Top 10 Headlines Today: 

 

1. ఇదేమన్నా వైసీపీ ప్రభుత్వం అనుకున్నారా..?

ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు.. అధికారులకు ముచ్చెటమలు పట్టించారు. టెక్కలి నియోజకవర్గంలో ఉదయాన్నే ప్రభుత్వ కార్యాలయాలను అకస్మాత్తుగా తనిఖీ చేశారు. ప్రజలు ఎవరైనా సరే ఇబ్బందులు పడ్డారని తన దృష్టికి వస్తే మాత్రం క్షమించేది లేదని అధికారులకు స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వం కాదని..ప్రజల కోసం మాత్రమే పని చేస్తుందని అచ్చెన్న స్పష్టం చేశారు. పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే తమ లక్ష్యమన్నారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

2. ముగ్గురు ఐపీఎస్‌లపై సస్పెన్షన్ వేటు

ముంబై నటి జత్వాని కేసులో ముగ్గురు ఐపీఎస్‌లను సస్పెండ్ అయ్యారు. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ PSR ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్నిపై సస్పెన్షన్ వేటు వేశారు. ముగ్గురు ఐపీఎస్‌ల సస్పెన్షన్ ఫైల్‌పై సీఎం చంద్రబాబు సంతకం జీవో నెంబర్లు 1590, 1591, 1592 విడుదల చేసింది. కాన్ఫిడెన్షియల్ అని పేర్కొన్న ప్రభుత్వ వెబ్‌సైట్ డీజీపీ నివేదిక ఆధారంగా ముగ్గురు ఐపీఎస్‌లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

3. టీడీపీపై జగన్ మరో "ట్వీటాస్త్రం"

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం వరదల నుంచి  మెడికల్ సీట్ల వైపు యూ టర్న్ తీసుకుంది. మెడికల్ సీట్లు వద్దంటూ నేషనల్ మెడికల్ కౌన్సిల్ కు ఏపీ ప్రభుత్వం లేఖ రాసిందని వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. దీనిపై తాజాగా జగన్ స్పందించారు. టీడీపీ ప్రభుత్వ తీరును ఖండిస్తూ మొత్తం 8 పాయింట్లతో ట్వీట్ చేశారు. వైద్య విద్యా విధానంలో వైసీపీ తీసుకొచ్చిన సంస్కరణలను కూటమి ప్రభుత్వం నీరుగారుస్తోందని విమర్శించారు. ఎంబీబీఎస్ సీట్లు అవసరం లేదంటూ చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడం దారుణమంటూ మండిపడ్డారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

4. విమర్శల వేళ నేడు రాజీవ్ విగ్రహావిష్కరణ

నేడు తెలంగాణ సచివాలయం ముందు మాజీప్రధాని, దివంగత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. అయితే రాజీవ్ విగ్రహ ఏర్పాటుపై వివాదం నడుస్తోంది. సచివాలయం ఎదురుగా రాజీవ్ విగ్రహానికి బదులు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపాదించినట్లు బీఆర్ఎస్ చెబుతోంది. ఇప్పుడు అదే ప్రాంతంలో కాంగ్రెస్ సర్కార్ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

 

5. లక్కుతో గెలిచిన రేవంత్ కు ఐదేళ్లే ఎక్కువ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అరకొర రుణమాఫీ ఘనత.. తమ పుణ్యమేనని అన్నారు. రుణమాఫీ అయిందో లేదో మీ సొంతూరులో చర్చకు సిద్ధమేనా అంటూ రేవంత్ కు సవాల్‌ విసిరారు. అదృష్టం కొద్దీ గెలిచిన రేవంత్ రెడ్డి ఐదేళ్లు మాత్రమే పదవిలో ఉంటారని.. ఈ అయిదేళ్ల కాలమే చాలా  ఎక్కువన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఇబ్బందులు, బాధలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండోసారి గెలిచేంత సీన్ కాంగ్రెస్ కు లేదని హరీశ్ అన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

 

6. ఒవైసీల భయంతోనే విమోచన దినం నిర్వహించడం లేదా.? 

సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచనా దినోత్సవంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి కి బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఒవైసీ బ్రదర్స్ అంటే భయపడే విమోచనా దినోత్సవం నిర్వహించడం లేదా అని ప్రశ్నించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒవైసీలకు భయపడే విమోచన దినం నిర్వహించలేదన్నారు. కాంగ్రెస్ అయినా  విమోచన దినం నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాజకార్ల అరాచక పాలనను వ్యతిరేకిస్తూ ఉద్యమం చేసిన అమరుల త్యాగాలను గుర్తించాలన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

 

7.గణనాథుని నిమజ్జనం వేళ స్తంభించిన ట్రాఫిక్

హైదరాబాద్‌లో గణేష్‌ నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతోంది. నగరం నాలుగు మూలల నుంచి గణనాథులు ట్యాంక్‌ బండ్‌కి తరలి వస్తున్నారు. సోమవారం తెల్లవారుజాము నుంచే హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో‌ భారీగా ట్రాఫిక్‌జామ్‌ అయ్యింది. రేపు(మంగళవారం) ‘మహా’ నిమజ్జనం ఉండడం, నిన్న ఆదివారం కావడంతో చాలా విగ్రహాలు ట్యాంక్‌బంక్‌కు చేరుకున్నాయి. వందలాది వాహనాలతో ట్రాఫిక్ స్తంభించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

 

8.ట్రంప్ సమీపంలో మరోసారి కాల్పులు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సమీపంలో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఫ్లోరిడా లో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా సమీపంలో కాల్పులు జరిగాయి. అప్రమత్తమైన యూఎస్ సీక్రెట్ సర్వీస్ పోలీసులు ట్రంప్‌ను వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించారు. తుపాకీతో ఉన్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పులు జరిపిన నిందితుడిని 58 ఏళ్ల ర్యాన్ వెస్లీ రౌత్‌గా గుర్తించారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

9. దులీప్ ట్రోఫీలో ఇండియా-ఏ గెలుపు 

దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో ఇండియా ఏ జట్టు 186 పరుగుల భారీ తేడాతో ఇండియా డీపై ఘన విజయం సాధించింది. 488 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన ఇండియా -డీ జట్టు 301 పరుగులకు ఆలౌట్ అయింది. రిక్కీ భుయ్ 195 బంతుల్లో 113 పరుగులు చేసినా డీ జట్టుకు ఓటమి తప్పలేదు. దుబే 37, శ్రేయస్ అయ్యర్ 41 పరుగులతో పర్వాలేదనిపించారు.

 

10. సైమా’.. ఉత్తమ నటుడిగా విక్రమ్

సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) - 2024 వేడుక దుబాయి వేదికగా జరిగింది. రెండో రోజు తమిళ, మలయాళ సినీ నటులు అవార్డులు అందుకున్నారు. ఉత్తమ నటుడిగా విక్రమ్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌-2), ఉత్తమ నటి-నయనతార (అన్నపూరణి), ఉత్తమ దర్శకుడు-నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ (జైలర్‌), ఉత్తమ చిత్రం- జైలర్‌, ఉత్తమ హాస్య నటుడు-యోగిబాబు (జైలర్‌), ఉత్తమ నేపథ్య గాయకుడు-సీన్‌ రోల్డన్‌ (నాన్‌ గాలి- గుడ్‌నైట్‌). మరిన్ని అవార్ధ విశేషాలు ఇక్కడ చూడండి