అంబటి రాయుడు వైజాగ్ కోసమేనా
భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) సీఎం జగన్ (CM Jagan) సమక్షంలో వైసీపీలో (Ysrcp) లాంఛనంగా చేరారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం కూడా కన్ఫామ్ అయిపోయింది. అయితే, ఆయన గుంటూరులో పర్యటిస్తుండగా అక్కడి నుంచే పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ, అందరూ అనుకుంటున్నట్లుగా గుంటూరు కాదు.. మరో ముఖ్యమైన స్థానానికి రాయుడు పేరును పార్టీ పరిశీలిస్తోంది. YSRCP సోర్సుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆయన్ను వైజాగ్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేయించే విషయాన్ని పరిశీలిస్తున్నారు. ఇంకా చదవండి
విద్యా దీవెన నిధులు విడుదల చేసిన సీఎం జగన్
రాష్ట్రంలో విద్యకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని, పేద విద్యార్థులకు పెద్ద చదువులు అందేలా అడుగులు వేశామని సీఎం జగన్ (CM Jagan) తెలిపారు. ప.గో జిల్లా భీమవరం (Bhimavaram) జగనన్న విద్యా దీవెన (Jagananna Vidya Deevena), వసతి దీవెన (Vasathi Deevena) నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 2023 - 24 జులై - సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించిన నిధులను బటన్ నొక్కి పిల్లల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. 8.09 లక్షల మంది విద్యార్థులకు రూ.584 కోట్ల ఆర్థిక సాయం అందించామని చెప్పారు. ఇంకా చదవండి
జనసేనానిపై సీఎం జగన్ తీవ్ర విమర్శలు
జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కార్లను మార్చినట్లుగా భార్యలను మారుస్తాడని సీఎం జగన్ (CM Jagan) తీవ్ర విమర్శలు చేశారు. భీమవరంలో జగనన్న విద్యా దీవెన (Jagananna Vidya Deevena), వసతి దీవెన (Vasathi Deevena) నిధుల విడుదల సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రియల్ లైఫ్ లో ఈ పెద్ద మనిషి ఏ భార్యతోనూ ముచ్చటగా 3, 4 ఏళ్లైనా కాపురం చేసి ఉండడని ఎద్దేవా చేశారు. 'ఈ మ్యారేజీ స్టార్ ఆడవాళ్లను కేవలం ఆట వస్తువులుగా మాత్రమే చూస్తూ పెళ్లి అనే పవిత్ర వ్యవస్థను మంటగలుపుతున్నారు. నాలుగేళ్లకోసారి పెళ్లి చేసుకోవడం, మళ్లీ విడాకులు ఇచ్చేయడం, మళ్లీ పెళ్లి ఇలా కార్లు మార్చినట్లుగా భార్యలను మారుస్తున్నారు. ఇంకా చదవండి
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్‌తో భారీ ఆదాయం
క్రిస్మస్, న్యూఇయర్‌కి షాపుల్లో డిస్కౌంట్ పెట్టినట్టు... పెండింగ్ చలానాలు వసూలు చేసుకునేందుకు తెలంగాణ పోలీసు శాఖ (Telangana Police Department) డిసౌంట్ ఆఫర్ ప్రకటించింది. దీంతో పెండింగ్ చలానాలు క్లియరవుతున్నాయి. కోట్ల రూపాయాల్లో ఆదాయం వచ్చి పడుతోంది. ఇప్పటికే 10కోట్ల రూపాయల మేర వసూలు అయినట్టు సమాచారం. ఇంకా చదవండి
సాహిల్‌ను తప్పించేందుకు సినిమా తరహా స్కెచ్
హైదరాబాద్ బేగంపేట్‌లోని ప్రజాభవన్ దగ్గర కారుతో బారికేడ్లను ధ్వంసం చేసిన కేసు విచారణలో కీలక విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో నిందితుడు మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్‌గా గుర్తించారు. అంతేకాదు.. అతన్ని తప్పించేందుకు సినిమా తరహాలో పెద్ద ప్లాన్ వేశారు. నిందితుని తప్పించి... అతని డ్రైవర్‌ను ఇరికించారు. ఇందుకు ఇన్స్పెక్టర్ దుర్గారావు సహకరించినట్టు తేలింది. అయనపై సస్పెన్షన్ వేటు కూడా వేశారు ఉన్నతాధికారులు. అసలు నిందితుడు సాహిల్ ఎలా తప్పించుకున్నాడు..? అతని స్థానంలో డ్రైవర్‌ను ఎలా పెట్టారు..? ఇందులో పోలీసుల పాత్ర ఏంటి...? ఇంకా చదవండి