Jagan Suraksha :  రేషన్ కార్డులు, పెన్షన్ల కోసం గతంలో ఉద్యమాలు జరిగేవి కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని సీఎం జనగ్ తెలిపారు.  ఏపీలో అవినీతిరహిత పాలనే లక్ష్యం. లబ్ధిదారులకు పథకాలు అందడమే జగనన్న సురక్ష లక్ష్యం అని స్పష్టం చేశారు.  జగనన్న సురక్ష పేరుతో కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందాల్నారు.  రాష్ట్రంలో 600రకాల పౌరసేవలు అందిస్తున్నామని..  వివక్షకు తాఉలేకుండా పౌరసేవలు అందిస్తున్నామన్నారు.   ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందించాలనే సదుద్దేశంతోనే జగనన్న సురక్ష తీసుకొచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు.


అవినీతి రహతి పాలన అందిస్తున్నాం ! 


ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ సేలు అర్హులందరికీ అందాలన్నారు.  వివిధ కారణాలతో మిగిలిన లబ్ధిదారులకు మంచి చేయడమే  సురక్ష తీసుకొచ్చామని.. . అర్హత ఉండి కూడా.. చిన్నచిన్న కారణాల వల్ల మిగిలిపోయిన వాళ్లకు లబ్ధి చేకూరుస్తామని ఈ సందర్భంగా జగన్ తెలిపారు.  నవరత్నాల ద్వారా రూ.2 లక్షల 16వేల కోట్లు అందించాం. నేరుగా బటన్‌ నొక్కి అక్కాచెల్లెమ్మల ఖాతాల్లో నగదు జమ చేశామని తెలిపారు.  పేదవాడికి మంచి జరగాలన్నదే ప్రభుత్వ సంకల్పమని..  పేదల పట్ల ప్రేమ చూపిస్తు‍న్న ఏకైక ప్రభుత్వం మనదేనన్నారు.   ఈ నాలుగేళ్లలో గ్రామస్వరాజ్యం తీసుకొచ్చాం. అవినీతి రహిత పాలనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు సీఎం జగన్‌ స్పష్టం చేశారు.


జగనన్నకు చెబుదాం కొనసాగింపుగా సురక్ష 


రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో నెలరోజులపాటు 'జగనన్నకి చెబుదాం' కార్యక్రమానికి కొనసాగింపుగా.. జగనన్న సురక్ష కార్యక్రమం జరగనుంది. ప్రతీ సచివాలయంలోనూ క్యాంప్‌ నిర్వహించేలా ఏర్పాటు చేశారు. దీనికోసం 1902 హెల్ప్‌డెస్క్‌ కూడా ఏర్పాటు చేశారు. సమస్యలేవైనా ఉంటే ఈ నెంబర్‌కు డయల్‌ చేయొచ్చు.  వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, గృహసారథులు ఒక టీమ్‌గా ఏర్పడి వారం రోజుల పాటు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధి అందని వారిని గుర్తించి సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తారని సీఎం జగన్‌ పేర్కొన్నారు. 'సచివాలయాలకు వెళ్లి సర్వీస్‌ నెంబర్‌ రిజిస్టర్‌ చేసి టోకెన్‌ తీసుకుని తిరిగి ఆయా కుటుంబాలకు అందిస్తారు. సచివాలయాల పరిధిలో ఎప్పుడు క్యాంపులు పెడతారో వారికి చెప్పి ఆరోజు వారిని క్యాంపులకు తీసుకొచ్చి సమస్య పరిష్కరించేలా చూస్తారు.


మండల స్థాయిలో ప్రత్యేక వ్యవస్థ 


మండల స్థాయి అధికారులతో కూడా బృందాలు ఒక రోజంతా సచివాలయాల్లోనే ఉండి సమస్యలను పరిష్కరిస్తారు ప్రతి మండలంలో ప్రతి రోజూ 2 సచివాలయాలు కవర్‌ అవుతాయి. జూలై 1వ తేదీ నుంచి కూడా ఈ ‍క్యాంపులను నిర్వహిస్తారు. ఎలాంటి చార్జీలు లేకుండానే ఈసేవలు అందిస్తారు. 26 జిల్లాలకు ప్రత్యేక సీనియర్‌ అధికారులను పర్యవేక్షక అధికారులుగా నియమించారు.  అన్ని క్యాంపుల్లో కూడా సేవలు అందుతన్న తీరుపై తనిఖీలు చేస్తారు. ఈ కార్యక్రమం జరుగుతున్న తీరుపై జిల్లా కలెక్టర్లు రోజువారీ సమీక్షలు చేస్తారు. వారానికి ఒకరోజు సీఎంఓ, చీఫ్‌ సెక్రటరీలు మానిటరింగ్‌ చేస్తారు. సచివాలయాల్లో క్యాంపులో నిర్వహించేటప్పుడు సదుపాయాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.క్యాంపులు జరుగుతున్నప్రుడు కచ్చితంగా ఎమ్మెల్యేలు సందర్శించాలని సీఎం జగన్ ఆదేశించారు.