Top 10 Headlines Today:


 


బిచ్చగాళ్లను నమ్మొద్దు- కేసీఆర్


ఎన్నికల సమయంలో కొత్త బిచ్చగాళ్లు వచ్చి మాయమాటలు చెబుతారని, వారి మాటలు ప్రజలు నమ్మొద్దని తెలంగాణ సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌, సమీకృత వ్యవసాయ మార్కెట్‌, జిల్లా ఎస్పీ కార్యాలయం, మెడికల్‌ కాలేజీ, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘సూర్యాపేట ప్రగతి నివేదన’ సభలో సీఎం మాట్లాడారు. బీఆర్‌ఎస్ పార్టీ, తాను కాంగ్రెస్ పార్టీ లెక్క కాదని, త్వరలోనే పింఛన్లు పెంచుతామని కేసీఆర్ అన్నారు. గతంలో కాంగ్రెస్ కేవలం రూ.200 పింఛన్ ఇచ్చిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.2 వేలు, రూ.3 వేలకు పెంచిందన్నారు.  తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌తోనే ఉన్నారని, గత ఎన్నికల్లో గెలిచిన సీట్లకంటే ఈ సారి ఎన్నికల్లో 5 లేదా 6 సీట్లు ఎక్కువ గెలుస్తామన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


మృతులకు పదిలక్షల పరిహారం


పాడేరు ఘాట్‌లో ఆర్టీసీ బస్సు లోయలో పడిన ప్రదేశాన్ని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆదివారం రాత్రి పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును ఆర్టీసీ, పోలీస్ అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఘటనపై సీఎం జగన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు తీసుకోవాలని మంత్రి అమర్నాథ్‌ను ఆదేశించారు. హుటాహుటిన పాడేరు చేరుకున్న మంత్రి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అనంతరం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్, కార్పొరేట్ ఆసుపత్రులకు తరలించాలన్నారు.  వారు పూర్తిస్థాయిలో కోలుకునే విధంగా వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


థర్డ్‌ డిగ్రీపై సీరియస్


ఎల్బీనగర్ లో మహిళపై థర్డ్ డిగ్రీ ఘటనపై ఇదివరకే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీరియస్ అయ్యారు. ఈ అంశంపై తనకు నివేదిక ఇవ్వాలని డీజీపీ, సీఎస్ లను ఆమె ఆదేశించారు. తాజాగా ఆదివారం నాడు బాధ్యులైన పోలీసులపై కేసులు నమోదైంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు డీసీపీ సాయిశ్రీ వెల్లడించారు. రాచకొండ సీపీ చౌహాన్ బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకున్నారని ఆమె తెలిపారు. దర్యాప్తు జరిపి వాస్తవాలు వెలికి తీస్తామన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


ఓటు- వేటు 


ఏపీలో దొంగ ఓట్లపై టీడీపీ కొన్ని నెలల నుంచి ఆరోపణలు చేస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘానికి సైతం రాష్ట్రంలో దొంగ ఓట్లపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అనంతపురం జిల్లా ఉరవకొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారిపై వేటు పడింది. జిల్లా పరిషత్ సీఈవో భాస్కర్‌రెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కేంద్ర ఎన్నికల కమిషనర్ (CEC) ఆదేశాల మేరకు సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


పోరాటం ఆగదంటున్న సీఎం


'నీట్' ప్రవేశ పరీక్షలో తమ రాష్ట్రానికి మినహాయింపు ఇచ్చేవరకు తమ పోరాటం ఆగదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పష్టంచేశారు. అంతేకాకుండా నీట్ వ్యతిరేక బిల్లుకు తాను ఎప్పటికీ సంతకం చేయనని గవర్నర్ ఆర్.ఎన్.రవి పేర్కొనడంపై సీఎం మండిపడ్డారు. ఈ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉందని.. ఇలాంటి సమయంలో గవర్నర్ వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. నీట్ రద్దును డిమాండ్ చేస్తూ డీఎంకే రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 20న ఆందోళనలు చేపట్టగా.. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం స్టాలిన్ ఇదే అంశంపై మాట్లాడారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


