Top 10 Headlines Today:


స్వరం మారింది


"పవన్ కల్యాణ్ టీడీపీతో కలిసి పని చేయాలని ప్రతిపాదన పెట్టారు. ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లాం.. పొత్తుల గురించి" వారే నిర్ణయం తీసుకుంటారని ఏపీ బీజేపీ కీలక నేతలు ప్రకటించారు. ఢిల్లీలో ఏపీ బీజేపీ తరపున వ్యవహారాలు చక్కబెట్టే జీవీఎల్ నరసింహారవు తో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా అదే చెప్పారు. నిజానికి పొత్తులనేవి ఢిల్లీలోనే డిసైడవుతాయి. మొన్నటిదాకా ఏపీ బీజేపీ నేతలు ఇలా చెప్పలేదు. కుటుంబపార్టీలు, అవినీతి పార్టీలతో పొత్తు ప్రశ్నే లేదని చెబుతూ వస్తున్నారు. కానీ ఇప్పుడు టీడీపీతో పొత్తు విషయంపై కాస్త సాఫ్ట గా మాట్లాడుతున్నారు. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి


ఏం చెప్పబోతున్నారు?


భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ మరోసారి కీలక సమవేశం నిర్వహిస్తున్నారు. కేసీఆర్ అధ్యక్షతన ప్రజా ప్రతినిధుల సమావేశం నిర్వహించనున్నారు.  తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం జరుగుతుంది.  కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ లెజిస్లేటీవ్‌, పార్లమెంటరీ పార్టీ భేటీ ఉంటుందని..  ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ హాజరు కావాలని ఇప్పటికే సమాచారం పంపారు. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి


మార్పులు గమనించారా?


క్రెడిట్‌ కార్డ్‌ పేమెంట్స్‌లో పెను మార్పు రాబోతోంది. దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎస్‌బీఐ కార్డ్ (SBI Card)‍‌, క్రెడిట్ కార్డ్‌ రంగంలో కీలక అడుగు వేయబోతోంది. దీంతో, మొత్తం క్రెడిట్‌ కార్డ్ పరిశ్రమలోనే అది గేమ్ ఛేంజర్‌ అవుతుంది. దేశంలో క్రెడిట్‌ కార్డ్స్‌ను జారీ చేసే రెండో అతి పెద్ద సంస్థ SBI కార్డ్. త్వరలో దీని రూపే క్రెడిట్ కార్డ్‌లను UPIతో (unified payment interface) అనుసంధానించనుంది. దేశంలో రూపే క్రెడిట్ కార్డ్‌లను జారీ చేసే అతి పెద్ద సంస్థ SBI కార్డ్ కాబట్టి, ఈ స్టెప్‌ చాలా కీలకమైనది, పెద్దది కావచ్చు. ఎస్‌బీఐ కార్డ్‌ పోర్ట్‌ఫోలియోలో 11 శాతం వాటా రూపే కార్డులది. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి


గోల్డ్‌ ధరల్లో మార్పులు


ఐదు వారాల గరిష్ట స్థాయి నుంచి అమెరికన్‌ డాలర్‌ బలహీనపడడంతో అంతర్జాతీయ బులియన్‌ మార్కెట్‌లో కాస్త ఉత్సాహం కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 2,024 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో, ఆర్నమెంట్‌ బంగారం, స్వచ్ఛమైన పసిడి ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. వెండి రేటులోనూ ఎలాంటి మార్పు లేదు, నిన్నటి ధరే కొనసాగుతోంది. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి


హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా చాడ వెంకటరెడ్డి 


సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా సీపీఐ నుంచి చాడ వెంకటరెడ్డి బరిలోకి దిగుతారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. హుస్నాబాద్ లో సీపీఐ ప్రజా చైతన్య యాత్ర ముగింపు బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అంతకుముందు హుస్నాబాద్ లోని అంబేడ్కర్ చౌరస్తా నుండి స్థానిక బస్ డిపో గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభాస్థలికి పార్టీ శ్రేణులు, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి తో కలిసి ఆయన భారీ ర్యాలీగా తరలి వెళ్లారు. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి


ఇ'లా' చేయండి


ఆంధ్రప్రదేశ్‌లోని న్యాయ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న ఏపీ లాసెట్‌-2023 హాల్‌టికెట్లను ఏపీ ఉన్నతవిద్యామండలి మే 15న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. లాసెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు లేదా మొబైల్ నెంబరు, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేది వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 20న మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4:30 వరకు లాసెట్, పీజీఎల్‌సెట్ పరీక్ష నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి


ఈరోజు ఎండలు మండే 


తెలంగాణలో నేడు దిగువ స్థాయిలో గాలులు వాయువ్య దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావం వల్ల రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో  పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాగల మూడు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు కొన్ని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సుమారుగా 42 డిగ్రీల నుండి 44 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది. రేపటి నుండి హైదరాబాద్ చుట్టూ పక్కల జిల్లాలలో పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల నుండి 41 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఒకటి లేదా రెండు ప్రదేశాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి


ప్లే ఆఫ్స్‌కు చేరిన మొదటి జట్టుగా గుజరాత్ టైటాన్స్


ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్‌కు చేరిన మొదటి జట్టుగా నిలిచింది. ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ 13 మ్యాచ్‌ల్లో 18 పాయింట్లతో ఉంది. ఇది కాకుండా ఈ జట్టు నెట్ రన్ రేట్ +0.835గా ఉంది. పాయింట్ల పట్టికలో హార్దిక్ పాండ్యా జట్టు అగ్రస్థానంలో ఉంది. అదే సమయంలో మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి


ఈ రాశివారు ఒకరి ప్రలోభాలకు గురికావొద్దు


ఈ రాశివారిని ఈ రోజు దీర్ఘకాలిక అనారోగ్యం ఇబ్బందిని కలిగిస్తుంది. తెలియని భయం వెంటాడుతుంది. మాటలో కఠినత్వం తగ్గించుకోవాలి. 
అవివాహితులు వివాహ ప్రతిపాదనలు అందుకుంటారు. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టొద్దు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. చెడు సహవాసాన్ని నివారించండి. పిల్లల పట్ల ఆందోళన ఉంటుంది. వృత్తి సంబంధమైన అడ్డంకులు తొలగిపోతాయి. న్యాయపరమైన విషయాల్లో అనుకూలత ఉంటుంది. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి


ఏజెంట్‌ సినిమా పరాజయాన్ని అంగీకరించిన అఖిల్


యూత్ కింగ్ అఖిల్ అక్కినేని నటించిన 'ఏజెంట్' సినిమా తీవ్ర నిరాశ పరిచింది. అనిల్ సుంకర నిర్మాణంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్.. బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది. ఈ మూవీ ఫెయిల్యూర్ పై ఇప్పటికే నిర్మాత స్పందించగా.. తొలిసారి అఖిల్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సినిమా పరాజయాన్ని పరోక్షంగా అంగీకరించిన యువ హీరో.. అభిమానులు, శ్రేయోభిలాషులను ఉద్దేశిస్తూ ఓపెన్ లెటర్ ను ట్విట్టర్ లో రిలీజ్ చేశాడు. ఈ చిత్రం కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్ చెప్పాడు. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి