తెలంగాణ కాకపోతే ఏపీ - కాంగ్రెస్ లో విలీనం వెనుక షర్మిల ఆలోచన కూడా అదేనా?
వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఎక్కువ మంది ఆమె ఎపీ కాంగ్రెస్ లో అయితే ఉపయోగం అని విశ్లేషిస్తున్నారు. కానీ షర్మిల మాత్రం తెలంగాణలోనే రాజకీయం చేస్తానంటున్నారు. ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత రాజకీయాల్లో స్పష్టమైన మార్పులొచ్చాయి. ఏ పార్టీ కూడా రెండు రాష్ట్రాల్లో బలంగా లేదు. తెలుగుదేశం కూడా ఏపీకి పరిమితమయింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు పరిమితమయింది. ఏపీలో పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోయింది. ఆంధ్రా రాజకీయాలపై తెలంగాణ ప్రజలు ఆసక్తి చూపించడం లేదు. ఏపీలోనూ అంతే. ఏపీ రాజకీయ నేతలపై తెలంగాణ ప్రజలు ఆసక్తి కూడా కోల్పోయారు. అలాంటి సందర్భంలో షర్మిల పార్టీ పెట్టారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసినా ఆమె ఓ ఫోర్స్ గా మారారని మాత్రం ఎవరూ అనుకోవడం లేదు. ఇంకా చదవండి
అర్హులైన అందరికీ పథకాలు అందేలా సురక్ష
రేషన్ కార్డులు, పెన్షన్ల కోసం గతంలో ఉద్యమాలు జరిగేవి కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని సీఎం జనగ్ తెలిపారు. ఏపీలో అవినీతిరహిత పాలనే లక్ష్యం. లబ్ధిదారులకు పథకాలు అందడమే జగనన్న సురక్ష లక్ష్యం అని స్పష్టం చేశారు. జగనన్న సురక్ష పేరుతో కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందాల్నారు. రాష్ట్రంలో 600రకాల పౌరసేవలు అందిస్తున్నామని.. వివక్షకు తాఉలేకుండా పౌరసేవలు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందించాలనే సదుద్దేశంతోనే జగనన్న సురక్ష తీసుకొచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. ఇంకా చదవండి
హిందూపురంలో బాలకృష్ణ ప్రత్యర్థిగా దీపిక - వైఎస్ఆర్‌సీపీ కొత్తగా ఆలోచిస్తోందా ?
హిందూపురం నియోజకవర్గంలో బాలకృష్ణను ఢీ కొట్టడానికి వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ కొత్తగా ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్సతోంది. రెండు రోజుల కిందట జరిగిన ఎమ్మెల్యేలు, ఇంచార్జ్ ల సమీక్షా సమావేశానికి.. ఎమ్మెల్సీ, ఇంచార్జ్ గా ఉన్న ఇక్బాల్ కు ఆహ్వానం ఇవ్వలేదు. దీపిక అనే కొత్త నేతను పిలిచారు. దీంతో అనంతపురం జిల్లా వైఎస్ఆర్‌సీపీలో కలకలం బయలుదేరింది. ఎందుకంటే చాలా మందికి ఈ దిపిక ఎవరో తెలియదు. ఇంకా చదవండి
పవన్‌పై ముద్రగడ ఫైర్ వెనుక అసలు వ్యూహం ఇదేనా?
ముద్రగడ పద్మనాభం.. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనాలు సృష్టించిన పేరు. కాపు ఉద్యమ నేతగా రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన నేత. గత కొన్నేళ్లుగా అడపాదడపా మినహా పూర్వ స్థాయిలో క్రియాశీలకంగా ఉండటం లేదన్న విశ్లేషణలు ఉన్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సందర్భంగా ఆయన మళ్లీ ఫేమస్ అయిపోయారు. ఆయనపై వరుస విమర్శలతో విరుచుకు పడుతూ లేఖాస్త్రాలు సంధిస్తున్నారు ముద్రగడ పద్మనాభం. ఇప్పటికే రెండు లేఖలు రాసిన ముద్రగడ యాత్ర పూర్తయ్యేలోపు మరికొన్ని సంధించడం ఖాయం అనే విశ్లేషణలు గట్టిగానే విపిస్తున్నాయి. అయితే ఈ లేఖల వెనుక ముద్రగడ అసలు ఆలోచన వేరే ఉంది అంటూ కౌంటర్లు కూడా అదే స్థాయిలో పేలుతున్నాయి. ఇంకా చదవండి
సిగ్నల్ వద్ద ఆత్రం పనికిరాదంటున్న వీసీ సజ్జనార్, మరో షాకింగ్ వీడియో పోస్ట్
సిగ్నల్స్ వద్ద ఆత్రం ఏమాత్రం పనికి రాదని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచిస్తున్నారు. ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. అందులో బైక్ పై వెళ్తున్న ఓ జంట సిగ్నల్ క్రాస్ చేయబోతుండగా.. లారీ కిందకు చొచ్చుకుపోయారు. అదృష్టవశాత్తు వారికి ఎలాంటి ప్రమాదమూ జరలేదు. అయితే ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డు కాగా... వీసీ సజ్జనార్ ట్టిట్టర్ ద్వారా నెటిజెన్లతో పంచుకున్నారు. అందరికి వీరిలా అదృష్టం ఉండదని.. సిగ్నల్స్ వద్ద ఏమాత్రం ఆత్రం పనికి రాదని వివరించారు. అలాగే రహదారులపై లేన్ డ్రైవింగ్‌ను విధిగా పాటించాలని సూచించారు. ఇలా అడ్డదిడ్డంగా వెళ్లి రోడ్డు ప్రమాదాలకు కారణమై విలువైన ప్రాణాలను పోగొట్టుకోకండని హితవు పలికారు. ఇంకా చదవండి