Olympics In India: క్రీడల్లో ఒలింపిక్స్ ఉన్న క్రేజ్ సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు ఈ టోర్నీని ఒక్కసారైనా నిర్వహించాలని కలలు కంటుంటాయి. ఇప్పటికే దాదాపు అగ్రదేశాలన్నీ ఈ టోర్నీని నిర్వహించి, సత్తా చాటాయి. చైనా, బ్రెజిల్ కూడా ఈ టోర్నీని నిర్వహించిన తమ శక్తియుక్తుల్ని ప్రపంచానికి చాటాయి. బిలియన్ డాలర్లలో అయ్యే ఈ నిర్వహణ ఖర్చును భరించడం చాలా కష్టమే. గ్రీస్ లాంటి దేశాలు దీన్ని నిర్వహించి దివాళా కూడా తీశాయి. అయినప్పటికీ ఒలింపిక్స్ ను నిర్వహించడంలో ఉన్న మజాను దక్కించుకునేందుకు వివిధ దేశాలు ఎప్పటికప్పుడు పోటీపడుతుంటాయి. తాజాగా భారత్ కూడా ఈ ఒలింపిక్స్ పోటీలను నిర్వహించాలని పావులు కదుపుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2036 ఒలింపిక్స్ కు భారత్ వేదికయ్యే అవకాశముంది.


లెటర్ సమర్పణ..
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)కి ఇప్పటికే భారత ఒలింపిక్ అసోసియేషన్ క్రీడల నిర్వహణ సానుకూలతను వివరిస్తూ ఒక లేఖను సమర్పించింది. అయితే అందులో ఏ నగరంలో క్రీడలను నిర్వహిస్తామనేది చెప్పకపోయినా, ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీని గురించి చెప్పేశారు. గుజరాత్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మెగాటోర్నీని నిర్వహించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. దీనిపై అధికారులకు సూచనలు, సలహాలు కూడా ఇచ్చారు. దీంతో మెగాటోర్నీకి సన్నాహకంగా వివిధ రకాల క్రీడాంశాల్లో, వివిధ టోర్నీలను నిర్వహించాలని ఈ స్టేడియంలో నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. మొట్టమొదటగా 2028 అండర్-20 ప్రపంచ చాంపియన్ షిప్ నిర్వహించి సత్తాచాటాలని భావిస్తున్నారు. ఆ తర్వాత 2029 పోలీస్ చాంపియన్ షిప్, అలాగే వివిధ రకాల క్రీడలను నిర్వహించాలని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా వివిధ చాంపియన్ షిప్ లకు సంబంధించి, ఖాళీలు ఏవైనా ఉంటే, అప్లై చేసి నిర్వహణ హక్కుల్ని దక్కించుకోవాలని కేంద్రం సూచించింది. 


 Also Read: Look Back 2024: ఫుట్ బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రి వీడ్కోలు.. భారత ఫుట్ బాల్ కు తీరని లోటు.. తన రికార్డులు అనన్య సామన్యం


మౌలిక వసతుల కల్పన..
మరోవైపు పోలీస్ చాంపియన్ షిప్ పోటీలకు సంబంధించి నిర్వాహకులు ఇటీవలే అహ్మదాబాద్ నగరంతోపాటు స్టేడియాన్ని పరిశీలించి, కొన్ని సలహాలు ఇచ్చారు. గుజరాత్ లో మధ్యపాన నిషేధం అమల్లో ఉన్నందున, కొన్ని సడలింపులు ఇవ్వాలని సూచించారు. అలాగే ప్రపంచంలోని పేరేన్నికలగల హోటళ్ల బ్రాంచిలు నగరంలో ఏర్పాటు చేస్తే వసతికి వచ్చిన ఇబ్బందేమీ ఉండదని తెలుస్తోంది. ఇక గుజరాత్ లోని కొన్ని వాతావరణ పరిస్థితులపైన కేంద్రం ఆలోచిస్తోంది. భారీ వర్షాలు, హ్యుమిడిటీ, కొన్ని సందర్బాల్లో 30 డిగ్రీలకు మించిన ఎండ అనేది ఒలింపిక్స్ నిర్వహించే జూలై-ఆగస్టు మాసాల్లో ఉంటుంది, కాబట్టి, తేదిలను అనుకూలంగా ఉండే అక్టోబర్ మాసానికి షిప్ట్ చేసే విధంగా ప్రణాలికలు రచించమని అధికారులకు కేంద్రం ఆదేశించింది. ఇక 2036 ఒలింపిక్స్ కు సంబంధించి ఇప్పటికే పోటీ బాగా ఉంది. ఖతార్, సౌదీ అరేబియా, టర్కీ, ఇండోనేషియా ఇప్పటికే రేసులో ఉండగా, తాజాగా సౌతాఫ్రికా కూడా పోటీలోకి వచ్చింది. క్రీడల నిర్వహణపై 2026,2027 ప్రథమార్థంలో ఐఓసీ నిర్ణయం తీసుకునే అవకాశముంది. 


 Also Read: Rudrankksh Patil World Record: శెభాష్ రుద్రాంక్ష్ పాటిల్- షూటింగ్ లో ప్రపంచ రికార్డు.. సీనియర్ విభాగంలో మెరిసిన తెలంగాణ షూటర్