Hundreds of employees were fired from AP Fiber Net: ఏపీ ఫైబర్ నెట్ నుంచి జీతాలు తీసుకుని వైసీపీ నేతల ఇళ్లల్లో పనులు చేసిన 
వారిని ఉద్యోగాల నుంచి తొలగించారు. దాదాపుగా 410 మంది ఉద్యోగుల్ని తొలగించినట్లుగా ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి ప్రకటించారు. వీరంతా విద్యార్హతలు లేకపోయినా ఫైబర్ నెట్ లో చేయగలిగిన పనులు లేకపోయినప్పటికీ నియమించారని జీవీరెడ్డి తెలిపారు. కక్ష సాధింపుల కోసం వీరిని తీసేయలేదన్నారు. ఫైబర్ నెట్ పేరుతో అప్పులు తెచ్చి  ఇలా అవసరం లేకపోయినా ఉద్యోగుల్ని నియమించి.. ఇతర ఖర్చులు చేసి దివాలా స్థితికి తెచ్చారని మండిపడ్డారు. రామ్ గోపాల్ వర్మరు రూ. కోటి పదిహేను లక్షలు చెల్లించారన్నారు. ఇంకా పనులు లేకుండా ఉన్న వారు రెండు వందల మందికిపైగా ఉన్నారని వారిని కూడా త్వరలో తీసేస్తామన్నారు.                  


Also Read:  అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?


సంస్థలో అన్ని కేడర్లతో కలిపి 1,299 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అందులో శాశ్వత సిబ్బంది ముగ్గురే. మిగిలినవారంతా సిఫార్సులతో వచ్చినవారేనన్న ఆరోపణలు ఉన్నాయి. పార్టీ కోసం పనిచేసేవారికి ఉపాధి కల్పించేలా, ఫీల్డ్ సిబ్బంది జాబితాలో వారి పేర్లను చేర్చి సంస్థ నుంచి జీతాలు చెల్లించారని జీవీ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.  ఎన్నికలకు కొద్దిరోజుల ముందు కూడా జిల్లా కేంద్రాల్లో ఉన్న ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ కార్యాలయాల్లో 110 మంది ఫీల్డ్ సిబ్బందిని గత సర్కార్ నియమించింది. ఇలాంటి వారికి వందల కోట్ల జీతాలు అక్రమంగా చెల్లించారన్న ఆరోపణలు ఉన్నాయి.                      


అవినీతికి  పాల్పడ్డారని గత ఆగస్టులోనే ఫైబర్ నెట్ ఎండీగా చేసిన మధుసూదన రెడ్డిని సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ఆయన రైల్వే శాఖ నుంచి డిప్యూటేషన్ పై వచ్చారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని మధుసూదన్ రెడ్డి మీద అభియోగాలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్దంగా ప్రైవేట్ వ్యక్తులను ఉద్యోగుల నియామకం చేశారని ఆరోపణలు వస్తున్నాయి. మధుసూదన్ రెడ్డి రికార్డులను ట్యాంపర్ చేసినట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయి.   రైల్వే అకౌంట్స్ సర్వీసు నుంచి 2019 ఆగస్టు 26 తేదీన రాష్ట్రానికి మధుసూదన్ రెడ్డి డిప్యూటేషన్ పై వచ్చారు.



Also Read: Kakinada Port Case: కాకినాడ పోర్టు వ్యవహారంలో ఈడీ, సీఐడీ దూకుడు, వారికి మరోసారి నోటీసులు జారీ