TDP One Family One Ticket Policy :  తెలుగుదేశం పార్టీలో టిక్కెట్ల కసరత్తు జరుగుతోంది. ఈ సందర్భంగా ఒక కుటుంబానికి ఒకే టిక్కెట్ ఇవ్వాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ మేరకు  నిర్ణయం తీసుకున్నారని ఒక్క అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడులకు మాత్రమే మినహాయింపు ఇస్తారని మిగతా ఎవరికైనా ఒకే ఫ్యామిలీకి ఒక్క టిక్కెట్ మాత్రమేనని తేల్చి చెప్పారని అంటున్నారు. ఎవరికి టిక్కెట్ కావాలో నిర్ణయించుకోవాలని ఆయన కుటుంబాలుకు సందేశం పంపినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం ఈ అంశ టీడీపీలో హాట్ టాపిక్ అవుతోంది. 


టీడీపీలో చాలా కాలంగా పాతుకుపోయిన కొన్ని కుటుంబాలు 


తెలుగుదేశం పార్టీలో కొన్ని జిల్లాల్ల్లో కొన్ని కుటుంబాలు సుదీర్ఘ కాలంగా ఉంటున్నాయి. అలాంటి కుటుంబాల్లో ఇద్దరు మగ్గురు ప్రజాప్రతినిధులు ఉంటున్నారు. కింజరాపు కుటుంబం నుంచి అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు టీడీపీలో కీలక పొజిషన్లలో ఉన్నారు. రామ్మోహన్ నాయుడు సోదరి ఆదిరెడ్డి భవాని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఆమెకు అవకాశం కింజరాపు కుటుంబం ద్వారా కాకుండా .. ఆమె  భర్త తరపు కుటుంబం నుంచి వచ్చింది. అందుకే.. ఆమెను వేరే కుటుంబంగా పరిగణనలోకి తీసుకున్నా కింజరాపు కుటుంబం నుంచి బాబాయ్, అబ్బాయలకు తప్పనిసరిగా అవకాశం ఇవ్వాల్సిందే. అందుకే వీరిద్దరికీ మినహాయింపు ఇస్తామని  హైకమాండ్ చెప్పినట్లుాగ తెలుస్తోంది. 


తెలంగాణ రాజ్యసభ ఎన్నికల్లో ట్విస్టులు ఖాయమే - ఒక్క స్థానం కోసం ఫిరాయింపులు తప్పవా ?


రాయలసీమలో కీలక నేతల కుటుంబాలు


రాయలసీమలోనే ఎక్కువగా కీలక నేతలు ఉన్న కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. కర్నూలులో  కోట్ల కుటుంబం టీడీపీలో ఉంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి లేదా కోట్ల సుజాతమ్మల్లో ఒకరికి సీటిస్తామని చెప్పినట్లుగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో వీరిద్దరూ పోటీ చేశారు. ఇద్దరూ ఓడిపోయారు. అలాగే కేఈ కృష్ణ మూర్తి కుటుంబం కూడా రెండు స్థానాలను ఆశిస్తోంది. వారికి కూడా ఒక్కటే ఆఫర్ ఇచ్చారు. ఏ సీటులో పోటీ చేయాలనుకుంటున్నారో మీరే నిర్ణయించుకోవాలని సందేశం పంపారు. ఇక అనంతపురం జిల్లాలో  పరిటాల ఫ్యామిలీ రెండు నియోజకవర్గాలకు ఇంచార్జులుగా ఉన్నారు. గత ఎన్నికల్లో రాప్తాడు నుంచి పరిటాల శ్రీరామ్ పోటీ చేసి పరాజయం పాలయ్యారు.  తర్వాత పరిటాల సునీత రాప్తాడుకు, ధర్మవరంకు పరిటాల సునీత ఇంచార్జులుగా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరిలోనూ ఒకరికే సీటిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇక అనంతపురంలోనే జేసీ కుటుంబం నంచి ఇద్దరు టిక్కెట్ రేసులో ఉన్నారు. నిజానికి ఆ కుటుంబం నుంచి ముగ్గురు రేసులో ఉన్నారు.  జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు, జేసీ దివాకర్ రెడ్డి కుమారుడితో పాటు .. సమీప బంధువు దీపక్ రెడ్డికి కూడా టిక్కెట్ అడుగుతున్నారు. ఈ సీనియర్ నేతలకు పార్టీ హైకమాండ్ ఎలా బుజ్జగిస్తుందన్నది ఆసక్తికరం. 


'అనంత' నేతలతో సీఎం జగన్ చర్చలు - ఈసారి టికెట్ ఎవరికో.?, అందరిలోనూ సర్వత్రా ఉత్కంఠ


చంద్రబాబు ఫ్యామిలీ నుంచి ముగ్గురు ఖాయం !


మరో వైపు టీడీపీ అధినేత ఫ్యామిలీ నుంచి ముగ్గురు పోటీ చేయడం ఖాయమయింది.  చంద్రబాబు కుప్పంలో పోటీ చేస్తారు. బాలకృష్ణ హిందూపురంలో పోటీ చేస్తారు. నారా లోకేష్ మంగళగరిలో పోటీ చేస్తారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ చంద్రబాబు ఫ్యామిలీ నుంచి ఒకరు పోటీ చేసే అవకాశం ఉంది. విశాఖ నుంచి పోటీ చేసేందుకు గత ఎన్నికల్లో కొద్ది తేడాతో ఓడిపోయిన బాలకృష్ణ అల్లుడు భరత్ రెడీగా ఉన్నారు. ఆయన నియోజకవర్గంలో పని చేసుకుంటున్నారు. అయితే టిక్కెట్లు వద్దనుకున్న వారికి నచ్చ చెప్పడానికి ఇలాంటి కారణం వెదుక్కుంటున్నారు కానీ.. గెలిచే అభ్యర్థిగా భావిస్తే...  టిక్కెట్లు ఇస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు. కుటుంబంలో ఒక్కరికే అనే నిబంధన చూపించి.. గెలిచే వారికి టిక్కెట్లు నిరాకరించరని చెబుతున్నారు.