ఒక కుటుంబానికి ఒకే టిక్కెట్ - టీడీపీ
తెలుగుదేశం పార్టీలో టిక్కెట్ల కసరత్తు జరుగుతోంది. ఈ సందర్భంగా ఒక కుటుంబానికి ఒకే టిక్కెట్ ఇవ్వాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని ఒక్క అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడులకు మాత్రమే మినహాయింపు ఇస్తారని మిగతా ఎవరికైనా ఒకే ఫ్యామిలీకి ఒక్క టిక్కెట్ మాత్రమేనని తేల్చి చెప్పారని అంటున్నారు. ఎవరికి టిక్కెట్ కావాలో నిర్ణయించుకోవాలని ఆయన కుటుంబాలుకు సందేశం పంపినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం ఈ అంశ టీడీపీలో హాట్ టాపిక్ అవుతోంది. ఇంకా చదవండి
మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తా - పార్టీ మార్పుపై ఈటల కీలక వ్యాఖ్యలు
ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఆయన బ్రేక్ వేశారు. రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఈటల రాజేందర్ పార్టీ మారుతారన్న ప్రాచరం ఊపందుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా హ్యాండిల్స్ ఈ విషయాన్ని ప్రచారం చేస్తున్నాయి. దీనిపై ఈటల రాజేందర్ తనను సంప్రదించిన మీడియా ప్రతినిధులకు వివరణ ఇచ్చారు. తాను పార్టీ మారడం లేదన్నారు. ఈ ప్రచారాన్ని కాంగ్రెస్ నేతలు చేస్తున్నారా లేకపోతే.. బీజేపీలోని అంతర్గత శత్రువులు చేస్తున్నారా అన్నదానిపై తనకు సమాచారం లేదని.. కానీ తాను మాత్రం.. పార్టీ మారడం లేదన్నారు. ఇంకా చదవండి
జనవరి 1 నుంచి 'నుమాయిష్'
2,400 స్టాళ్లు.. 46 రోజులు.. అతి పెద్ద పారిశ్రామిక ప్రదర్శన 'నుమాయిష్' (Numaish) కోసం భాగ్యనగరం సిద్ధమవుతోంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ (Nampally Exhibition Grounds) లో జనవరి 1న 83వ 'నుమాయిష్' ప్రారంభానికి ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. దేశంలోని పలు రాష్ట్రాల ఉత్పత్తులతో పాటు తెలంగాణ, ఏపీలకు చెందిన పలు ఉత్పత్తులు, ప్రభుత్వాల స్టాళ్లు ఏర్పాటు కానున్నాయి. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకూ 'నుమాయిష్' ప్రదర్శన సాగనుంది. ఇంకా చదవండి
ప్రజా పాలన రోడ్ మ్యాప్ పంచాయతీ ఎన్నికలకేనా?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ (Congress Party) తిరిగి తన పూర్వ వైభవాన్ని చాటేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రెండు రాష్ట్రాల్లో పతనం అంచుల్లోకి పడిపోయింది కాంగ్రెస్. తెలంగాణలో మాత్రం ఫినిక్స్ పక్షిలా మారో మారు తనదైన శైలిలో పునరుజ్జీవనం పొంది, బీఆర్ఎస్ (BRS Party)కు చెక్ పెట్టి కాంగ్రెస్ అధికార పీఠం దక్కించుకుంది. తెలంగాణలో తన మార్కు రాజకీయాలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా రానున్న పంచాయతీ ఎన్నికల్లో తన జోష్ ను చూపించేలా... వ్యూహాలు సిద్దం చేస్తోంది. ఇంకా చదవండి
'అనంత' నేతలతో సీఎం జగన్ చర్చలు
వచ్చే ఎన్నికల్లో 'వైనాట్ 175' నినాదంతో సీఎం జగన్ (CM Jagan) వ్యూహాత్మకంగా ప్రణాళికలు రచిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ మార్పులు చేస్తున్నారు. ఎవరికి టికెట్ కేటాయిస్తారో అనే దానిపై కీలక నేతలు, వారి అభిమానుల్లో టెన్షన్ నెలకొంది. తాడేపల్లి (Tadepalli) క్యాంప్ కార్యాలయం నుంచి ఫోన్ రాగానే వారి గుండెల్లో గుబులు పట్టుకుంటోంది. తాజాగా, ఉమ్మడి అనంతపురం జిల్లా (Ananthapuram District) నేతలకు సీఎం నుంచి పిలుపు రాగా వారంతా తాడేపల్లికి పరుగులు తీసి బుధవారం సీఎంను కలిశారు. ఇంకా చదవండి