కూనలపై సరీస్ విజయం 


ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. అనంతరం ఐర్లాండ్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 152 పరుగులు మాత్రమే చేసింది. దీంతో భారత్ 33 పరుగులతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో సిరీస్‌ను కూడా 2-0తో సొంతం చేసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


అదిరే ఫీచర్స్‌తో


హోండా తన సరికొత్త ఎస్‌యూవీ ఎలివేట్‌ను భారతదేశంలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. కంపెనీకి చెందిన రాజస్థాన్‌లోని తపుకరా ప్లాంట్‌లో దీని ఉత్పత్తి ప్రారంభమైంది. దీనికి సంబంధించిన బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఇది ఇప్పటికే మార్కెట్లో అద్భుతమైన స్పందనను పొందుతోంది. దీని వెయిటింగ్ పీరియడ్ నాలుగు నెలల వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. హోండా ఎలివేట్‌ను కొనుగోలు చేయాలనుకునే వారు రూ. 25,000 డౌన్‌పేమెంట్‌ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. వినియోగదారులు దీన్ని ఆన్‌లైన్‌లో లేదా హోండా డీలర్‌షిప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


ఎస్‌ఎస్‌సీ కానిస్టేబుల్ రిజల్ట్స్ వచ్చేశాయి


కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్(జీడీ) పోస్టుల భర్తీకి సంబంధించిన తుది ఫలితాలు విడుదలయ్యాయి. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) ఆగస్టు 20న ఫలితాలను విడుదల చేసింది. ఈ మేరకు  ఆధికారిక ప్రకటన విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాతోపాటు.. రాష్ట్రాలు, కేటగిరీ వారీగా కటాఫ్‌ మార్కుల వివరాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెల్లడించింది. కానిస్టేబుల్(జీడీ) నియామకాల కోసం జులైలో నిర్వహించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ తర్వాత రిజర్వేషన్‌‌లకు అనుగుణంగా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


సెప్టెంబర్ 3 నుంచి బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం


తెలుగు ప్రజలందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ‘బిగ్‌బాస్ 7’ ప్రారంభం అయ్యే తేదీని స్టార్ మా అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ప్రారంభం కానుంది. గత సీజన్ల మాదిరిగానే అక్కినేని నాగార్జున ఈ సీజన్‌కు కూడా హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేశారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


డైరెక్టర్‌నే కొట్టాను- నటి రక్ష


నటి రక్ష గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాణి పేరుతో ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 'పోలీస్ వెంకటస్వామి'లో బాలనటిగా పరిచయమైన రక్ష.. దాదాపు పదేళ్ల తర్వాత 'జానీ వాకర్‌' అనే మలయాళ చిత్రంలో నటించింది. 'చిరునవ్వుల వరమిస్తావా' మూవీతో హీరోయిన్‌గా తెలుగులోకి ప్రవేశించింది. అలా 'నాగవల్లి', 'నిప్పు', 'రచ్చ', 'మేం వయసుకు వచ్చాం', 'బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి', 'దువ్వాడ జగన్నాథమ్' వంటి చాలా సినిమాల్లోనూ నటిగా మెప్పించింది. అయితే ఎవరైనా తన గురించి నెగెటివ్ గా అనుకుంటున్నారు అని చిన్న వైబ్రేషన్ వచ్చినా వెంటనే అర్థమైపోతుందని రక్ష రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆన్ ది స్పాటే వాళ్లకు రిప్లై ఇస్తానని, అలా కోపం వచ్చి చాలా మందిని కొట్టానని కూడా తెలిపారు. తాను హోమ్లీగా ఉంటానని, హంగామా అంటే అస్సలు ఇష్టముండదని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి