'నీట్' ప్రవేశ పరీక్షలో తమ రాష్ట్రానికి మినహాయింపు ఇచ్చేవరకు తమ పోరాటం ఆగదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పష్టంచేశారు. అంతేకాకుండా నీట్ వ్యతిరేక బిల్లుకు తాను ఎప్పటికీ సంతకం చేయనని గవర్నర్ ఆర్.ఎన్.రవి పేర్కొనడంపై సీఎం మండిపడ్డారు. ఈ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉందని.. ఇలాంటి సమయంలో గవర్నర్ వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. నీట్ రద్దును డిమాండ్ చేస్తూ డీఎంకే రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 20న ఆందోళనలు చేపట్టగా.. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం స్టాలిన్ ఇదే అంశంపై మాట్లాడారు.


నీట్ రద్దును కోరుతూ తమిళనాడు యువజన సంక్షేమం, క్రీడల అభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధితోపాటు ఇతర మంత్రుల నేతృత్వంలో అధికార డీఎంకే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ఈ సందర్భంగా ఉదయనిధి మాట్లాడుతూ.. రాష్ట్రంలో చేపట్టిన ఈ నిరసనలు ఇక్కడితో ఆగవన్నారు. ఇప్పటివరకు 21 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని.. దీనికి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలోనూ ఉద్యమిస్తామన్నారు. మధురై మినహా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో.. నీట్ వల్ల పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిరసనల్లో డీఎంకే యువజన, విద్యార్థి, వైద్యుల విభాగాలతోపాటు డీఎంకే కార్యకర్తలు సైతం పాల్గొన్నారు. మధురైలో ఆగస్టు 23న ఆందోళన చేపట్టనున్నారు. 


'నీట్' పరీక్షపై రాజకీయం - బీజేపీ కౌంటర్
మెడికల్కో ర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే 'నీట్' పరీక్షపై అధికార డీఎంకే రాజకీయం చేస్తోందని భాజపా తమిళనాడు అధ్యక్షుడు కె.అన్నామలై విమర్శించారు. నీట్ పరీక్షకు సంబంధించి ఏ రాష్ట్రంలోనూ ఇటువంటి ఆందోళనలు జరగడం లేదని.. కేవలం డీఎంకే మాత్రం విద్యార్థుల మనోభావాలతో ఆడుకుంటోందన్నారు.  


ALSO READ:


జిప్‌మర్‌లో బీఎస్సీ నర్సింగ్, అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సులు
పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్(జిప్‌మర్‌) 2023-24 విద్యా సంవత్సరానికి కోర్సుల్లో బీఎస్సీ నర్సింగ్, అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సుల్లో   ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు సెప్టెంబరు 5లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.  
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


డిగ్రీ ప్రవేశాలకు మరో విడత 'దోస్త్‌' కౌన్సెలింగ్, స్పెషల్‌ డ్రైవ్‌ షెడ్యూలు ఇదే!
తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఇప్పటికే మూడు దశలో కౌన్సెలింగ్‌తోపాటు స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ కూడా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నాలుగు రౌండ్లలో కలిపి ఇప్పటిదాకా మొత్తం 1,89,046 సీట్లు భర్తీ అయ్యాయి. సీట్లు పొందిన వారంతా ఆయా కళాశాలల్లో రిపోర్ట్‌ కూడా చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే ఇంకా భారీగా సీట్లు మిగలడంతో మరో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఇంజినీరింగ్‌, నీట్‌, అగ్రికల్చర్‌ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతున్నందున విద్యార్థుల సౌకర్యార్థం మరో విడత 'దోస్త్‌' అడ్మిషన్లను నిర్వహించాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఈమేరకు నిర్ణయించింది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..