Top 10 Headlines Today:
గుడ్ న్యూస్
ఏపీలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని ఏపీ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఉమ్మడి ఏపీ విభజనకు ముందే అంటే 2014 జూన్ కు ముందే 5 ఏళ్లు పూర్తయిన కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ఎండ బాధ
నిన్నటి ఆవర్తనం ఈ రోజు దక్షిణ ఛత్తీస్ గఢ్, పరిసర ప్రాంతాలలో కొనసాగుతూ సగటు సముద్ర మట్టం నుండి 1.5 కి మీ ఎత్తు వద్ద స్థిరంగా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు సోమవారం (జూన్ 5) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రోజు ద్రోణి ఉత్తర ఛత్తీస్ గఢ్ నుండి విదర్భ మీదుగా తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి మీ ఎత్తు వద్ద కొనసాగుతూ ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
టాప్‌టెన్ యూనివర్శిటీస్
దేశంలోని అత్యుత్తమ విద్యాసంస్థల్లో గతేడాది మొదటి స్థానంలో నిలిచిన ఐఐటీ-మద్రాస్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 2023 ర్యాంకుల్లో ఐఐటీ-మద్రాస్ తర్వాత రెండో స్థానంలో ఐఐఎస్సీ-బెంగళూరు నిలవగా, 3వ స్థానంలో ఐఐటీ-ఢిల్లీ నిలిచింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యాసంస్థల్లో ఐఐటీ-హైదరాబాద్ 14వ స్థానంలో నిలవగా, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 20వ స్థానంలో నిలిచింది. వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) 53వ స్థానంలో, ఉస్మానియా యూనివర్సిటీ 64వ స్థానంలో నిలిచింది. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ 76వ స్థానంలో నిలిచింది. ఐఐటీ మద్రాసు అగ్రస్థానంలో నిలవడం ఇది ఐదోసారి కావడం విశేషం. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ఐటీలో మేటీ
హైదరాబాద్ కేంద్రంగా 2013-14లో ఐటీ ఉత్పత్తులు రూ.56 వేలు కోట్లుగా ఉంటే, అది నేడు రూ.1.83 లక్షల కోట్లకు చేరిందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ నగరం ఐటీ రంగంలో దూసుకుపోతోందని చెప్పారు. హైటెక్ సిటీలోని టీ హబ్‌లో మంత్రి కేటీఆర్ సోమవారం (జూన్ 5) 9వ వార్షిక ఐటీ నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఐటీ రంగంలో బెంగళూరుతో పోటీ పడేలా హైదరాబాద్‌ను నిలబెట్టామని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
పోలవరానికి నిధుల వరద
పోలవరం ప్రాజెక్టుకుపై కేంద్రం మరో శుభవార్త చెప్పింది. 12,911.15 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడానికి ఓకే చెప్పింది. విభాగాల వారీగా పెట్టే పరిమితులను తొలగించింది. ఇప్పుడు ఇచ్చిన నిధులు ఎక్కడైనా ఖర్చు పెట్టుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
బాధితులకు ఉద్యోగం
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. బెంగాల్ కు చెందిన మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అవయవాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కూడా సర్కారు ఉద్యోగం ఇస్తామని తెలిపారు. సోమవారం రోజు కోల్‌కతాలో మీడియాతో మాట్లాడిన మమతా.. రైలు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై మానసిక, శారీరక గాయాలతో బాధపడుతున్న వారికి నగదు సాయం అందిస్తామని తెలిపారు. మంగళ వారం భువనేశ్వర్, కటక్ వెళ్లి అక్కడ వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రైలు ప్రమాద బాధితులను పరామర్శించినున్నట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
సీ... ఇది మీకు చాలా అవసరం
రోజు వారీ పనులు నిర్వర్తించాలన్నా, జీవక్రియలన్నీ సజావుగా సాగాలన్నా శరీరానికి పోషకాలు అవసరమవుతాయి. రోగనిరోధకత స్థిరంగా ఉంచడం, ఎముకలు బలంగా ఉండడం వంటి వన్నీ ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. ఇందుకు దోషదం చేసే సూక్ష్మపోషకం విటమిన్ సి. ఇన్ఫెక్షన్ల నుంచి త్వరగా కోలుకోవడానికి, దీర్ఘకాలిక ఆరోగ్యానికి అవసరమైన పోషకం విటమన్ సి. మన శరీర నిర్మాణం చాలా సంక్లిష్టం. ఒక్క పోషక లోపం ఏర్పడినా అది మిగతా పోషకాల లోపానికి, ఇతర అనారోగ్యాలకు కారణం అవుతుంది. కనుక పోషకాహార లోపం ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. ఒక వేళ లోపం ఏర్పడితే సరైన సమయంలో చికిత్స తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
రోహిత్ ఆన్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్
ఇంగ్లాండ్‌లో వాతావరణం భిన్నంగా ఉంటుందని టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అంటున్నాడు. ఎంతసేపు ఆడినా అక్కడ నిలదొక్కుకున్నట్టు బ్యాటర్‌కు అనిపించదని పేర్కొన్నాడు. అయితే అటాకింగ్ సెన్స్ మాత్రం తెలుస్తుందని వెల్లడించాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఎలా సన్నద్ధమయ్యాడో వివరించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
జాబ్ న్యూస్
దేశవ్యాప్తంగా ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో భారీ సంఖ్యలో టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి జూన్ 5న ''నేషనల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS)'' నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు, వయోపరిమితి, ఇతర అర్హతలు నిర్ణయించారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ త్వరలోనే ప్రారంభంకానుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ఈ రాశివారు క్లిష్టమైన విషయాన్ని ఈ రోజు పరిష్కరించుకుంటారు!
కొత్త ఆలోచనలతో పనులు పూర్తి చేస్తారు. కొన్ని పనులు పూర్తికాని కారణంగా మీరు కొంత కలత చెందుతారు. కవులకు సాహితీ ప్రియులకు అనుకూలమైన రోజు. వ్యాపార రంగంలో ఉన్నవారు మంచి ఒప్పందాన్ని పొందే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి.