BRS Meeting : భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ మరోసారి కీలక సమవేశం నిర్వహిస్తున్నారు. కేసీఆర్ అధ్యక్షతన ప్రజా ప్రతినిధుల సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం జరుగుతుంది. కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్ లెజిస్లేటీవ్, పార్లమెంటరీ పార్టీ భేటీ ఉంటుందని.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ హాజరు కావాలని ఇప్పటికే సమాచారం పంపారు.
బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల సమావశంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారన్న దానిపై స్పష్టత లేదు. మొన్నటిదాకా ఇలా ప్రజాప్రతినిధులు లేదా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేస్తే ముందస్తు ఎన్నికల గురించి ఏమైనా చెబుతారేమో అనుకునేవారు. అయితే ఇప్పుడు ఆ సమయం దాటిపోయింది. వచ్చే ఆరు నెలల్లోనే తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు ప్రభుత్వాన్ని రద్దు చేసినా ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి కాబట్టి అలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు.
ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలన్న దానిపై ప్రజా ప్రతినిధులకు కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. గత కొన్నిసమావేశాల్లో కొంత మంది ఎమ్మెల్యేల తీరుపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దళిత బంధు పథకాల్లో నిధులు కూడా .. పేదల వద్ద నుంచి కమిషన్లకు తీసుకుంటున్నారని వారి చిట్టా తన దగ్గర ఉందని మండిపడ్డారు. అదంతా బయటకు రావడంతోనే సంచలనం అయింది. ఇప్పుడు అలాంటి ఎమ్మెల్యేలపేర్లుబయట పెట్టి.. ఇక టిక్కెట్ లేదని చెబుతారేమోనన్న అభిప్రాయం వినిపిస్తోంది.
కేసీఆర్ పార్టీ అభ్యర్థులను కొంత కాలంగా ఖరారు చేస్తున్నారు. అనధికారికంగా వారికి సమాచారం ఇచ్చి.. పని చేసుకోమని చెబుతున్నారు. ఇప్పుడు ఆ అభ్యర్థులందరి్కీ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే కొంత మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వడం లేదన్న సమాచరం పంపారని అంటున్నారు. వచ్చే ఆరు నెలల పాటు ప్రజల్లో ఉండేలా ప్రత్యేకమైన కార్యక్రమాలకు కేసీఆర్ రూపకల్పన చేశారని.. వాటిని ఇంప్లిమెంట్ చేసేలా.. అందరికీ సూచనలు, సలహాలు, ఆదేశాలు ఇస్తారని భావిస్తున్నారు.
కేసీఆర్ పక్కాగా ఎన్నికలకు రెడీ అవుతున్నారు.గతంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లినప్పుడు ఎంత పక్కాగా .. అన్ని సిద్ధం చేసుకుని ఎన్నికలకు వెళ్లారో అలాంటి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఎమ్మెల్యేలు, అభ్యర్థుల విషయంలో మాత్రం ఈ సారి మరింత సహకారం అవసరం ఉంది. గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఇద్దరు, ముగ్గుర్ని తప్ప మార్చలేదు. కానీ ఆ సిరి మాత్రం భారీగా మార్చే అవకాశాలు ఉన్నాయి.ఇది వర్గ పోరాటానకి దారి తీస్తుంది. అందుకే వీలైనంత వరకూ .. టిక్కెట్లు రాని వారికి మరో విధంగా అవకాశాలు కల్పిస్తామని కేసీఆర్ భరోసా ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.