Original NCP ShivSena in Maharashtra: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో అక్కడి ప్రజలు ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేయాలో మాత్రమే కాదు..రెండు పార్టీల్లో అసలైన పార్టీ ఏదో కూడా తేల్చేశారు. ఆ రెండు పార్టీలు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శివసేన, అటు కాంగ్రెస్ పార్టీ కూటమిలో ఈ పార్టీలు ఉన్నాయి. బీజేపీ కూటమిలోనూ ఈ పార్టీలు ఉన్నాయి. అయితే చీలక వర్గం, అసలైన పార్టీ మాదేనని రెండు పార్టీలు వాదిస్తూ వచ్చాయి. చివరికి ప్రజలే ఈ అంశంలో తీర్పులు ఇచ్చారు. ఆయా పార్టీలకు చెందిన ముఖ్య నేతలు కాదని.. పార్టీలకే ఓటు వేశారు. అసలైన పార్టీలుగా ఈసీ గుర్తింపు నిచ్చిన అజిత్ పవార్ ఎన్సీపీ, శిందే శివసేనలను గుర్తించారు.
థాక్రే రాజకీయ వారసత్వాన్ని కోల్పోయిన ఉద్దవ్
ఉద్దవ్ థాక్రే రాజకీయ జీవితంలో ఇదే అది పెద్ద పరాజయం. తన తండ్రి బాల్ థాక్రేనుంచి రాజకీయవారసత్వం అందుకున్న ఉద్దవ్ ధాక్రే.. తర్వాత సిద్దాంతాలకు దూరంగా జరిగారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మొదట ఆయనతో కలిసిన ఏక్ నాథ్ షిండే సహా ఇతర నేతలు తరవాత పార్టీ నుంచి విడిపోయి.. సొంత కుంపటి పెట్టుకున్నారు.దాదాపుగా ఎమ్మెల్యేలు,ఎంపీలంతా వెళ్లిపోయారు. దాంతో వారిదే అసలైన శివసేనగా కోర్టు, ఈసీ నిర్ణయించాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఉద్దవ్ వర్గానికి ఎక్కువ సీట్లు రావడంతో అసెంబ్లీ ఎన్నికల్లోనూ అవే ఫలితాలు వస్తాయనుకున్నారు. కానీ షిండే వర్గానికి ఎక్కువ సీట్లు రావడంతో అసలైన శివసేన శిందే చేతుల్లోకి శాశ్వతంగా వెళ్లిపోయినట్లయింది.
Also Read: మహారాష్ట్ర సీఎంగా దేవేందర్ ఫడ్నవీస్ -బీజేపీ సునామీతో మారిపోనున్న లెక్కలు!
శరద్ పవార్‌కు రాజకీయ రిటైర్మెంట్ !
ఈ ఎన్నికల తర్వాత రిటైర్మెంటేనని సంకేతాలు ఇచ్చిన శరద్ పవర్ పార్టీ కూడా అచ్చం శివసేన లాంటి పరిస్థితినే ఎదుర్కొంది.కాంగ్రెస్ నుంచి విడిపోయి నేషనలిస్ట్ కాంగ్రెస్పార్టీని పెట్టుకున్న ఆయన నుంచి ఆయన మేనల్లుడు అజిత్ పవార్ పార్టీని లాక్కున్నారు. అత్యధిక మంది ప్రజాప్రతినిధులు ఆయన వెనుకే ఉండటంతో ఆయనతే అసలైన ఎన్సీపీగా గుర్తించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒకే ఒక్క ఎంపీ సీటు గెల్చుకుని ప్రజలు అంతా అజిత్ పవార్ ను తిరస్కరించారని అనుకున్నారు.కానీ అసెంబ్లీ ఎన్నికల్లో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి ఘోరపరాజయం ఎదుయింది.అసలైన ఎన్సీపీగా అజిత్ పవార్ నేతృతంలోని పార్టీనే ప్రజలు గుర్తించారని అనుకోవచ్చు.
ఏక్‌నాథ్ షిండే Vs దేవందర్ ఫడ్నవీస్- ముఖ్యమంత్రి పదవిపై ఎవరేమన్నారంటే?
మహారాష్ట్ర రాజకీయాల్లో రాజకీయ పునరేకీకరణ ఖాయం
ప్రస్తుత ఫలితాల్లో మహారాష్ట్రలో గందరగోళంగా మారిన రాజకీయంలో పునరేకీకరణ అయ్యే అవకాశం కనిపిస్తోంది.ఉద్దవ్, శరద్ పవార్ పార్టీల్లో గెలిచిన వారు కూడా ఇప్పుడు తమ మాతృపార్టీల్లోకి వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయి. ఏదైమైనా శివసేన అంటే థాక్రేలది అన్న అభిప్రాయాన్ని ప్రజలు మార్చేశారు. శరద్ పవార్ పార్టీని ప్రజలే అజిత్ పవార్‌కు అప్పగించినట్లయింది.