భారతీయ సంస్కృతికి ప్రతిబింబం టీ. రోజువారీ జీవితంలో ఇదొక అంతర్భాగం అయిపోయింది. పొద్దున టీ తాగడానిదే కొంతమందికి రోజు స్టార్ట్ అవదు. కానీ టీలో ఉండే కెఫీన్ మొత్తం ఆరోగ్యానికి హానికరంగా పరిగణిస్తారు. ఇది ఎసిడిటీ, ఇతర ఆరోగ్య సమస్యలని కలిగించే సందర్భాలు ఉన్నాయి. వీటిని అధిగమించాలంటే పాలు, పంచదార వేసుకుని చేసుకునే టీ కంటే ఆరోగ్యకరమైన పదార్థాలు అందులో జోడించుకుంటే అద్భుతంగా ఉంటుంది. వీటిని టీలో కలిపితే అది మరింత రుచిగా ఆరోగ్యకరంగా మారుతుంది.


దాల్చిన చెక్క


దాల్చిన చెక్క జోడించడం వల్ల టీ చాలా రుచికరంగా ఉండటమే కాదు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉన్నాయి. ఇవి మీ టీని ఆరోగ్యవంతంగా చేస్తాయి. దాల్చిన చెక్క టీ తాగడం వల్ల జీవక్రియ, జీర్ణక్రియ మెరుగుపడుతుడి. ఈ టీ తాగడం వల్ల జలుబు, దగ్గు నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. రోజుకొక దాల్చిన చెక్క టీ తాగితే ఆరోగ్యానికి మంచిది.


లవంగాలు


లవంగాలలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ టీ జీర్ణవ్యవస్థ మెరుగ్గా ఉండేలా పని చేస్తుంది. కండరాల నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. లవంగం టీ తాగడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. త్వరగా రోగాల బారిన పడరు.


Also Read: చర్మానికి హాని చేసే ఆహారాలు ఇవే


అల్లం


అల్లం టీ వాసనే అద్భుతంగా ఉంటుంది. అందుకే అల్లం టీ చాలా మంది ఇష్టపడతారు. ఇన్ఫెక్షన్ నుంచి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడుతుంది. రుచికరంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. ఈఇ టీని రోజూ తీసుకోవచ్చు. రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. జలుబు, దగ్గు నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. అల్లంలో ఉండే ఔషధ గుణాలు అనారోగ్యం బారిన పడకుండా కాపాడతాయి.


తులసి


ఎన్నో ఔషధ గుణాలు కలిగిన తులసి ఆకులు మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. తులసి టీని వేసవి లేదా శీతాకాలంలో తాగొచ్చు.


యాలకులు


యాలకులు టీ రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. రోజూ యాలకుల టీ తాగితే వాపు రాకుండా చేస్తుంది. జీర్ణవ్యవస్థ బలపడుతుంది. ఈ టీ తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. యాలకుల టీ తాగితే నోటి దుర్వాసన తొలగిపోతుంది. గొంతు నొప్పి తగ్గిస్తుంది.


నిమ్మ, అల్లం టీ


రోజూ పడుకునే ముందు ఈ నిమ్మ, అల్లం టీ తాగితే మంచిది. ఒత్తిడి గుణాలు తగ్గించి హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది. మానసిక ఆందోళన తగ్గిస్తుంది. విటమిన్ సి పుష్కలంగా ఉండే నిమ్మకాయ జాతచేరితే రోగనిరోధక శక్తి కూడా పెరిగి మానసిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. అజీర్తి సమస్యలు దరి చేరకుండా చేస్తుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: పరగడుపున ఖాళీ పొట్టతో ఈ టీ తాగితే బరువు తగ్గడం సులువు