India vs Australia Highlights, Border Gavaskar Trophy: ఆడలేక మద్దెల దరువు అన్నట్లు ఉంది.. ఆస్ట్రేలియన్(Australia) జట్టు పరిస్థితి. నిప్పులు చెరిగే బుమ్రా(Jasprit Bumrah) బౌలింగ్ ను ఎదుర్కోలేక.. కంగారులు కొత్త పల్లవి అందుకున్నారు. బుమ్రా చెక్ చేస్తున్నాడని.. చౌకబారు విమర్శలకు దిగారు. సోషల్ మీడియా వేదికగా ఆస్ట్రేలియా అభిమానులు బుమ్రా బౌలింగ్.. ఐసీసీ(icc) నిబంధనలకు విరుద్ధంగా ఉందని విషం చిమ్మారు. దీనిపై భారత అభిమానులు భగ్గుమంటున్నారు. బుమ్రాను చూస్తే కంగారులు వణికిపోతున్నారని కామెంట్లు చేస్తున్నారు.  




 

ఇంతకీ ఏమిటీ ఆరోపణలు..

పెర్త్‌(Perth Test)  లో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియాను బుమ్రా తన బౌలింగ్ తో ముప్పు తిప్పలు పెట్టాడు. అయిదు వికెట్లు నేలకూల్చి కంగారులను వణికించాడు. అసలు బుమ్రా బౌలింగ్ లో క్రీజులో నిలబడడం కూడా ఆసీస్ జట్టు బ్యాటర్లకు కష్టంగా మారింది. బుమ్రా దాటికి ఆస్ట్రేలియా కేవలం 104 పరుగులకే ఆలౌట్ అయింది. బుమ్రా 18 ఓవర్లు బౌలింగ్ చేసి ఆరు మెయిడిన్లు వేసి కేవలం 30 పరుగులు ఇచ్చి అయిదు వికెట్లు నేలకూల్చాడు. దీంతో ఆస్ట్రేలియా అభిమానులు, మాజీ క్రికెటర్లు బుమ్రాను టార్గెట్ చేశారు. బుమ్రా చెక్ చేస్తున్నాడని.. బంతిని త్రో చేస్తున్నాడని చౌకబారు విమర్శలకు దిగారు.

 





బుమ్రా బౌలింగ్ యాక్షన్ ఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా ఉందని.. అసలు బుమ్రాను బౌలింగ్ చేయడానికి ఎలా అనుమతిస్తారని విషం చిమ్మారు. సోషల్ మీడియాలో కొంతమంది ఆసీస్ అభిమానులు భారత కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ చట్ట విరుద్ధమని ఆరోపించారు. తొలి టెస్టులో బుమ్రా నాలుగు వికెట్లతో ఆసీస్‌ను చిత్తు చేసిన తర్వాత ఈ ఆరోపణలు ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన బుమ్రాపై.. కంగారు జట్టు అభిమానులు ఇలా విషం చిమ్మడంతోనే తెలుస్తుంది వారికి బుమ్రా అంటే ఎంత భయమో అని.. భారత అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. 

 





బుమ్రాపై ఈ ఆరోపణలు తొలిసారి కాదు..

 టీమిండియా పేసర్ బుమ్రా బౌలింగ్ యాక్షన్ పై వివాదం రావడం ఇదే మొదటిసారి కాదు. 2022లో పాకిస్థాన్ పేసర్ మహమ్మద్ హస్నైన్  బుమ్రా బౌలింగ్ యాక్షన్ పై అనుమానం వ్యక్తం చేశాడు.  " బుమ్రా చేతిని మణికట్టు నుంచి మోచేయి వరకు నేరుగా చూడవచ్చు. చేయి నిలువుగా ఉన్నప్పుడు మోచేయి 15 డిగ్రీల కంటే ఎక్కువ వంగకూడదనేది నియమం.  కానీ బుమ్రా చేయి నిలువుగా ఉండడాన్ని స్పష్టంగా చూడవచ్చు, ఇది హైపర్ ఎక్స్‌టెన్షన్. ఇది హైపర్-మొబైల్ జాయింట్లు ఉన్న వ్యక్తుల కోసం అనుమతించిన నియమం. హైపర్ ఎక్స్‌టెన్షన్ అనేది కదలిక దిశను సూచిస్తుంది. అందుకే బుమ్రా బౌలింగ్ యాక్షన్ హైపర్‌ మోబిలిటీ మార్గదర్శకాలలో ఉన్నందున అదీ ఐసీసీ నిబంధనల ప్రకారం చట్ట సమ్మతమే" అని మాజీ ఇంగ్లండ్ ఆటగాడు, ప్రఖ్యాత బౌలింగ్ కోచ్ ఇయాన్ పాంట్ వెల్లడించాడు. ఐసీసీ నిబంధనలు బుమ్రా బౌలింగ్ యాక్షన్... సరిగ్గానే ఉందని ప్రకటిస్తున్నా ఆస్ట్రేలియా అభిమానులు  మాత్రం విషం చిమ్మడం ఆపట్లేదు. 





 

తొలి టెస్టులో నిప్పులు చెరిగడంతోనే...

జస్ప్రీత్ బుమ్రా పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో జరిగిన మొదటి టెస్టులో మొదటి రోజున ఆస్ట్రేలియాపై నిప్పులు చెరిగాడు. కేవలం 150 పరుగులకే ఆలౌట్ అయిన తర్వాత, బుమ్రా అద్భుతం చేశాడు. తనపై భారీ ఆశలు పెట్టుకున్న అభిమానులను భారత కెప్టెన్ నిరాశపరచలేదు. నాథన్ మెక్‌స్వీనీ, ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్‌, పాట్ కమ్మిన్స్‌ వికెట్లు పడగొట్టి, ఆసీస్ టాప్ ఆర్డర్‌ను కకావికలం చేశాడు. ఇక రెండోరోజూ ఆస్ట్రేలియాను త్వరగా ఆలౌట్ చేసిన భారత్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది.