Harish Rao : కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అరకొర రుణమాఫీ ఘనత తన పుణ్యమేనని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రుణమాఫీ అయిందో లేదో సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లి చౌరస్తాలో చర్చకు సిద్ధమేనా అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు సవాల్ విసిరారు. రైతు రుణమాఫీ జరిగితే సురేందర్ రెడ్డి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రశ్నించారు. సిద్దిపేట వెంకటాపురం గ్రామంలో 82మంది రైతులకు రుణమాఫీ కాలేదని వివరాలు పంపిస్తానని వాళ్లకు రుణ మాఫీ చేయాలన్నారు. ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న రేవంత్‌రెడ్డి హుందాగా మాట్లాడాలని హరీశ్‌రావు హితవు పలికారు. ఇవాళ గాంధీ భవన్‌లో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌రావు ఘాటుగా స్పందించారు. వానాకాలం రైతుభరోసా ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. అంతే కాకుండా అన్ని పంటలకు బోనస్ అని చెప్పి అంతా బోగస్ చేసిందెవరని నిలదీశారు.
లక్ కొద్దీ గెలిచారు
అదృష్టం కొద్దీ గెలిచిన రేవంత్ రెడ్డి ఐదేళ్లు మాత్రమే పదవిలో ఉంటారని హరీశ్ రావు అన్నారు. ఈ అయిదేళ్ల కాలమే మీకు ఎక్కువ అన్నారు. మీ పరిపాలనలో ఇప్పటికే ప్రజలు బాధపడుతున్నారు. మీ లక్ బాగుండి మీరు గెలిచారు, ఇప్పుడు ఐదేళ్లు మీరు సీఎంగా ఉంటారు. ఈ వ్యవధిలో మంచిగా పనులు చేయాలని సూచించారు. మీకున్న అవకాశాలను జాగ్రత్తగా వినియోగిస్తే కాస్తయినా మంచిపేరు వస్తుంది. రెండోసారి గెలిస్తా అంటే కాంగ్రెస్‌కు అంత సీనులేదు. దేశంలో ఎక్కడైనా మీ పార్టీ ఒక్కసారికే పోతుందని జోస్యం చెప్పారు. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో ఐదేళ్లకే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దింపేశారని గుర్తు చేశారు. ఐదు లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు ఇస్తామని మోసం చేసింది రేవంత్‌రెడ్డి కాదా? అని ప్రశ్నించారు.
రుణమాఫీ పేరిట దగా
రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేసింది మీరు కాదా? అని ప్రశ్నించారు. రుణమాఫీ విషయంలో సీఎం ఒకరకంగా.. వ్యవసాయశాఖ మంత్రి మరో రకంగా చెబుతున్నారన్నారు. ఫార్మాసిటీ కోసం కేసీఆర్ ప్రభుత్వం 12వేల ఎకరాలు సేకరించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. ఫోర్త్ సిటీ పేరిట డ్రామాలు ఆడుతున్నారని హరీశ్ రావు విమర్శించారు.
సీఎం కుర్చీ గౌరవం కాపాడండి
నీ దిగజారుడు మాటలతో నీ గౌరవం పోతే బాధలేదు.. కానీ సీఎం కుర్చీ గౌరవం కాపాడు అని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు చురకలంటించారు. నీకు ఐదేండ్లే ఎక్కువ.. రెండోసారి అధికారంలోకి వచ్చే సీన్ లేదు అని హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఉచిత కరెంట్ ఇచ్చిండంట. ఈ రాష్ట్ర ప్రజలకు, రైతులకు తెలియదా.. ఉచిత కరెంట్ కాస్త ఉత్త కరెంట్ అయింది. అది దొంగ రాత్రి 7 గంటలని చెప్పి నాలుగైదు గంటలు కూడా కరెంట్ ఇవ్వలేదు.. నాడు కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్‌పార్మర్లు.. నిజమైన ఉచిత కరెంట్ ఇచ్చింది కేసీఆర్.. నాణ్యమైన కరెంట్ ఇచ్చిండు. నాడు వైఎస్ ఇచ్చింది ఉత్త కరెంట్ అని ఏ రైతును అడిగానా చెబుతారు. అన్ని పగటి కలలే ఈయనవి. పదేండ్లు మాది గవర్నమెంట్ అని రేవంత్ రెడ్డి పదేపదే చెబుతుండు. కాంగ్రెస్‌కు అంత సీన్ లేదు.. రాజస్థాన్‌లో, ఛత్తీస్‌గఢ్‌లో ఐదేండ్ల కంటే ఎక్కువ లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. నీవు ఐదేండ్లు ఉంటేనే ఎక్కువ. ప్రజలు బాధపడుతున్నారు. కాకపోతే అదృష్టం బాగుడి గెలిచావు. తిట్ల దండకాలు బంద్ చేసి.. ప్రజల కోసం పని చేయ్.. ఐదేండ్లు మంచిగా పని చేయ్.. నీకు ఉన్న అవకాశాలను వినియోగించు మంచి పేరు వస్తది. రెండోసారికి సీన్ లేదు. కాంగ్రెస్ పార్టీ ఒక్కసారికే పోతది అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఉచిత కరెంట్ కాస్త ఉత్త కరెంట్ అయింది
ఇంకా హరీశ్ రావు మాట్లాడుతూ.. ‘‘నీ దిగజారుడు మాటలతో నీ గౌరవం పోతే బాధ లేదు.. కానీ సీఎం కుర్చీ గౌరవం కాపాడు. నీకు ఐదేళ్లే ఎక్కువ.. రెండో సారి అధికారంలోకి వచ్చే సీన్ లేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఉచిత కరెంట్ ఇచ్చిండంట. ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా.. ఉచిత కరెంట్ కాస్త ఉత్త కరెంట్ అయింది. అది దొంగ రాత్రి 7 గంటలని చెప్పి నాలుగైదు గంటలు కూడా కరెంట్ ఇవ్వలేదు.. నాడు కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్‌పార్మర్లు.. నిజమైన ఉచిత కరెంట్ ఇచ్చింది కేసీఆర్.. నాణ్యమైన కరెంట్ ఇచ్చిండు. నాడు వైఎస్ ఇచ్చింది ఉత్త కరెంట్ అని ఏ రైతును అడిగానా చెబుతారు. అన్ని పగటి కలలే ఈయనవి.’’ అని అన్నారు.