నర్‌గా నియమించారు. త్వరలోనే ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్ తన పదవికి రాజీనామా చేశారు. రఘుబర్ దాస్ గవర్నర్ పదవికి రాజీనామా చేయగాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఆయన స్థానంలో హరిబాబును నియమించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
కానిస్టేబుల్‌గా ఇంట్లో నోట్ల కట్టలు, ఎంతంటే
ఓ సాదాసీదా కానిస్టేబుల్ గా చేసిన వ్యక్తి కోట్లు కూడబెట్టాడు. దొరికిపోతే మొత్తం పోతుందని వీఆర్ఎస్ తీసుకున్నాడు. కానీ కాలం కలసి రాలేదు. ఆయనపై వచ్చిన ఫిర్యాదులతో లోకాయుక్త పోలీసులు దాడి చేశారు. ఇంట్లో సుమారు రూ. పది కోట్ల వరకూ ఉన్న సంపదను గుర్తించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి....
అభిమాని ఆస్పత్రి బిల్స్ క్లియర్ చేసిన తారక్
దేవర’ విడుదలకు ముందు క్యాన్సర్‌తో బాధపడుతున్న కౌశిక్ అనే అభిమానికి సాయం చేస్తానని చెప్పిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, చేయలేదంటూ ఆమె తల్లి మీడియా ముందుకు రాగా.. ఎన్టీఆర్ టీమ్ వెంటనే రంగంలోకి దిగింది. ఎన్టీఆర్ బిల్ పే చేసినట్లుగా సోషల్ మీడియాలో హాస్పిటల్‌కు చెందిన రిసిప్ట్ ఒకటి బాగా వైరల్ అవుతోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
యూకే లో పెరుగుతున్న షరియా కోర్టులు
యునైటెడ్ కింగ్ డమ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ముస్లింలు కనిపిస్తున్నారు. అంతే కాదు వారు షరియా కోర్టులు కూడా నడుపుతున్నారు. దీంతో యూకే పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది.షరియా చట్టాన్ని అమలు చేసే కోర్టులు యూకే లో ఏకంగా 85 ఉన్నట్లుగా తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఇస్లామిక్ రూలింగ్‌కు యూకే వెస్ట్రన్ క్యాపిటల్ మారుతుదని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..