పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్(జిప్‌మర్‌) 2023-24 విద్యా సంవత్సరానికి కోర్సుల్లో బీఎస్సీ నర్సింగ్, అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సుల్లో   ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు సెప్టెంబరు 5లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.  


వివరాలు..


1) బీఎస్సీ నర్సింగ్: 94 సీట్లు


2) బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సులు: 87 సీట్లు


➥ మెడికల్ ల్యాబొరేటరీ సైన్సెస్


➥ అనస్థీషియా టెక్నాలజీ


➥ ఆప్టోమెట్రీ


➥ కార్డియాక్ ల్యాబొరేటరీ టెక్నాలజీ


➥ డయాలసిస్ థెరపీ టెక్నాలజీ


➥ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ(బ్లడ్ బ్యాంకింగ్‌)


➥ మెడికల్ రేడియాలజీ, ఇమేజింగ్ టెక్నాలజీ


➥ న్యూరోటెక్నాలజీ


➥ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ


➥ పెర్ఫ్యూజన్ టెక్నాలజీ


➥ రేడియోథెరపీ టెక్నాలజీ


కోర్సు వ్యవధి: నాలుగేళ్లు.


అర్హత: 50 శాతం మార్కులతో 10+2 హయ్యర్/ సీనియర్ సెకండరీ పరీక్ష(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/ బోటనీ & జువాలజీ) ఉత్తీర్ణతతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్‌-యూజీ 2023)లో అర్హత సాధించి ఉండాలి.


వయోపరిమితి: 31.12.2023 నాటికి 17 ఏళ్ల వయస్సు పూర్తి చేసి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి లేదు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: నీట్‌-యూజీ 2023 స్కోరు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, కౌన్సెలింగ్‌ తదితరాల ఆధారంగా సీటు కేటాయిస్తారు.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 05.09.2023.


➥ అర్హత జాబితా వెల్లడి: 16.09.2023.


➥ కౌన్సెలింగ్, ప్రవేశాల తేదీలు: సెప్టెంబర్‌ నాలుగో వారం.


➥ తరగతులు ప్రారంభం: 04.10.2023.


Notification


Online Application


Login Link


Website


ALSO READ:


జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో పార్ట్ టైమ్ కోర్సులు, ప్రవేశాలు ఇలా!
తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం 2023-24 విద్యా సంవత్సరానికి గాను వివిధ పార్ట్ టైమ్ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. కోర్సులవారీగా విద్యార్హతలు నిర్ణయించింది. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. కోర్సును అనుసరించి ప్రవేశ పరీక్ష/ ఫ్లెక్సిబిలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ, మెరిట్ లిస్ట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


డిగ్రీ ప్రవేశాలకు మరో విడత 'దోస్త్‌' కౌన్సెలింగ్, స్పెషల్‌ డ్రైవ్‌ షెడ్యూలు ఇదే!
తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఇప్పటికే మూడు దశలో కౌన్సెలింగ్‌తోపాటు స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ కూడా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నాలుగు రౌండ్లలో కలిపి ఇప్పటిదాకా మొత్తం 1,89,046 సీట్లు భర్తీ అయ్యాయి. సీట్లు పొందిన వారంతా ఆయా కళాశాలల్లో రిపోర్ట్‌ కూడా చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే ఇంకా భారీగా సీట్లు మిగలడంతో మరో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఇంజినీరింగ్‌, నీట్‌, అగ్రికల్చర్‌ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతున్నందున విద్యార్థుల సౌకర్యార్థం మరో విడత 'దోస్త్‌' అడ్మిషన్లను నిర్వహించాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఈమేరకు నిర్ణయించింది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..