Morning Top News:


మత్తు పదార్థాల తనిఖీకి నార్కోటిక్ జాగిలాలు


మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చేందుకు నిర్మల్ జిల్లా పోలీసులు వినూత్న ప్రయత్నం చేపట్టారు. గంజాయి డ్రగ్స్ ఇతర మాదకద్రవ్యాల నిర్మూలన కోసం జాగిలాలతో తనిఖీలు చేపడుతున్నారు. మాదకద్రవ్య రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తామన్నారు జిల్లా ఎస్పీ జానకి షర్మిల. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


బీజేపీ స్టార్ క్యాంపెయినర్ లు  పవన్, చంద్రబాబు


మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ సాధించిన సంచలన విజయానికి కారణం ఎన్డీఏ నేతల ప్రచారం.  మహారాష్ట్రతో సంంబధం లేకపోయినప్పటికీ పవన్ కల్యాణ్ లాంటి ఎన్డీఏ నేతలు ప్రచారం చేశారు.చంద్రబాబు రెండు రోజుల ప్రచారం ఆయన సోదరుడి మరణం కారణంగా రద్దు అయింది. కానీ ప్రచారానికి మాత్రం సిద్దమయ్యారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


కొడంగల్ ఫార్మాసిటీపై రేవంత్ స్పష్టత

కొడంగల్ లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదని తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కొడంగల్ నియోజకవర్గంలో యువత, మహిళలకు ఉపాధి కల్పించడమే తన ఉద్దేశమని చెప్పారు. కొడంగల్ ఎమ్మెల్యే గా నియోజకవర్గ అభివృద్ధి తన బాధ్యత అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సొంత నియోజకవర్గ ప్రజలను నేనెందుకు ఇబ్బంది పెడతా అన్నారు. కాలుష్యరహిత పరిశ్రమలే ఏర్పాటు చేస్తామని తెలిపారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 


పండుగలా ప్రజా పాలన విజయోత్సవాలు

ప్రజా పాలన ప్రతిష్ట రాష్ట్రమంతటా ప్రతిబింబించేలా, ఇందిరమ్మ సంక్షేమ ఫలాలు ప్రజలందరికీ దక్కుతాయని హామీ ఇచ్చేలా ప్రజా పాలన విజయోత్సవాలు ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 9 వరకు పండుగలా వేడుకలు నిర్వహించాలని చెప్పారు. ఊరూరా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టాలని రేవంత్ సూచించారు. అన్ని వర్గాల ప్రజలను ఈ వేడుకల్లో భాగస్వాములను చేయాలని స్పష్టం చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


వక్ఫ్ చట్టం పై మోదీ వాఖ్యలు 


మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఎన్డీయే విజయంపై మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగంలో వక్ఫ్ చట్టం, వక్ఫ్ బోర్డు లాంటివి రాజ్యాంగంలో లేవన్నారు. కానీ ఒక వర్గాన్ని సంతృప్తి పరిచేందుకు కాంగ్రెస్ పార్టీ వక్ఫ్ చట్టాన్ని తీసుకొచ్చిందని   కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


ప్రియాంక గాంధీ అరంగేట్రం అదిరింది

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అరంగేట్రం అదిరింది. వయనాడ్‌ లోక్‌సభ స్థానానికి నిర్వహించిన ఉప ఎన్నికల్లో 3.94 లక్షల ఓట్ల మెజార్టీతో విజయదుందుబి మోగించారు. గత ఎన్నికల్లో వయనాడ్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీకి 3.64 లక్షల ఓట్ల మెజార్టీ రాగా.. ఆ రికార్డును బద్దలు కొట్టారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన ప్రియాంక గాంధీ ఘనవిజయం సాధించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 


అసలైన శివసేన, ఎన్సీపీ ఏవో తేల్చేసిన ఓటర్లు

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో అక్కడి ప్రజలు ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేయాలో మాత్రమే కాదు..రెండు పార్టీల్లో అసలైన పార్టీ ఏదో కూడా తేల్చేశారు. ఆ రెండు పార్టీలు ఎన్సీపీ, శివసేన. ఈ రెండు పార్టీలు చీలిపోయి.. రెండు వర్గాలు మారి.. కాంగ్రెస్, బీజేపీల్లో ఉన్నాయి. దీంతో ఈ రెండు పార్టీల్లో ఏవి అసలైనవో ప్రజలు.. ఓట్ల ద్వారా తేల్చేశారు. అసలైన పార్టీలుగా ఈసీ గుర్తింపు నిచ్చిన అజిత్ పవార్ ఎన్సీపీ, శిందే శివసేనలను గుర్తించారు.  పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


 

నవంబర్ 26న కొలువుదీరనున్న మహారాష్ట్ర ప్రభుత్వం

మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి తిరుగులేని విజయం సాధించింది. దీంతో ప్రభుత్వం ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది. ఆదివారం మహాయుతి శాసనసభా పక్షం సమావేశం కానుంది. ఆ సమావేశంలో శాసనసభా పక్ష నేతలను ఎన్నుకుంటారు. అనంతర ఆయనతో నవంబర్ 26వ తేదీన ప్రమాణం చేయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంటే మంగళవారం నాడు మహారాష్ట్ర కొత్త ప్రభుత్వం కొలువదీరబోతోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


 

నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ మెగా వేలం 2025 సమయం ఆసన్నమైంది. ఈరోజు  మధ్యాహ్నం 3.30 గంటలకు మెగా వేలం ప్రారంభం కానుంది. ఈ 25న సైతం వేలం జరగనుంది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో రెండు రోజులపాటు ఐపీఎల్ మెగా ఆక్షన్ నిర్వహించనున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

బుమ్రా బౌలింగ్‌పై ఆస్ట్రేలియన్ల చెకింగ్ ఆరోపణలు


నిప్పులు చెరిగే బుమ్రా  బౌలింగ్ ను ఎదుర్కోలేక.. కంగారులు కొత్త పల్లవి అందుకున్నారు. బుమ్రా చెక్ చేస్తున్నాడని.. చౌకబారు విమర్శలకు దిగారు. సోషల్ మీడియా వేదికగా ఆస్ట్రేలియా అభిమానులు బుమ్రా బౌలింగ్.. ఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా ఉందని విషం చిమ్మారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..